Bigg Boss sreeja : బిగ్ బాస్ సీజన్ 9 లో ఈసారి చాలామంది కామనర్స్ హౌస్ లోకి ఎంటర్ ఇచ్చారు. కామనర్స్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎందుకు ఎక్కువగా కామనర్స్ ని బిగ్ బాస్ యాజమాన్యం తీసుకురాలేదో అర్థమైంది. చిన్న విషయానికి కూడా పెద్దగా హడావిడి చేసి గోల పెట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీజా దమ్ము మరియు ప్రియా శెట్టి వీళ్లిద్దరూ వచ్చిన వారం రోజుల్లోనే తమ మాట తీరుతో నెగెటివిటి సంపాదించుకున్నారు.
శ్రీజ కొన్ని ఆర్గ్యుమెంట్ విషయంలో నెగిటివ్ అభిప్రాయాన్ని అందుకున్న కూడా. కొన్ని గేమ్స్ ఆడే విషయంలో మాత్రం కంప్లీట్ ఎఫర్ట్ పెడుతుంది. అందుకే చాలామంది శ్రీజ విపరీతమైన ఆర్గ్యుమెంట్స్ చేసినా కూడా తనకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అసలు శ్రీజా కి మాట్లాడటం తెలియదు అనేది కూడా వాస్తవం. అలానే పెద్ద చిన్న తేడా లేకుండా మాటలు విసిరేస్తూ ఉంటుంది.
ఇకపోతే హౌస్ లో శ్రీజా దమ్ము ఎలిమినేషన్ అనేది ఎవరు ఊహించలేదు. అంత బాగా ఆడే ప్లేయర్ త్వరగా బయటికి వెళ్లి పోతుంది అని ఎవరికి అంతుచిక్కలేదు. కానీ బిగ్ బాస్ యాజమాన్యం వేసిన స్క్రిప్ట్ లో భాగంగా వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చిన తర్వాత శ్రీజా దమ్ము బయటకు వెళ్లిపోయింది.
శ్రీజ దమ్ము బయటకు వెళ్లిపోయిన వెంటనే సోషల్ మీడియాలో విపరీతంగా జస్టిస్ ఫర్ శ్రీజ దమ్ము అనే యాష్ ట్యాగ్ కూడా నడిపించారు. ఖచ్చితంగా మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంది అని చాలామంది బలంగా నమ్మారు. చెప్పిన మాదిరిగానే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీజ.
బిగ్ బాస్ షో కి బయట నెగెటివిటీ వస్తుందేమో అనే ఉద్దేశంతో శ్రీజను అనూహ్యంగా లోపలికి పంపించారు. అయితే మళ్లీ భరణి శ్రీజ వీరిద్దరిలో ఒకరు మాత్రమే హౌస్ లో ఉంటారు అని బిగ్ బాస్ చెప్పారు. ఆల్మోస్ట్ శ్రీజానే ఉంటుంది అని అందరూ ఊహించరు. కొన్ని టాస్కులు కూడా తను బాగానే ఆడింది.
అయితే ఇప్పుడు శ్రీజ దమ్ము ని బిగ్ బాస్ నుంచి బయటకు పంపించేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో రానుంది.
Also Read: Bison: U-18 మహిళల కబడ్డీ జట్టుకు మారి సెల్వ రాజ్ విరాళం, ఇది కదా అసలైన వ్యక్తిత్వం