IND W VS AUS W: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025) ఫైనల్ దశకు వచ్చింది. ఇవాళ రెండో సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మహిళల జట్ల ( Australia Women vs India Women, 2nd Semi-Final) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. నవి ముంబైలోని డివై పాటిల్ స్టేడియం (Dr DY Patil Sports Academy, Navi Mumbai) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా చివరి వరకు కొనసాగింది. టీమిండియా అలాగే ఆస్ట్రేలియా జట్లు నువ్వా నేనా అన్న రేంజ్ లో తలపడ్డాయి. కానీ చివరికి ఈ రెండో సెమీ ఫైనల్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును మట్టి కరిపించింది టీమిండియా. సెంచరీతో చెలరేగిన జెమిమా రోడ్రిగ్స్ టీమిండియాను గెలిపించారు. ఆస్ట్రేలియా విధించిన 338 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు నష్టపోయి 48.3 ఓవర్లలో చేధించింది టీమిండియా. దీంతో 5 వికెట్ల తేడాతో ఇండియా గెలిచి, ఫైనల్ కు వెళ్లింది.
రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా లేడీస్ స్టార్ జెమిమా రోడ్రిగ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఈ మ్యాచ్ లో ప్రమాదకరమైన బ్యాటింగ్ చేసి దుమ్ము లేపింది. కేవలం 115 బంతుల్లోనే సెంచరీ చేసిన జెమిమా రోడ్రిగ్స్.. చివరి వరకు ఉండి జట్టును ఫైనల్ కు చేర్చారు. ఈ మ్యాచ్ లో చివరి వరకు నిలిచిన జెమిమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 127 పరుగులు చేసి దుమ్ము లేపారు. ఇందులో 14 బౌండరీలు కూడా ఉన్నాయి. 94.78 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపిన జెమిమా రోడ్రిగ్స్.. జట్టును గెలిపించే వరకు పట్టు వదలలేదు. ఇక చివరలో అమన్ జ్యోత్ కౌర్ విన్నింగ్ షాట్ ఆడి, టీమిండియాను ఫైనల్ కు చేర్చారు. అటు టీమిండియా కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ 88 బంతుల్లోనే 89 పరుగులు చేసి దుమ్ము లేపింది. ఆమె 89 పరుగుల వద్ద ఔట్ అయినప్పటికీ మంచి భాగస్వామ్యాన్ని మాత్రం జట్టు కోసం నెలకొల్పింది. కీలక సమయంలో జట్టుకు సహాయ సహకారాలు అందించింది. ఇక ఫైనల్ లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం అంటే నవంబర్ రెండవ తేదీన జరగనుంది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్ లో కంగారులు మొదట బ్యాటింగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కంగారు జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి కుప్పకూలింది. 31 అడుగుల వరకు దాటిగా ఆడిన కంగారు జట్టు.. ఆ తర్వాత తొందరగానే ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియాకు సంబంధించిన ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 93 బంతుల్లో 119 పరుగులు చేసి దుమ్ము లేపింది. అలాగే ఎల్లీస్ పెర్రీ 85 బంతుల్లో 77 పరుగులు చేసింది. ఆష్లీ గార్డనర్ 63 పరుగులు చేసి రాణించడంతో 338 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. అయితే ఆ లక్ష్యాన్ని టీమిండియా.. చాలా కష్టపడి చేదించింది. జెమిమా రోడ్రిగ్స్ రెచ్చిపోయి ఆడటంతో టీమిండియా విజయం సాధించి, ఫైనల్స్ కు చేరింది.
Jemimah Rodrigues – "This victory is for you, Harmanpreet Kaur" pic.twitter.com/yxhNQMCRsr
— Richard Kettleborough (@RichKettle07) October 30, 2025