Actress Narvini Dery Comments on Ajmal Amir: ‘రంగం‘ ఫేం, తమిళ హీరో అజ్మల్ అమీర్ అమ్మాయిలను వేధించాడంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అవన్ని ఫేక్ ఆరోపణలని, ఏఐతో తనని ఎడిట్ చేశారంటూ అజ్మల్ వివరణ ఇస్తూ వీడియో వదిలాడు. ఇలాంటి ఫేక్ వీడియోలతో తన కెరీర్ ని, గౌరవాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారంటూ అజ్మల్ చెప్పుకొచ్చాడు. దీంతో ఇదంత ఫేక్ అని అంత నమ్మేశారు. అయితే అజ్మల్ అలాంటివాడేనని, ఎంతో మంది ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ కోలీవుడ్ హీరోయిన్ నర్విని దేరి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇటీవల ఓ కోలీవుడ్ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో అజ్మల్ పై సంచలన ఆరోపణలు చేసింది. ‘బహుశా అజ్మల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన తొలి వ్యక్తిని నేనే అయ్యింటాను. అతడి ఆరాచకాల గురించి గతంలో కూడా చెప్పాను. కానీ, ఎవరూ నమ్మలేదు. ఇటీవల అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది. కానీ, అది ఫేక్, ఏఐ మాయ అని కప్పిపుచ్చుకున్నాడు అజ్మల్. కానీ, అది నిజం కాదు. అతడు నిజంగా అమ్మాయిల పిచ్చోడు. ’2018లో చెన్నైలోని ఓ మాల్లో అతడిని మొదటిసారి కలిశాను. అప్పటికే నేను ఓ సినిమా చేస్తున్నాను. అజ్మల్ హీరో అని నా ఫ్రెండ్ చెప్పింది. నేను నటిని అని నన్ను అతడికి పరిచయం చేసింది. అజ్మల్.. తన నెక్ట్స్ సినిమా కోసం హీరోయిన్ కోసం వెతుకుతున్నట్టు నాతో చెప్పాడు.
అందులో నన్ను యాక్ట్ చేయమని అడిగి నా నెంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆడిషన్ కి రమ్మంటూ వాట్సాప్ లో మెసేజ్ చేశాడు. ఆ నెక్ట్స్ డేనే నేను డెన్మార్క్ వెళ్లాల్సి ఉంది. దీంతో నేను రాలేనని చెప్పా. కానీ, అతడు ఎలాగోలా నన్ను ఒప్పించి రమ్మన్నాడు. ఒక్క రోజులోనే ఆడిషన్, సెలక్షన్ అయ్యేలా తను చూసుకుంటానని, నన్ను రావాలని చెప్పాడు. అతడి మాటలు నమ్మి వెళ్లాను. కానీ, అక్కడికి వెళ్లే సరికి నాకు అక్కడ ఆడిషన్ జరుగుతున్నట్టు అనిపించలేదు. అప్పుడే డౌట్ వచ్చింది. అతడు చెప్పిన రూంకి వెళ్లి డోర్ కొట్టాను. అజ్మల్ డోర్ తీశాడు. ఇక్కడ ఎవరూ లేరు ఏంటని అడిగా. అంత బయటకు వెళ్లారని చెప్పాడు. అదంత చూస్తుంటే నాకంత ఏదో తప్పు జరుగుతుందని అర్థమైంది. నేను వెళ్లడానికి తినడానికి ఏదో ఇచ్చాడు. నేను వద్దని చెప్పా. నేను వెళ్లగానే అజ్మల్ నా పక్కన కూర్చుని చనువుగా దగ్గర అవ్వడానికి ప్రయత్నించాడు.
నాకేం తోచలేదు. దీంతో వాష్ రూంకి వెళ్లానని చెప్పి అందులోనే కాసేపు ఉన్నాను. నేను బయటకు రాగానే సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేద్దామంటూ నా చేయి పట్టుకున్నాడు. డ్యాన్స్ చేద్దామని నన్ను దగ్గరి లాక్కున్నాడు. వెంటనే నేను దూరం నెట్టి. నువ్వు ఏ ఉద్దేశంతో నన్ను రమ్మన్నావో నాకర్థమైంది. కానీ, నేను అలాంటి దాన్ని కాదు. నన్ను ఏదైనా చేయాలంటే నన్ను చంపాక చేసుకో అన్నాను. అతడు నువ్వు ఏం మాట్లాడుతున్నాను. నేను హ్యాండ్సమ్.. నా వెనక ఎంతమంది అమ్మాయిలు పడతారో తెలుసాజ? అంటూ గొప్పలు చెప్పుకున్నాడు. అయితే నాకేంటి ఇదంత నాకు నచ్చని ముఖం మీదే చెప్పేశాను. అదే టైంలో అజ్మల్ కి ఫోన్ వచ్చింది. నేను క్యాబ్ డ్రైవర్ కి ఫోన్ చేసి రెడీగా ఉండమని చెప్పాను. అతడికి కింద నా చెల్లెలు ఉంది. నేను వెళ్లడం లేట్ అయితే వాళ్లే పైకి వస్తారని చెప్తుండగానే.. హోటల్ బాయ్ వచ్చి డోర్ కొట్టాడు. అజ్మల్ తలుపు తిసి అతడితో మాట్లాడుతుండగానే.. నేను రూం నుంచి బయటకు వచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాను. అలా అద్రష్టం కొద్ది ఆ రోజు అతడి నుంచి తప్పించుకున్నాను‘ అని చెప్పుకొచ్చింది.