Womens World Cup 2025 Finals: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ( ICC Womens World Cup 2025) టీమిండియా విజయవంతంగా ఫైనల్ కు చేరుకుంది. ఏడు సార్లు ఛాంపియన్ గా నిలిచిన బలమైన ఆస్ట్రేలియా జట్టును సెమీ ఫైనల్ లో మట్టి కనిపించింది టీమిండియా. ఈ మ్యాచ్ లో ఏకంగా 5 వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 338 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మహిళల జట్టు అవలీలగా ఛేదించింది. ఏ మాత్రం భయం లేకుండా జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) ఆడిన ఇన్నింగ్స్ ఈ టోర్నమెంట్ లోనే హైలెట్ గా నిలిచింది. జెమిమా రోడ్రిగ్స్ చేసిన అద్భుతమైన సెంచరీ దెబ్బకు టీమిండియా విజయం సాధించింది.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో టీం ఇండియా ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. ఫైనల్ కంటే ముందు ఆస్ట్రేలియాపై సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తో ( Harmanpreet Kaur) పాటు జెమిమా రోడ్రిగ్స్ ఇద్దరు అద్భుతంగా రాణించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ 89 పరుగులు చేసినప్పటికీ ఆమె ఇన్నింగ్స్ చాలా కీలకమైంది. ఇటు జెమిమా రోడ్రిగ్స్ 115 బంతుల్లో సెంచరీ చేసి దుమ్ము లేపింది. చివరి వరకు వికెట్ పడకుండా జట్టును ముందుకు తీసుకువెళ్ళింది.
ఈ నేపథ్యంలోనే 48.3 ఓవర్లలోనే టీమ్ ఇండియా జట్టును విజయతీరాలకు చేర్చి.. ఫైనల్స్ లోకి తీసుకువెళ్లింది జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ). అయితే ఈ మ్యాచ్ విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ అలాగే జెమిమా రోడ్రిగ్స్ ఇద్దరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఐసీసీకి సంబంధించిన ఓ అధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే ఎమోషనల్ అయ్యారు. తన అద్భుతమైన ఇన్నింగ్స్ వెనుక తల్లిదండ్రులు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. వాళ్ల ముందు ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడడం గర్వంగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ( ICC Womens World Cup 2025) భాగంగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్స్ జరుగనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 2వ తేదీన ఫైనల్స్ జరుగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ మ్యాచ్ కూడా నవీ ముంబై వేదికగానే జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారితే రిజర్వ్ డే ఉంటుంది. ఆ రోజున కూడా వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే దక్షిణాఫ్రికా ఛాంపియన్ కానుంది. పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా.. టీమిండియా కంటే మెరుగ్గా ఉంది. అందుకే దక్షిణాఫ్రికా ఛాంపియన్ కానుంది.
Jemimah Rodrigues in tears after receiving player of the match award 👏🏻 pic.twitter.com/MTjQ06KiDA
— Richard Kettleborough (@RichKettle07) October 30, 2025
Jemimah Rodrigues crying saying she was dealing with anxiety and all
Congratulations Team india#INDWvsAUSW #IndianCricket #Womenworldcup2025 pic.twitter.com/1ZY9Acke2g
— विवेक यादव (@rajvnk47) October 30, 2025
THE EMOTIONS OF JEMIMAH RODRIGUES. ♥️🥹
– Can't describe this in Words! pic.twitter.com/fyfAXyHnTR
— Tanuj (@ImTanujSingh) October 30, 2025