BigTV English
Advertisement

OTT Movie : 8000 లీటర్ల బ్లడీ బ్లడ్ బాత్… బ్రూటల్ క్లైమాక్స్ మావా… గుండె ధైర్యం ఉంటేనే ఈ హర్రర్ మూవీని చూడండి

OTT Movie : 8000 లీటర్ల బ్లడీ బ్లడ్ బాత్… బ్రూటల్ క్లైమాక్స్ మావా… గుండె ధైర్యం ఉంటేనే ఈ హర్రర్ మూవీని చూడండి

OTT Movie : పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ సినిమా పేరు చెప్తే భయపడతారో, ప్యాంట్లు తడుపుకుని పారిపోతారో ఆ సినిమా పేరే ఈవిల్ డెడ్. 1981లో మొదలైన ఈ ప్రభంజనం ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. అసలు ఏ అంచనాలు లేకుండా, థియేటర్ల వరకూ వెళ్తుందో లేదో అనుకున్న ఈ సినిమా , ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటిదాకా ఐదు భాగాలుగా విడుదలై ఆడియన్స్ కి చుక్కలు చూపించింది. ఆరవ భాగం ‘Evil Dead burn’ వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పడు మనం 2023లో వచ్చిన ‘ఈవిల్ డెడ్ రైజ్’ సినిమా గురించి చెప్పుకుందాం. ఈ సినిమా ఒక ఫ్యామిలిలో దెయ్యం ఎంట్రీ ఇచ్చి, అందర్నీ పరుగులు పెట్టిస్తుంది. ఒక్కో సీన్ ఉలిక్కి పడేలా చేస్తుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో ఉందంటే

‘ఈవిల్ డెడ్ రైజ్’ (Evil Dead Rise) ఇది లీ క్రానిన్ డైరెక్ట్ చేసిన అమెరికన్ సూపర్‌ నాచురల్ హారర్ సినిమా. ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీలో 5వ భాగం. ఇందులో లిలీ సల్లివన్ (బెత్), అలిస్సా సథర్‌ల్యాండ్ (ఎల్లీ), మోర్గాన్ డేవిస్ (డాన్నీ), గాబ్రియెల్ ఎచోల్స్ (కాసీ), నెల్ ఫిషర్ (కాస్సీ) నటించారు. 1 గంట 58 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి ఐయండిబిలో 6.5/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2023 ఏప్రిల్ 21 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ప్రస్తుతం Amazon Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే

లాస్ ఏంజిల్స్‌లో ఎల్లీ అనే సింగిల్ మదర్, తన ముగ్గురు పిల్లలు (డాన్నీ, కాసీ, చిన్న కాస్సీ) తో ఒక పాత అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది. ఎల్లీ కష్టపడి పని చేస్తూ పిల్లలను పెంచుతుంది. ఆమె సోదరి బెత్ ఒక రోజు వాళ్ల ఇంటికి వస్తుంది. బెత్, ఎల్లీ మధ్య కొన్ని గొడవలు ఉన్నా కానీ వాళ్ళు కలిసి సరదాగా ఉంటారు. ఒక రోజు ఉన్నట్టుండి ఒక భూకంపం వస్తుంది. దీంతో అపార్ట్‌మెంట్ గారేజ్‌లో ఒక సీక్రెట్ రూమ్ బయటపడుతుంది. డాన్నీ అక్కడ “నెక్రోనోమికాన్” అనే ఒక భయంకర బుక్, కొన్ని వినైల్ రికార్డులను చూస్తుంది. డాన్నీ ఆ బుక్‌ను తెరిచి ఒక రికార్డ్ ప్లే చేస్తాడు. అంతే ఇక డెమన్స్ ఎల్లీని మొదట పాసెస్ చేస్తాయి.


Read Also : టూరిస్ట్ గైడ్‌తో యవ్వారం… అమ్మాయి మిస్సింగ్‌తో ఊహించని టర్న్… బోన్ చిల్లింగ్ థ్రిల్లర్

ఎల్లీ ఒక్కసారిగా భయంకరంగా మారి, తన పిల్లలను, బెత్‌ను దాడి చేయడం మొదలెడుతుంది. ఆమె కళ్లు, మాటలు, చేష్టలు పూర్తిగా డెమన్‌లా మారిపోతాయి. బెత్, పిల్లలు భయంతో ఇంట్లో దాక్కుంటారు. కానీ అపార్ట్‌మెంట్‌లో ఎక్కడా సేఫ్ జోన్ ఉండదు. డాన్నీ ప్లే చేసిన రికార్డ్‌లో ఒక పాత పాస్టర్ మాటలు ఉంటాయి. అందులో నెక్రోనోమికాన్ బుక్ గురించి, డెమన్స్ ఎలా వస్తాయో వివరంగా ఉంటాయి. బెత్ మరో రికార్డ్ విని, డెమన్స్‌ను ఆపడానికి ఒకే వే ఉందని తెలుసుకుంటుంది. అయితే ఎల్లీ పూర్తిగా డెమన్‌గా మారి, ఒక్కొక్కరినీ టార్గెట్ చేస్తుంది. బెత్ చివరకు ఎల్లీని, డెమన్స్‌ను ఓడించడానికి ఒక భయంకర ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ ఏమిటి ? బెత్ డెమన్స్‌ను కంట్రోల్ చేస్తుందా ? డెమన్స్‌ కి వీళ్ళు బలవుతారా ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : కంటికి కన్పించని అమ్మాయితో ఆ పని… ఇంత ఓపెన్ గా ఎలారా అయ్యా ? ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్

OTT Movie : అమ్మాయిలను చంపే సైకో … బ్లైండ్ లేడీ ఇన్వెస్టిగేషన్ … మిస్ అవ్వకుండా చూడాల్సిన తమిళ్ థ్రిల్లర్

OTT Movie : 43 అవార్డులను గెలుచుకున్న సిరీస్… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులు… తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie : నెట్ ఫ్లిక్స్ లో ఉన్న తోపు కే-డ్రామాలు… IMDb లో 8.5 కంటే ఎక్కువ రేటింగ్‌… ఇందులో మీరెన్ని చూశారు ?

OTT Movie : తండ్రి కళ్ళముందే పక్కింటోడితో ఆ పని… చదువుకోవాల్సిన వయసులో ఇదేం పాడు పని పాపా?

OTT Movie : ఓటీటీలో గత్తర లేపుతున్న 1 గంట 52 నిమిషాల థ్రిల్లర్ డ్రామా… క్షణక్షణం ఉత్కంఠ… IMDb లో 7.1 రేటింగ్

OTT Movie : మొదటి రాత్రే వదిలేసే భర్త… ఫొటోగ్రాఫర్ తో పని కానిచ్చే భార్య… మనసుకు హత్తుకునే రొమాంటిక్ డ్రామా

Big Stories

×