Ritu Chaudhary : బిగ్ బాస్ సీజన్ 9 లో ఉన్న కంటెస్టెంట్స్ లో రీతూ చౌదరి ఒకరు. రీతు చౌదరి పలు సీరియల్స్ అలానే రియాల్టీ షోస్ ద్వారా మంచి గుర్తింపు సాధించుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ షోలో హైపర్ ఆది టీం తో కొన్ని స్కిట్స్ లో కనిపించి ఎక్కువ శాతం గుర్తింపు సాధించుకుంది. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ చేయటం వలన ఈమెను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చారు.
బిగ్ బాస్ హౌస్ కి రీతు వచ్చింది కానీ తన ఆట ప్రత్యేకంగా ఏమీ కనిపించడం లేదు. ప్రతి దానికి అవతల వాళ్ళ మీద డిపెండ్ అయిపోతుంది. ముఖ్యంగా పవన్ ను బాగా వాడుకుంటుంది అనేది చాలామంది అభిప్రాయం. అయితే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అనేది కూడా కొంతమంది అభిప్రాయం. వీటన్నిటికీ కూడా రీతు ఈరోజు క్లారిటీ ఇచ్చేసింది.
మామూలుగా ఏదైనా టాస్కులు గెలిస్తే వెంటనే పవన్ కు వెళ్లి హగ్ ఇస్తుంది. కేవలం హగ్గు మాత్రమే కాకుండా మొన్న జరిగిన సంభాషణలో దగ్గరికి వెళ్లి నెక్ మీద కిస్ కూడా చేసింది. అది చాలా తక్కువ మంది గమనించుకుంటారు. అయితే కేవలం గేమ్ కోసమే ఇలా ప్రవర్తిస్తుందా.? లేకపోతే నిజంగా పవన్ పైన తనకు ఒక మంచి ఫీలింగ్ ఉందా అనేది బయటపడటం లేదు.
అయితే పవన్ మరియు రీతును సీక్రెట్ రూమ్ కి పిలిచి నాగార్జున రమ్య మోక్ష పవన్ తో మాట్లాడిన ఒక వీడియోను చూపించరు. అయితే పవన్ రమ్యకు ఆ విషయంలోనే లవ్ లేదు అనే క్లారిటీ ఇచ్చేసాడు. మరోవైపు రీతు కూడా నాకు అటువంటి అభిప్రాయాలు ఏమీ లేవు కేవలం గేమ్ కోసమే అన్నట్లు చెప్పేసింది.
పవన్ మరియు రీతూ కలిసి కొన్ని టాస్కులు ఆడారు. ఆ టాస్కులు విషయంలో బాగా ఆడినప్పుడు ఇద్దరు హగ్ చేసుకునేవాళ్ళు. ఒకవేళ టాస్క్ లో పోతే రీతు మూల కూర్చుని ఏడ్చేది, అనవసరంగా పోగొట్టావని పవన్ కూడా అరిచేవాడు.
వీళ్ళిద్దరూ నాగార్జున ముందు ఈరోజు మాట్లాడుతూ మా మధ్య ఎటువంటిది లేదు. ఏదైనా ఉంటే ఎమోషనల్ సపోర్ట్ పవన్ బాగా ఇస్తాడు నన్ను బాగా అర్థం చేసుకుంటాడు అని రీతు చెప్పింది. మరోవైపు పవన్ కూడా రీతు నాకు మంచి ఫ్రెండ్ సార్ నన్ను బాగా అర్థం చేసుకుంటుంది అనేటట్లు చెప్పాడు.
Also Read: Ramya Moksha : కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడా.. ఆడియన్స్ కూడా అదే తేల్చేశారుగా