BigTV English

Ramya Moksha : కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడా.. ఆడియన్స్ కూడా అదే తేల్చేశారుగా

Ramya Moksha : కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడా.. ఆడియన్స్ కూడా అదే తేల్చేశారుగా
Advertisement

Ramya Moksha : వైల్డ్ కార్డు ఎంట్రీస్ లో భాగంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది రమ్య మోక్ష. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా రమ్య బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా వీళ్ళ సిస్టర్ వేరే వాళ్ళని తిట్టడం ఆ ఆడియో సోషల్ మీడియాలో కలకలం రేపటం, అక్కడి నుంచే వీళ్ళ అసలైన కథ మొదలైంది. బాగా పాపులర్ అయిపోయి నేడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే వరకు వచ్చారు.


బిగ్ బాస్ హౌస్ లో రమ్య మోక్షకు ఒక ప్రత్యేకమైన పవర్ ఇచ్చారు. తనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఫుడ్ పార్టనర్ గా సుమన్ శెట్టి ను ఎంచుకుంది. అయితే రమ్య మాట్లాడిన తీరు చూస్తుంటే వెటకారం మామూలుగా లేదు అని చెప్పాలి. వచ్చిన మొదటి రోజే కళ్యాణ్ కు అమ్మాయిలు అంటే పిచ్చి. ఎక్కడ పడితే అక్కడ చేతులేసి మాట్లాడుతున్నాడు. నాకు అలా చేసి ఉంటే నేను గట్టిగా చెంప మీద లాగి కొట్టేదాన్ని అని కామెంట్ చేసింది.

ఆడియన్స్ తేల్చేశారు 

కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు అని రమ్య కామెంట్ చేసినప్పుడు తనకి ఇంకా నోటి దూల తగ్గలేదు అని చాలామంది సోషల్ మీడియా వేదికగా తనని ట్రోల్ చేశారు. అయితే బిగ్బాస్ కి కొంతమంది ఆడియన్స్ ప్రతి వారం హాజరవుతారు అన్న సంగతి తెలిసిందే.


రమ్య కళ్యాన్ పై చేసిన కామెంట్స్ గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని నాగార్జున అడిగినప్పుడు 53 శాతం మంది నో అని చెప్పి 47 శాతం మంది రమ్య చెప్పింది కరెక్టే అన్నట్లు ఓటింగ్ చేశారు.

దీనిని బట్టి చూస్తే ఆల్మోస్ట్ సగానికి సగం కళ్యాణ్ కి అమ్మాయిలు పిచ్చి ఉంది అని ఒప్పుకున్నట్లే అని అర్థమైపోతుంది. అయితే ఆడియన్స్ ఓటింగ్ చూసి కళ్యాణ్ కూడా బాగా షాక్ అయిపోయాడు. తన పద్ధతి మార్చుకుంటాను అని క్లారిటీగా చెప్పేసాడు.

వీడియో చూపించి మరీ క్లాస్ 

రమ్య, మరియు కళ్యాణ్ ఇద్దరినీ ఒక సీక్రెట్ రూమ్ లోకి పిలిపించి రమ్య మాట్లాడిన మాటలను వీడియో రూపంలో కళ్యాణ్ కి చూపించారు బిగ్ బాస్. కళ్యాణ్ ఆ వీడియో చూసి విపరీతంగా షాక్ అయిపోయాడు. తనకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పాడు.

నాగార్జున మాట్లాడుతూ నువ్వు అలా అనడం తప్పు కాదు గాని అలా అనడానికి యూస్ చేసిన వర్డ్స్ కరెక్ట్ కాదు అని రమ్యకు క్లాసు పీకరు నాగార్జున. రమ్య కూడా తన తప్పును ఒప్పుకొని నేను అలా మాట్లాడటం నా తప్పు సార్ అని క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఈ కామెంట్స్ విన్న తర్వాత అయినా కళ్యాణ్ తన ఆట తీరు మార్చుకొని ఆడుతాడేమో వేచి చూడాలి.

Also Read: Bigg Boss 9 Promo : కూర పంచాయతీలో ఊహించిన ట్విస్ట్.. మాధురి – దివ్య మధ్యలో నాగ్ లాజిక్

Related News

Bigg Boss 9: మాధురి కోరిందే జరిగింది.. ఫుడ్ మానిటర్ ఛేంజ్, తనూజ కళ్లు తెరిపించిన నాగ్

Emmanuel : గోల్డెన్ స్టార్ రాగానే పోగరు పెరిగిందా.. నీకు పగిలిపోద్ది.. ఇమ్మూకి నాగ్ వార్నింగ్

Ritu Chaudhary : ప్లేట్ మార్చేసిన రీతు, కేవలం గేమ్ కోసమే. ఫీలింగ్స్ లేవా?

Ramya Moksha: వామ్మో రమ్య.. డిమోన్ ని తమ్ముడు అనేసిందేంటి! షాకైన నాగార్జున

Bigg Boss Bharani: నాన్న ఎలిమినేట్ అయిపోతాడని ఊహించే, తనూజ అమ్మను వెతుక్కుందా?

Bigg Boss 9 Promo : కూర పంచాయతీలో ఊహించిన ట్విస్ట్.. మాధురి – దివ్య మధ్యలో నాగ్ లాజిక్

Bigg Boss 9 Elimination : ఇది రణరంగమే, భరణి ఎలిమినేట్? అంతా ఇమ్మానియేల్ చేతుల్లోనే

Big Stories

×