Mass Jathara : బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సినిమా సక్సెస్ కావాలి అంటే ముఖ్యంగా కావాల్సింది ఒక బలమైన కథ. ఒక అద్భుతమైన కథకు సరైన పాత్రలు దొరికితే ఆ సినిమా ఫలితం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే సరైన కథ లేకుండా స్టార్ హీరోలను పెట్టి సినిమాలు తీసినా కూడా ఆ ఫలితాలు నిరాశ పరుస్తూనే ఉంటాయి. చాలామంది స్టార్ హీరోలు సినిమా చూసినా కూడా ప్రేక్షకులకు అవి నచ్చలే అంటే కథ బాగుండాలి. ఒక మామూలు కథకు అద్భుతమైన క్యారెక్టర్రైజేషన్ క్రియేట్ చేసిన అది వర్కౌట్ అవుతుంది.
అయితే కథను రాసే రచయిత దర్శకుడు కి ఒక అద్భుతమైన ఎట్మాస్పియర్ ఉంటే తన ఆలోచనలు కూడా బాగుంటాయి. చాలామంది రచయితలకు ఒకప్పుడు సరైన ఫెసిలిటీస్ మరియు గుర్తింపు దక్కేది కాదు. ఒక సందర్భంలో ప్రముఖ రైటర్ పోశాని కృష్ణమురళి తన అసిస్టెంట్ రైటర్స్ ను సరిగ్గా చూసుకోకపోతే నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో రచయితలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ రచయితలు కూడా దర్శకులుగా మారుతున్నారు. అలా రచయితగా మంచి పేరు సంపాదించుకున్నాడు భాను భోగవరపు. మాస్ జాతర సినిమాతో భాను దర్శకుడుగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో భాను సినిమా చేస్తున్నాడు. మాస్ జాతర సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో నిర్మాత నాగవంశీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశాడు. నాగ వంశీ బయట కనిపించినప్పుడు చాలా అగ్రెసివ్ గా అనిపిస్తారు. కానీ ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు.
చాలా సింపుల్ గా ఉండే పాజిటివ్ పర్సన్. ముఖ్యంగా దర్శకులను చాలా బాగా చూసుకుంటారట. సితార ఎంటర్టైన్మెంట్ ఆఫీసులో ఒక్కో దర్శకుడు కి ఒక్కో ఫ్లోర్ ఆయన కేటాయించారట. అనుదీప్, వెంకీ అట్లూరి, కళ్యాణ్ శంకర్, మరియు దర్శకుడు భానుకి ఒక్కొక్క ఫ్లోర్ సితార ఎంటర్టైన్మెంట్ ఆఫీసులో ఉంది.
అయితే ఏకంగా ఒక ఫ్లోర్ మొత్తం ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉంటుంది అని భాను రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
మామూలుగా కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఒక సినిమా చేయటానికి చాలా టైం తీసుకుంటాయి. కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మాత్రం ఒక సినిమా లేట్ అవుతుంది అంటే ఇమీడియట్గా ఇంకో ప్రాజెక్ట్ ఎక్కిస్తారు.
అనగనగా ఒక రాజు సినిమాతో కళ్యాణ్ శంకర్ దర్శకుడుగా పరిచయం అవ్వాలి. కొన్ని కారణాల వలన ఆ సినిమా పట్టాలెక్కపోతే మ్యాడ్ అనే సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. అదే బ్యానర్లో మ్యాడ్ స్క్వేర్ సినిమా కూడా చేశాడు. వెంకీ అట్లూరి ఇప్పుడు ఆ బ్యానర్లో 4వ సినిమా చేస్తున్నాడు. ఆ బ్యానర్ లో ఒక సినిమా హిట్ అయితే చాలు దర్శకుడని బయటకు వదులుకోవడానికి ఇష్టపడరు అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
Also Read: Mamitha Baiju: అదృష్టం అంటే ఈ అమ్మాయి ఇదే, నచ్చిన స్టార్లతో అవకాశం