Baahubali The Epic : ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా నేడు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ అప్పుడు చాలామంది ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎలా ఎదురు చూశారో? రీ రిలీజ్ కోసం కూడా అదే స్థాయిలో ఎదురు చూశారు అనడంలో తప్పులేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 120 షో లు ఈరోజు బాహుబలి సినిమాకి సంబంధించి పడ్డాయి. యాదృచ్ఛికంగా అన్ని షోలు కూడా హౌస్ ఫుల్ అయిపోయాయి. అంటే బాహుబలి సినిమా పైన ఇప్పటికీ ప్రేక్షకులకి ఎంత ఆసక్తి ఉందో ఈ హౌస్ ఫుల్ బోర్డ్స్ చూస్తుంటే అర్థమయిపోతుంది. బాహుబలి సినిమా కలెక్షన్లు ఒక సంచలనం. పుష్ప 2 విడుదల కానంతవరకు బాహుబలి కలెక్షన్స్ ఏ హైలెట్. అయితే ఇప్పుడు రీ రిలీజ్ తో ఏ స్థాయి కలెక్షన్స్ వస్తాయో అని క్యూరియాసిటీ చాలామందికి ఎదురైంది.
బాహుబలి సినిమాకి ఫస్ట్ పార్ట్ తెరకెక్కించడానికి దాదాపు 120 కోట్లు అయిపోయింది. అయితే సినిమా విడుదలైనప్పుడు డిజాస్టర్ టాక్ వచ్చినప్పుడు చాలా మంది భయపడిపోయారు. సినిమా చివర్లో బాహుబలిని కట్టప్ప చంపడం అనేది ఆసక్తికరమైన పాయింట్.
కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అని చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ ఉండేది. అది తెలుసుకోవడానికి బాహుబలి 2 సినిమా వచ్చినంత వరకు కూడా చాలామంది ఎదురు చూశారు. అయితే ఇప్పుడు రెండు పార్ట్స్ కూడా ఒకే సినిమాగా వస్తున్నాయి.
ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వల్లో మీరు రెండు సంవత్సరాలు ఎదురు చూడక్కర్లేదు అంటూ ఇంటర్వెల్ కి రాజమౌళి ఒక స్పెషల్ కార్డు వేశారు. ఆ ఆసక్తికర కార్డు ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్ తొలగించినట్లు ఇదివరకే చెప్పారు. అలానే పచ్చబొట్టేసిన అనే పాటను తొలగించారు, అవంతిక లవ్ స్టోరీ ని పూర్తిగా తీసేశారు. ఇరుక్కుపో అనే పాటను కూడా తీసేశారు. అయితే కొన్ని వార్ సీన్స్ కూడా ట్రిమ్ చేసినట్లు చెప్పారు. మాహిష్మతి సామ్రాజ్యానికి బాహుబలి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక హై ఉంటుంది దానిని కూడా కొత్తగా డిజైన్ చేశాడు రాజమౌళి.
ఈ చేంజెస్ తో పాటు రాజమౌళి అవంతిక లవ్ స్టోరీ తీసేసినా కూడా వాయిస్ ఓవర్ తో దానిని కన్వే చేసే ప్రయత్నం చేశారు. ఇది మంచి థాట్ అని చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించి ఓవరాల్ గా బయట రివ్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకి ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో చూడాలి.
Also Read: Bison: U-18 మహిళల కబడ్డీ జట్టుకు మారి సెల్వ రాజ్ విరాళం, ఇది కదా అసలైన వ్యక్తిత్వం