 
					Mamitha Baiju: ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అంటుంటారు. కొంతమందిని పరిశీలిస్తే అది నిజమేమో అనిపిస్తుంది. ఇండస్ట్రీలో హీరోయిన్ గాసెటిల్ అవడం అనేది మామూలు విషయం కాదు. కొంతమందికి ఫస్ట్ సినిమా హిట్టు వచ్చినా కూడా వాళ్లు హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఉండిపోలేరు. మొదటి సినిమా డిజాస్టర్ అయినా కూడా కొంతమంది ఇండస్ట్రీలో వరుస అవకాశాలు పొందుకుంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీ లీల.
పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల ఆ సినిమా సక్సెస్ సాధించక పోయినా కూడా తెలుగులో బిగ్గెస్ట్ సినిమాలు చేస్తూ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. మలయాళం లో విడుదలైన ప్రేమలు సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ రూపంలో వచ్చింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకుంది మమిత. ఇప్పుడు మమిత కి కూడా సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. రీసెంట్గా ప్రదీప్ రంగనాథన్ తో కలిసి నటించిన డ్యూడ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది.
చాలామందికి వాళ్లకు ఇష్టమైన హీరోతో పని చేయాలి అని ఉంటుంది. ఇప్పుడు మమిత టైం బాగా నడుస్తుంది అని చెప్పాలి. ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ తో మంచి అవకాశాలు పొందుకుంటుంది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఒక సినిమాలో నటిస్తున్న సంగతే తెలిసిందే. సూర్య కెరియర్ లో వస్తున్న 46వ సినిమా ఇది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అందుకే ఈ బ్యానర్ నుంచి రిలీజ్ అయిన మాస్ మహారాజా సినిమా ఈవెంట్ కి కూడా సూర్య గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సినిమాలో సూర్యదర్శన మమిత నటిస్తోంది.
ధనుష్ తన కెరియర్ లో 54వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ ఉంటాడు. రఘువరన్ బీటెక్ 25వ సినిమా అయితే ఇప్పటికి దాదాపు 50 సినిమాలు పూర్తి. అంటే తక్కువ టైంలో పాతిక సినిమాలు పైగా చేసేసాడు. ధనుష్ 54 వ సినిమాలో మమిత నటిస్తుంది.
సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే సినిమాలకు ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్ వస్తుంటారు. అలానే చాలా తమిళ్ సినిమాలు కూడా తెలుగులో సంక్రాంతి సీజన్ కు రిలీజ్ అవుతుంటాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సరసన మమిత నటిస్తుంది. సౌత్ ఇండియన్ లో నెక్స్ట్ వినిపించే బిగ్గెస్ట్ నేమ్ మమిత.
Also Read: Baahubali The Epic :వెయిట్ చేయక్కర్లేదు, బాహుబలి చేంజెస్ కాకుండా ఇవి ఆడ్ చేశారు