Bigg Boss season 9 Day 53 : 53వ రోజు ఏం వండుతాము అనే దాంట్లో తనుజాకి మరియు మాధురికి డిస్కషన్ జరిగింది. నేను ఇన్ని రోజులు ఏ వండాలో చెప్పలేదు నువ్వే వండేదానివి కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి అని తనుజ. నాకు తెలియట్లేదు నిన్న ఒక చపాతి ఎక్స్ట్రా అడిగినందుకే నువ్వు అరిచావు, అలానే ప్రతిదానికి నువ్వు అరుస్తున్నావు అందుకే నేను దేని గురించి డిస్కస్ చేయకూడదు అనుకున్నాను. ఫుడ్ విషయం గురించి నీతో గొడవ పడితే మా ఇంట్లో వాళ్ళు చూసి బాధపడతారు. చపాతి గురించి వీళ్ళిద్దరికీ మరియు ఆర్గ్యుమెంట్ జరిగింది.
తనుజ మళ్లీ కళ్యాణ్ తో నువ్వు పాయింట్ అవుట్ చేశావు. అసలు కిచెన్ విషయంలో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావ్ అంటూ మళ్ళీ ఆర్గుమెంట్ మొదలుపెట్టింది. ఇమ్మానుయేల్ కాసేపు హౌస్మేట్స్ ని ఎంటర్టైన్ చేశాడు. పవన్ మరియు రీతు చౌదరి తో ఒక లవ్ స్టోరీ చేస్తున్నట్లు ఇద్దరినీ కాసేపు డైరెక్ట్ చేశాడు. వారిద్దరూ లవర్స్ లా యాక్ట్ చేశారు చేశారు.
హౌస్ లో ఉండడానికి ఒక టాస్క్ పెట్టిన సంగతి తెలిసిందే. దానిలో భరణికి కొంచెం ఎఫెక్ట్ అవ్వడం వలన ఆ టాస్క్ ని రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా కట్టు పడగొట్టు అని టాస్క్ పెట్టారు. డాక్టర్ల సూచన మేరకు భరణి బదులు వేరే హౌస్ మెట్ ఆడటానికి ఛాన్స్ ఇచ్చారు. భరణి తరుపున దివ్య ఆడి టాస్క్ గెలిచింది. మాధురి సంచాలక్ గా ఈ టాస్కు వ్యవహరించారు.
బాగా ఆడిన టాస్కులు రద్దవుతూ ఉంటాయి. ఆడని టాస్కులేము వర్క్ అవుట్ అవుతాయి. అగ్ని పరీక్షలో టాస్కులన్నీ విన్ అయ్యి ఇక్కడ టాస్కులు ఆడి విన్ అవ్వలేక పోతున్న అంటూ శ్రీజ కాసేపు బాధపడింది.
శ్రీజ డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ కర్రీ ఉందా లేదా అని కిచెన్లో ఉన్న రీతు చౌదరి మరియు తనుజను అడిగింది. వాళ్లు ఎటువంటి సమాధానం చెప్పలేదు. అయితే ఆ మాత్రం దానికి నేను టెంపరరీ హౌస్ మేట్స్ అయినా కూడా అడిగినప్పుడు చెప్పండి అంటూ ఫైర్ అయిపోయింది శ్రీజ. ఇమ్మానుయేల్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా శ్రీజ మాటలతో రెచ్చిపోయింది.
నాకంటూ పేరు లేదా కర్రీ ఉందా అని అడిగినప్పుడు నా పేరు పెట్టి అడగొచ్చు కదా అంటూ తనుజ దివ్య దగ్గర చెప్పింది. అయితే తనుజాకి మరియు మాధురికి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగిన విషయం తెలిసిందే దానిని సరి చేసే ప్రయత్నం చేశాడు ఇమ్మానుయేల్. మాధురి అన్నం మానేయడం వలన ఇది జరిగింది.మొత్తానికి మాధురిని తినేలా చేశాడు ఇమ్మానియేల్.
రిలీజ్ ద వారియర్ అనే కొత్త టాస్క్ పెట్టారు. భరణి టీం తరఫున రాము ఆడాడు. శ్రీజ టీం తరఫున కళ్యాణ్ ఆడాడు. ఈ టాస్కులో శ్రీజ తరఫున ఆడిన కళ్యాణ్ గెలిచాడు.
బిగ్బాస్ మరో టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో భరణి తరఫున ఇమ్మానుయేల్ ఆడాడు. శ్రీజ తరఫున కళ్యాణ్ ఆడాడు. మరోవైపు పవన్ ఆడుతాను అని చెప్పినా కూడా శ్రీజ కళ్యాణ్ ను ఎంచుకుంది. ఈ టాస్క్ లో భరణి తరఫున ఆడిన ఇమ్మానియేల్ గెలిచాడు. మొత్తం మూడు టాస్కులలో భరణి రెండు టాస్కులలో గెలవడం వలన బిగ్బాస్ అభినందించారు.
మొత్తానికి తన ముద్దు ముద్దు మాటలతో మాధురితో ఎపిసోడ్ చివర్లో క్లోజ్ అయిపోయింది తనుజ. నువ్వు బాగా కావాల్సింది దానివి కాబట్టి నీ మీద కోపం చూపించాను అంటూ మాధురి తనూజ చెప్పింది. వీరిద్దరు బాండింగ్ పైన మళ్లీ ఇమ్మానుయేల్ కామెడీ చేశాడు. టాస్క్ లో కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత శ్రీజకు మరియు పవన్ కి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. తన తరఫున ఆడుతాను అంటే శ్రీజ పవన్ ను రిజెక్ట్ చేసింది. ఈ విషయం పైన ఆర్గ్యుమెంట్ జరిగింది. ఓడిపోయినందుకు కళ్యాణ్ బాధపడ్డాడు. ఏది రాసి ఉంటే అది జరుగుద్ది అని లాస్ట్ లో శ్రీజ రియల అయిపోయింది
Also Read: Bigg Boss srija : బిగ్బాస్ మాస్టర్ ప్లాన్, ఆడియన్స్ కోరిక మేరకు ఆమెను ఇలా తీసుకొచ్చి అలా పంపించేసాడు