BigTV English

Bigg Boss 9 Telugu : హౌస్ లోకి జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్.. మిమిక్రికి ఆడియన్స్ ఫిదా..

Bigg Boss 9 Telugu : హౌస్ లోకి జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్.. మిమిక్రికి ఆడియన్స్ ఫిదా..

Bigg Boss 9 Telugu : తెలుగు బుల్లితెరపై టాప్ రియాల్టీ షో గా కొనసాగుతున్న ఏకైక షో బిగ్ బాస్.. ఇప్పటికే 8 సీజన్లను పూర్తి చేసుకుంది.. గత కొన్ని రోజులుగా సీజన్ 9 గురించి వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇవాళ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ గా ప్రారంభమైంది.. కొన్ని నిమిషాల క్రితమే ఈ సీజన్ ప్రారంభమైంది. గతంలో ఎన్నడు లేనివిధంగా నాగార్జునకి టాస్కులు మీద టాస్కులు ఇచ్చి మరి హౌస్ లోకి తీసుకెళ్లారు బిగ్ బాస్. సామాన్యులకు సంబంధించిన అగ్ని పరీక్ష గురించి నాగార్జున స్టేజ్ మీద చెప్పారు. అనంతరం మొదటి కంటెస్టెంట్ గా తనుజ గౌడ ఎంట్రీ ఇచ్చింది. రెండు కంటెస్టెంట్ గా ఫ్లోరా షైనీ ఎంట్రీ ఇచ్చింది. నాలుగో కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ ఈమె సంబందించిన వీడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ గురించి తెలుసుకుందాం..


హౌస్ లోకి రాకముందే పులిహోర కలిపేశాడు..

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 కాసేపటి క్రితమే ప్రారంభమైంది.. ఫస్ట్ కంటెస్టెంట్ గా ముద్దమందారం సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ ఎంట్రీ ఇచ్చింది.. రెండో కంటెస్టెంట్ గా ఫ్లోరా షైనీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.. మూడో కంటెంట్ గా కళ్యాణ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం నాలుగో కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఇమ్మానియేల్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. అతనికి సంబంధించిన వీడియో క్లిప్ ని బిగ్ బాస్ ప్లే చేశారు. తన తల్లిదండ్రుల గురించి వాళ్లు పడుతున్న కష్టాల గురించి అతను ఆ వీడియోలో వివరించారు. అనంతరం సినిమాల్లోకి రావాలని నటుడుగా తన సత్తాను చాటాడని ఆ వీడియోలో ఇమ్ము చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


మిమిక్రీతో అదరగొట్టిన ఇమ్మూ…

జబర్దస్త్ ఇమ్మానుయేల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పటాస్ షో ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను తన స్కిట్ లతో కామెడీతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అలా ఒక్కో షోతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ప్రస్తుతం బుల్లితెరపై టాప్ కమెడియన్లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. తాజాగా టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇవ్వడంతోనే ఆడియో క్లిప్ తో ఆకట్టుకున్న ఇమ్మానియేల్ స్టేజ్ మీద చిరంజీవిలాగా మాట్లాడి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. అనంతరం విజయ్ దేవరకొండ లాగా మాట్లాడి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇమ్మానియేల్ టాస్కులలో ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ నేను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

 

Related News

Bigg Boss 9 Telugu : పచ్చళ్ళ పాప బిగ్ బాస్ లోకి రాలేదు.. ఏం జరిగిందబ్బా..?

Bigg Boss 9 Prize Money: ఆహా.. ఈ సారి అదిరిపోయే ప్రైజ్ మనీ.. అందుకే గోప్యంగా ఉంచారా? విన్నర్‌కు పండగే!

Nagarjuna Remuneration: బిగ్ బాస్ 9తో నాగార్జున సరికొత్త రికార్డు.. ఈ సారి అన్ని కోట్లా? కింగ్ అనిపించుకున్నాడుగా!

Commoners vs Celebrities : రెండు ఇళ్ల పంపకం… ఎవరికి ఏ ఇళ్లు ఇచ్చారంటే?

Bigg Boss 9 Telugu : హౌస్ లోకి ఫోక్ సింగర్.. అప్పుడు మిస్ వరల్డ్.. ఇప్పుడు బిగ్ బాస్..

Bigg Boss Telugu season 9: ఆ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ అక్క… 10వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి

Big Stories

×