Spirit : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సంచలమైన దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ అతి తక్కువ కాలంలోనే విపరీతమైన పేరు సాధించుకున్నాడు. ఏకంగా తెలుగు సినిమా సత్తా ఏంటో బాలీవుడ్ కి వెళ్లి మరీ చూపించాడు. అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో మళ్లీ అక్కడ రీమేక్ చేశాడు. అయితే చాలామంది బాలీవుడ్ ప్రముఖులు అంతా కూడా కబీర్ సింగ్ సినిమాను కామెంట్ చేశారు. కానీ ఆ సినిమా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
తరువాత వెంటనే తెలుగులో సినిమా చేయకుండా అక్కడే రన్బీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమాను చేశాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఒక సంచలనం. అసలైన వైలెంట్ ఫిలిం అంటే ఏంటో నేను చూపిస్తాను అని చెప్పిన మాదిరిగానే వైలెంట్ ఫిలిం చేశాడు. బాక్స్ ఆఫీస్ వద్ద యానిమల్ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అందరికీ తన సక్సెస్ తో మరోసారి సమాధానం చెప్పాడు సందీప్.
ప్రస్తుతం సందీప్ రెడ్డివంగా ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనన్నాడు. ఇక సందీప్ ఈ క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేస్తాడు అని అందరికీ ఒక క్యూరియాసిటీ మొదలైంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ కూడా విడుదల కానుంది. మరోవైపు ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైన వీడియోను రెడీ చేసినట్లు సమాచారం వినిపిస్తుంది.
యానిమల్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఒక వీడియోని విడుదల చేశారు. ఇప్పుడు అదే మాదిరిగా స్పిరిట్ కోసం కూడా చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. సందీప్ రెడ్డి వంగ వాయిస్ ఓవర్ తో అప్పట్లో వీడియోని విడుదల చేశారు. ఇప్పుడు అదే మాదిరిగా చేసి సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేయనున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ నవంబర్ నుంచి మొదలుకానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 70% బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి అయిపోయింది. సందీప్ రెడ్డి వంగా సినిమాలలో మ్యూజిక్ కి ఎంత పెద్ద స్కోప్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
చాలా సీన్స్ సందీప్ రెడ్డి వంగ చేయించుకున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్, మరియు ఎడిటింగ్ వల్లనే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. స్వతహాగా సందీప్ ఎడిటర్ కాబట్టి తన సినిమాను తానే ఎడిట్ కూడా చేసుకుంటాడు. స్పిరిట్ సినిమా నుంచి వీడియో వస్తుంది అనగానే ప్రభాస్ అభిమానుల్లో కొత్త జోష్ మొదలైంది.
Also Read: K- RAMP: నా సినిమాకు మైనస్ రేటింగ్ ఇచ్చినా పర్లేదు, బాహుబలి K-Ramp ఒకేలా చూడాలి