BigTV English
Advertisement

Illu Illalu Pillalu Today Episode: కొడుకుల ప్రేమతో రామ రాజు ఫిదా.. ఘనంగా దీపావళి పూజ..ధీరజ్ కోసం పోలీసుల రాక..

Illu Illalu Pillalu Today Episode: కొడుకుల ప్రేమతో రామ రాజు ఫిదా.. ఘనంగా దీపావళి పూజ..ధీరజ్ కోసం పోలీసుల రాక..

Illu Illalu Pillalu Today Episode October 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. తాగిన మత్తులో రొమాంటిక్ సాంగ్ తో రచ్చ చేస్తుంది. నువ్వు నాకు ముద్దు పెట్టావా లేదా చెప్పు అని ప్రేమ ఎంత అడిగినా ధీరజ్ చెప్పకుండా ఇంట్లోకి వెళ్లిపోతాడు. చీర మార్చుకుని వచ్చిన ప్రేమ యేల యేలా పాటకు డ్యాన్స్ వేస్తుంది. వేదవతి నర్మద ఇద్దరు నిద్రలేచి ప్రేమ  కొంప ముంచేలా ఉంది అని బయటకు వస్తారు. ప్రేమతో కలిసి ముగ్గురు అదిరిపోయే డాన్స్ వేస్తారు.. వాళ్ళు లోపలికి వెళ్లి వాళ్ళ భర్తలతో డాన్సులు వేస్తారు. ధీరజ్ తో ప్రేమ డాన్స్ వేయిస్తుంది. అరె ధీరజ్ నువ్వు నాకు ముద్దు పెట్టావా లేదా అని అడుగుతుంది. నీకు నేను ముద్దు పెట్టలేదే అని అనగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఉదయం లేవగానే ప్రేమ రాత్రి చేసిన రచ్చని తెలుసుకొని శ్రీవల్లి టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది.. మళ్లీ నేను ప్రేమకు దొరక్కుండా ఉండాలి అని కంగారుపడుతూ బయటికి వస్తుంది.. ఇప్పుడే ప్రేమ బల్లి అక్క అని పిలుస్తుంది.. నర్మదా వేదవతి ఇద్దరు కలిసి రాత్రి జరిగింది సీన్ టు సీన్ చూపిస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. నిన్నటి ఎపిసోడ్ హైలైట్ వచ్చేసి రామరాజు తెచ్చిన బట్టలను తన కొడుకులు నచ్చాయని చెప్పడంతో తిరుపతి బొమ్మరిల్లు సీన్ చూపిస్తాడు. ముగ్గురు కోడళ్ళు కూడా కొడుకులు చేస్తున్న సీన్ చూసి నవ్వుకుంటారు.. తండ్రి కొడుకుల సెంటిమెంట్ సీన్ తిరుపతి కోరస్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇక కోడళ్ళకు వేదవతి చీరలు తెచ్చి ఇస్తుంది. ముగ్గురు కోడలు మా అత్తయ్య బంగారం అంటూ మెచ్చుకొని ఆ చీరల్ని కట్టుకొని వస్తామని అంటారు.. ఇంట్లో దీపావళి పూజ చేయాలి ముగ్గురు కోడలు కొడుకులు రావాలి అని పంతులుగారు పిలుస్తారు.

ఇక ముగ్గురు కొడుకులు కోడలు అత్తమామలు తెచ్చిన బట్టలను కట్టుకొని పూజకు వస్తారు. ముగ్గురు కొడుకులు కి తాను తెచ్చిన బట్టలు బాగా సూట్ అయ్యాయి అని రామరాజు సంబరపడిపోతూ ఉంటాడు.. ఈ కలరు ఈ డ్రెస్సు నీకు బాగా సెట్ అయ్యారా అని ముగ్గురి కొడుకులు చూసి మెచ్చుకుంటారు. ఇక ఒక్కొక్క జంట ఒక్కొక్కసారి వచ్చి పూజలో పీటల మీద కూర్చుంటారు.. వేదవతి రామరాజు తన ముగ్గురు కొడుకులను కోడలను చూసి మూడు జంటలు చూడముచ్చటగా ఉన్నారు.. వీళ్ళని చూస్తూ ఉంటే నా కళ్ళు చల్లబడిపోతున్నాయి. కడుపు నిండిపోతుంది అంటూ వేదవతి పొగడ్తల వర్షం కురిపిస్తుంది..


పూజ చేస్తున్న సమయంలో ప్రేమ బ్లౌజ్ కున్న దారం ధీరజ్ చొక్కాకు ఉన్న గుండీకి తగులుకుంటుంది.. ఏంటే కావాలని తగిలిస్తున్నావా అని ధీరజ్ అడుగుతాడు. ప్రేమ ఆ అవును కావాలనే తగిలించను నిన్ను ఆనుకొని రాసుకుంటూ పూసుకుంటూ పూజ చేస్తే బాగుంటుందని అని వెటకారంగా మాట్లాడుతుంది. వాళ్ళిద్దరి బాధని చూసి నన్ను నర్మదా వేసిన ముడి అంత త్వరగా విడిపోదు అని అంటుంది. మొత్తానికి ధీరజ్ ప్రేమల మధ్య ప్రేమ ఉందని దేవుడు సాక్షిగా రుజువు అవుతుంది.

Also Read : కార్తీ- లోకీ సినిమా ముహూర్తం ఫిక్స్.. సెట్స్ మీదకు అప్పుడేనా..?

ఒకవైపు పూజ జరుగుతూ ఉండగ.. ధీరజ్ కోసమని పోలీసులు అక్కడికొస్తారు.. దీరజ్ ఎవరు అని అడుగుతారు.. నేనే సార్ ఏంటి ప్రాబ్లం చెప్పండి అని ధీరజ్ అంటాడు. ఏం లేదు నిన్న ఒక అమ్మాయిని మీరు క్యాబ్ ఎక్కించుకున్నారు కదా.. ఆ అమ్మాయి మిస్సయింది. వాళ్ల నాన్న క్యాబ్ డ్రైవర్ అయినా నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. దాని ప్రకారమే మేము ఇక్కడికి వచ్చేసాము మీరు మాకు కోఆపరేట్ చేయాలి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదండి అని ధీరజ్ని తీసుకుని వెళ్తారు. వెనకాల రామరాజు తో పాటు మిగిలిన వాళ్ళందరూ మా అబ్బాయి అలాంటివాడు కాదండి. ఎక్కడో ఏదో జరిగింది అమ్మాయిని ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారేమో అని అంటూ వస్తారు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ధీరజ్ పై కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ధీరజ్ ని జైలుకు పంపిస్తారేమో చూడాలి..

Related News

Nindu Noorella Saavasam Serial Today october 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు యాక్సిడెంట్‌ చేసిన మనోహరి

Intinti Ramayanam Today Episode: జాబ్ లో జాయిన్ అయిన కమల్.. అక్షయ్ కు షాకిచ్చిన లాయర్.. పల్లవికి ఝలక్..

GudiGantalu Today episode: బాలు మనసును గెలిచిన మీనా.. శోభాపై ఫైర్.. సత్యం బాలు మధ్య పెరిగిన దూరం..

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Nindu Nurella Savasam: ‘నిండు నూరేళ్ల సావాసం ‘ ఆరు రియల్ లైఫ్.. ఒక్కరోజుకు అన్ని వేలా..?

Big tv Kissik Talks: విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్.. ఆ పని మాత్రం చేయనన్న కస్తూరి?

BigKissik Talks: పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పై కస్తూరి కామెంట్స్.. సీఎం అయితే ఆపని చేస్తా అంటూ!

Big Stories

×