BigTV English
Advertisement

OTT Movie : 43 అవార్డులను గెలుచుకున్న సిరీస్… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులు… తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie : 43 అవార్డులను గెలుచుకున్న సిరీస్… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులు… తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie : ఈ సమయం వెబ్ సిరీస్‌ల ట్రెండ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రేక్షకులు వీటిని ఆదరిస్తున్న తీరు కూడా అలానే ఉంది. వీటిలో కూడా రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కుతున్న స్టోరీలు ప్రజాదరణ పొందుతున్నాయి. అలాంటి వెబ్ సిరీస్ లలో ‘రాకెట్ బాయ్స్’ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఐయండిబిలో దీనికి 8.9 రేటింగ్‌ ఉండటం, ఈ సిరీస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిపోతుంది. అంతేకాదు 43 అవార్డులను అందుకుని, అందరి చేత ఈ సిరీస్ ప్రశంసలు అందుకుంది. ఇది ఇండియన్ టెలివిజన్‌లో ఉత్తమ వెబ్ సిరీస్‌గా అకాడమీ అవార్డును అందుకుంది. నటుడు జిమ్ సర్భ్ ఈ సిరీస్‌కు ఉత్తమ నటుడిగా దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు. ఫిల్మ్‌ఫేర్ ఈ సిరీస్‌కు ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ వెబ్ సిరీస్ ను అభయ్ పన్నుకు ప్రదానం చేసింది. ఇలాంటి అవార్డులను పొందిన ఈ కథ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

‘రాకెట్ బాయ్స్’ (Rocket Boys) ఇది అభయ్ పన్ను డైరెక్ట్ చేసిన హిందీ బయోగ్రాఫికల్ వెబ్ సిరీస్. దీనికి సిద్ధార్థ్ రాయ్ కపూర్, మానిషా అద్వాని ప్రొడ్యూస్ చేశారు. ఇందులో జిమ్ సార్భ్ (హోమీ భాభా), ఇష్వక్ సింగ్ (విక్రమ్ సరాభాయి), రెజీనా కాసాండ్రా (మర్గరెట్ రీడ్), సబా అజాద్ (పరీజాత్), రాజ్ అత్తర్ (ఏ.పి.జె. అబ్దుల్ కలాం), డినేష్ హింగ్గర (శాంతి స్వరూప్ భట్నాగర్) నటించారు. ఈ సిరీస్ సీజన్ 1 : 2022 ఫిబ్రవరి 4, సీజన్ 2 : 2023 మార్చి 16 నుంచి SonyLIV లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐయండిబిలో దీనికి 8.9/10 రేటింగ్ ఉండటం విశేషం. ఈ సిరీస్ భారత అణు శక్తి పితామహుడు విక్రమ్ సారాభాయ్, భారత స్పేస్ ప్రోగ్రాం స్థాపకుడు హోమీ జహంగీర్ భాభా, జీవిత చరిత్రల ఆధారంగా రూపొందించబడింది.

స్టోరీలోకి వెళ్తే

సీజన్ 1 : 1940కాలంలో భాభా ఒక బ్రిలియంట్ ఫిజిక్స్ సైంటిస్ట్. కేమ్‌బ్రిడ్జ్‌లో చదువుకుని భారత్‌కు తిరిగి వస్తాడు. బ్రిటిష్ రూల్‌లో భారతదేశానికి సైన్స్ ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాడు. దీంతో అతను తాంటా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (TIFR) స్థాపిస్తాడు. భారత అణు శక్తి ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాడు. ఈ సమయంలో భాభా పార్వతీ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ అతని వర్క్ వల్ల ఫ్యామిలీ టెన్షన్ వస్తుంది. భాభా భారతదేశానికి అణు శక్తి కావాలని, శాంతి కోసం పవర్ అవసరమని ఫైట్ చేస్తాడు. అతను CV రామన్, శాంతి స్వరూప్ భట్నాగర్ తో కలిసి ప్రయోగాలు చేస్తాడు. చివరి ఎపిసోడ్‌లో భాభా అణు రియాక్టర్ ‘అప్సరా’ ను లాంచ్ చేస్తాడు. ఆ తరువాత భారతదేశం అణు శక్తి దేశంగా మారుతుంది.


Read Also : భార్యాభర్తల మధ్యలోకి మరొకరు… వెన్నులో వణుకు పుట్టించే సీన్లు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

సీజన్ 2 : 1960 కాలంలో సరాభాయి అహ్మెదాబాద్‌లో కాటన్ మిల్ ఓనర్ గా ఉంటాడు. కానీ అతనికి స్పేస్ సైన్స్ ప్యాషన్. దీంతో అతను ISRO స్థాపిస్తాడు. ఈ సమయంలో సరాభాయి కూడా ప్రేమలో పడతాడు. అతను A.P.J. అబ్దుల్ కలాంతో కలిసి రాకెట్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాడు. సరాభాయి భారతదేశానికి స్పేస్ పవర్ కావాలని, శాంతి కోసం సైన్స్ అవసరమని భావిస్తాడు. చివరి ఎపిసోడ్‌లో సరాభాయి మొదటి రాకెట్ లాంచ్ చేస్తాడు. భారతదేశం స్పేస్ పవర్ అవుతుంది. సరాభాయి కూడా మరణిస్తాడు. భారతదేశ చరిత్రలో ఈ శాస్త్రవేత్తల గొప్పదనాన్ని ఈ సిరీస్ చూపిస్తుంది.

 

Related News

OTT Movie : కంటికి కన్పించని అమ్మాయితో ఆ పని… ఇంత ఓపెన్ గా ఎలారా అయ్యా ? ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్

OTT Movie : అమ్మాయిలను చంపే సైకో … బ్లైండ్ లేడీ ఇన్వెస్టిగేషన్ … మిస్ అవ్వకుండా చూడాల్సిన తమిళ్ థ్రిల్లర్

OTT Movie : 8000 లీటర్ల బ్లడీ బ్లడ్ బాత్… బ్రూటల్ క్లైమాక్స్ మావా… గుండె ధైర్యం ఉంటేనే ఈ హర్రర్ మూవీని చూడండి

OTT Movie : నెట్ ఫ్లిక్స్ లో ఉన్న తోపు కే-డ్రామాలు… IMDb లో 8.5 కంటే ఎక్కువ రేటింగ్‌… ఇందులో మీరెన్ని చూశారు ?

OTT Movie : తండ్రి కళ్ళముందే పక్కింటోడితో ఆ పని… చదువుకోవాల్సిన వయసులో ఇదేం పాడు పని పాపా?

OTT Movie : ఓటీటీలో గత్తర లేపుతున్న 1 గంట 52 నిమిషాల థ్రిల్లర్ డ్రామా… క్షణక్షణం ఉత్కంఠ… IMDb లో 7.1 రేటింగ్

OTT Movie : మొదటి రాత్రే వదిలేసే భర్త… ఫొటోగ్రాఫర్ తో పని కానిచ్చే భార్య… మనసుకు హత్తుకునే రొమాంటిక్ డ్రామా

Big Stories

×