imran hashmi : ఒకప్పుడు తెలుగు సినిమాలకు సరైన గౌరవం దక్కేది కాదు. పాత రోజుల్లో ఎన్నో అద్భుతమైన తెలుగు సినిమాలు వచ్చాయి. ఆ తెలుగు సినిమాలన్నిటికీ కూడా విపరీతమైన గౌరవం కూడా దక్కేది. ఎంతోమంది దిగ్గజ దర్శకులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కలిగి ఉండేది. చాలామందికి తెలుగు ఫిలిం దర్శకులు సినిమాలు తీయడం నేర్పించేవారు అని చెప్పిన ఆశ్చర్యం లేదు. ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే అద్భుతాలు క్రియేట్ చేశారు పాత తరం దర్శకులు.
సింగీతం శ్రీనివాసులు అంటే దర్శకులు తెలుగులో టైమ్ మిషన్ సినిమా అప్పట్లోనే తెరకెక్కించారు. భైరవద్వీపం లాంటి ఆలోచన ఆరోజుల్లోనే ఆయనకు వచ్చింది. మాటల్లేకుండా ఒక సినిమాను తీయొచ్చు అని పుష్పక విమానంతో ప్రూవ్ చేశారు. అయితే రోజులు మారుతున్న కొద్దీ కమర్షియల్ గా సినిమాలు తీయడం డైరెక్టర్లు అలవాటు చేసుకున్నారు. కమర్షియల్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు కూడా ఉండేవాళ్ళు.
తెలుగు సినిమాలను చూసే వాళ్ళతో పాటు అప్పట్లోనే హిందీ సినిమాలను ప్రేమించే అభిమానులు కూడా ఉండేవాళ్ళు. అప్పట్లో చాలా లవ్ స్టోరీస్ కూడా హిందీ సినిమాలో చూసి అద్భుతంగా ఉంది అని ఫీల్ అయ్యే వాళ్ళు తెలుగు ప్రేక్షకులు.
అలా హిందీ సినిమాలను విపరీతంగా చూసే తరుణంలో ఇమ్రాన్ హష్మీ కూడా చాలామందికి బాగా తెలిసిన నటుడు అయిపోయాడు. ఇమ్రాన్ హష్మీ రొమాంటిక్ ఫిలిమ్స్ చూసి ఫిదా అయిపోయిన తెలుగు ఆడియన్స్ కూడా ఉన్నారు. అయితే ఇమ్రాన్ హష్మీ తెలుగు సినిమా చేస్తాడు అని ఎవరు ఊహించి ఉండరు.
ఇమ్రాన్ హష్మీ తెలుగు సినిమా చేస్తాడు అని ప్రేక్షకులు ఊహించక పోయిన పర్వాలేదు. ఇమ్రాన్ హష్మీ కూడా ఊహించలేదట. ఇదే విషయాన్ని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఓజి సినిమా కథను సుజిత్ చెప్పినప్పుడు ఫిదా అయిపోయాడు అట. సినిమా మీద సుజిత్ కి ఉన్న పిచ్చి చూసి నేను ఓ జి సినిమా ఒప్పుకున్నాను. నాకు సినిమా కూడా విపరీతంగా నచ్చింది అని ఇమ్రాన్ హష్మీ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఇమ్రాన్ హష్మీ ఓ జి సినిమాలో ఓమి అనే పాత్రలో కనిపించాడు. పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ఓమీ అనే పాత్ర కూడా అంతే పవర్ఫుల్ గా సినిమాలో ఉంటుంది. ఈ పాత్ర ఎలివేషన్ కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది.
ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఓజీ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది.
Also Read: Mamitha Baiju: అదృష్టం అంటే ఈ అమ్మాయి ఇదే, నచ్చిన స్టార్లతో అవకాశం