Shrasti Verma : సృష్టి వర్మ ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పేరు ఒకప్పుడు సంచలనం. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ ఈ పర్సన్ వలన ఎన్ని ఒడిదుడుకులు దాటారు అని అందరికీ తెలిసిన విషయమే.
అయితే ఈ విషయంలో నిజ నిజాలు ఎవరివి ఎవరికీ పూర్తిగా తెలియదు. కొంచెం లేట్ అయినా కూడా నిజాలు అనేవి బయట పడుతూనే ఉంటాయి. జానీ మాస్టర్ అసిస్టెంట్ గా సృష్టి వర్మ మంచి పేరు సాధించారు. జానీ మాస్టర్ వెర్షన్ లో ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. అలానే సృష్టి వర్మ వెర్షన్ లో ఆవిడ కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఏవి నిజాలు అని ఎవరికి తెలియదు.
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశేషమైన ఆదరణ ఈ షోకి లభించింది. ప్రస్తుతం ఈ షోలో 5వ కంటెస్టెంట్ గా జానీ మాస్టర్ అసిస్టెంట్ సృష్టి వర్మ ఎంట్రీ ఇచ్చారు. ఈ షో లో మనుషుల యొక్క అసలైన వ్యక్తిత్వం ఏమిటో బయటపడుతుంది. ఇప్పుడు కూడా చాలామంది సృష్టి వర్మ యొక్క అసలైన వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీతో ఉన్నారు. దానితోపాటు నాగార్జున కూడా రియల్ పర్సన్ ఇప్పుడు బయటకు వస్తుంది అని మాట్లాడారు. దీనిని బట్టి జానీ మాస్టర్ కేసు విషయంలో ఒక అవగాహన కూడా వస్తుందిని చాలామంది అభిప్రాయం.