BigTV English
Advertisement

Hydraa: రూ. 111 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా.. స్థానికులు హర్షం వ్యక్తం

Hydraa: రూ. 111 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా.. స్థానికులు హర్షం వ్యక్తం

Hydraa: హైడ్రా.. హైదరాబాద్ ను రూపు రేఖలు మారుస్తోంది. హైడ్రా వచ్చాక వందల ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటుంది. ముఖ్యం ఆక్రమణ దారుల్లో హైడ్రా పరుగులు పెట్టిస్తోంది. ఎక్కడ ఆక్రమణ ఉన్నా వెంటనే అక్కడ వాలిపోయి లెక్కలన్నీ సరిచేస్తోంది. హైడ్రా చేస్తున్న పనుల పట్ల భాగ్యనగర వాసుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల పక్కన ఉన్న భూములను ఆక్రమించుకున్న కబ్జాదారుల్లో వెన్నులో వణకుకు పుట్టిస్తోంది హైడ్రా.. తాజాగా రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో రూ.111 కోట్ల విలువైన భూములను హైడ్రా గుర్తించి స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


⦿ రూ.111 కోట్ల విలువైన భూమి..

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్, బాలాపూర్ మండ‌లాల్లో 976 గ‌జాల పార్కుతో పాటు 1.28 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా గురువారం స్వాధీనం చేసుకుంది.. వీటి విలువ రూ. 111 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని హైడ్రా అధికారులు అంచనా వేశారు. మైలార్‌దేవుప‌ల్లి విలేజ్‌లోని శాస్త్రీపురం కాల‌నీలో 976 గజాల పార్కు స్థ‌లం చుట్టూ గ‌తంలో మున్సిప‌ల్ అధికారులు ఫెన్సింగ్ వేశారు. త‌ప్పుడు డాక్యుమెంట్ల‌తో కొంత‌మంది పార్కు స్థ‌లాన్ని క‌బ్జా చేస్తున్నార‌ని అక్క‌డి నివాసితులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంది.


ALSO READ: CM Chandrababu Naidu: అందరూ చదువుకుంటూ పోతే ఎలా? చంద్రబాబుకు యువకుడి ప్రశ్న.. వీడియో వైరల్!

⦿ పార్కు స్థలం కబ్జాకు గురైందని ఫిర్యాదు..

ఆ వెంటనే బాలాపుర్ మండలంలో పార్కు స్థలాంలో హైడ్రా దిగింది. 1996లో వేసిన హుడా లే ఔట్‌లో పార్కు స్థ‌లం క‌బ్జా అయ్యింద‌ని ఫిర్యాదు చేశారు. వెంట‌నే స్పందించి ఆ స్థ‌లాన్ని హైడ్రా కాపాడింద‌ని స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. బాలాపూర్ మండ‌లం జిల్లేలుగూడ విలేజ్‌లో స‌ర్వే నంబ‌రు 76లోని 1.28 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిలో కూడా ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా గురువారం తొల‌గించింది.

⦿ స్థానికులు హర్షం వ్యక్తం..

కొంత‌మంది ఫేక్ ప‌ట్టాలు సృష్టించి ప్లాట్లుగా విక్ర‌యించ‌డంతో పాటు.. ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ హైడ్రాకు ఫిర్యాదు అంద‌గానే ఈ చ‌ర్య‌లు తీసుకుంది. పార్కుతో పాటు.. ప్ర‌భుత్వ స్థ‌లం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డుల‌ను ఏర్పాటు చేసింది. దీంతో హైడ్రా అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

ALSO READ: Kurnool Bus Fire: కర్నూలు బస్సు ప్రమాదంలో మూడో వాహనం ప్రమేయం.. పోలీసులకు కీలక ఆధారాలు

Related News

TG Govt Schools: గురుకుల, కేజీబీవీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పెండింగ్ బకాయిలు మొత్తం క్లియర్

Azharuddin: అజార్‌కు మంత్రి పదవి.. అందుకేనా!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీజేపీ పరిస్థితి ఏంటీ!

Fee reimbursement Scheme: ఫీజు రియంబర్స్‌మెంట్ వివాదం.. నవంబర్ 3 నుంచి ప్రైవేటు కళాశాలల బంద్?

Chamala Kiran Kumar Reddy: అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర: ఎంపీ చామల

Heavy Rains: తెలంగాణపై మొంథా ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షం, రైతన్నలు జర జాగ్రత్త..!

Azharuddin Oath: రేపే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు, ఎందుకంటే?

Big Stories

×