BigTV English

Bigg Boss 9: మాధురి కోరిందే జరిగింది.. ఫుడ్ మానిటర్ ఛేంజ్, తనూజ కళ్లు తెరిపించిన నాగ్

Bigg Boss 9: మాధురి కోరిందే జరిగింది.. ఫుడ్ మానిటర్ ఛేంజ్, తనూజ కళ్లు తెరిపించిన నాగ్
Advertisement


Bigg Boss 9 Day 41 Episode Review: హౌజ్ లోకి వచ్చినప్పటి నుంచి రేషన్ మేనేజర్ నాకు నచ్చలేదు.. మార్చేయండి అని అంటూనే ఉంది. వచ్చిన వెంటనే దివ్యతో గొడవ పడింది. ఫుడ్ విషయంలో మొదటి నుంచి దివ్యతో మాధురికి పడటం లేదు. ఫుడ్ మానిటర్ నేను ఉన్నప్పుడు నన్ను పర్మిషన్ అడగాలని దివ్య.. నాతో మాట్లాడటమే అవసరం లేదు అంటున్న ఆమెతో నేనేలా మాట్లాడతా అంటూ మాధురి ఇలా వారి వారి పాయింట్స్ చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఇవాళ నాగ్ ప్రశ్నించారు. వైల్డ్ కార్డ్స్ లో ఎవరికి ఫుడ్ మానిటర్ పర్మిషన్ లేకుండ ఫుడ్ ముట్టకూడదు అని తెలుసు అంటే.. అందరు మాకు తెలియదంటారు. అసలు ఆ రూల్ తెలియని వాళ్లతో.. నన్ను అడిగి తీసుకోవాలి అనడం కరెక్ట్ కాదని దివ్యకి షాకిచ్చాడు కింగ్. నీ పాయింట్ కరెక్టే కానీ, ఫుడ్ మానిటర్ అనే ఆ రూలే ఇక్కడ ప్రాబ్లమైంది అంటాడు. మాధురిని కూడా నీ పాయింట్ కరెక్టే అయినా.. నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు దాన్ని సరి చేసుకోమని క్లాస్ పీకాడు. రేషన్ మేనేజర్ ఛేంజ్ చేయడానికి దివ్య, మాధురికి నాగ్ టెస్ట్ పెట్టాడు.

కొత్త ఫుడ్ మానిటర్ గా మాధురి

రేషన్ కి సంబంధించిన ప్రశ్నలకు ఇద్దరు ఒకే సమాధానం చెప్పారు. దీంతో రేషన్ మేనేజర్ గా మాధురికి కూడా హౌజ్ మేట్స్ నుంచి ఎక్కువ ఓట్లు రావడంతో మాధురి కొత్త ఫుడ్ మానిటర్ గా నిలిచింది. అన్ని విషయాల్లో రూల్ పాటించాలి అంటున్న దివ్య..తను మాత్రం రూల్ పాటించడం లేదని చెప్పింది మాధురి. అందరికి సమానంగా ఆమె ఫుడ్ ఇస్తుందా, ఇష్టమైన వాళ్లకు కొంచం ఎక్కువ ఇస్తుందని చెబుతుంది. దానికి అవును నా పోర్సన్ లోనిదే నేను షేర్ చేస్తున్నా. అది నా వాటా నేను ఎవరికి ఇస్తే ఏంటీ. అందుకే నేను భరణితో కొంచం షేర్ చేసుకున్నా అని చెబుతుంది. అలాంటప్పుడు భరణి ఒక్కడికే ఎందుకు హౌజ్ లో అందరికి కూడా ఇవ్వోచ్చు కదా అని చురక అట్టించాడు దివ్యకి. మరోవైపు వైల్డ్ కార్డ్స్ ని హౌజ్ లోకి పంపిస్తూనే.. వాళ్లకో పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేషన్స్ పవర్ ఇచ్చారు.


నిఖిల్ పవర్ కూడా పోయింది

ఈ పవర్ తో వారు ఎవరినైనా నామినేట్ చేయొచ్చు.. ఎవరినైనా సేవ్ చేయొచ్చు. కెప్టెన్ గౌరవ్ తప్పా మిగతా ఐదుగురు దీనికి అర్హులా కాదా? అని టాస్క్ ఇచ్చాడు. మాధురి అనర్హురాలని దివ్య, అర్హురాలని సంజన అన్నారు. ఆడియన్స్ పోల్ తీసుకోగా వారంత కూడా మాధురి అనర్హురాలని తేల్చారు. దీంతో మాధురి పవర్ పోయి.. కీరిటం చేజారింది. ఆ తర్వాత ఆయేషా.. టర్న్ వచ్చింది. ఆయెషా అర్హురాలని తనూజ.. అనర్హురాలని రీతూ చెప్పింది. ఆడియన్స్ పోల్ లో అంత తనూజ కరెక్ట్ అన్నారు. ఆ తర్వాత నిఖిల్ స్ట్రాంగ్ కంటెండర్. టాస్క్ ఆడి గెలిచే దమ్ము ఉంది. కాబట్టి అతడికి ఈ పవర్ అవసరం లేదు అని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ చెబుతారు. ఇక ఆడియన్స్ కూడా వీరికే ఓటు వేయడం నిఖిల్ నామినేషన్ పవర్ ని వెనక్కి తీసుకున్నాడు నాగ్. ఆ తర్వాత రమ్య మోక్ష నామినేషన్ పవర్ అర్హురాలేనని రాము రాథోడ్ చెప్తాడు. ఆడియన్స్ కూడా అతడి ఓపినియన్ కే ఓటేశారు. సాయి కూడా నామినేషన్ పవర్ కి అర్హుడే అని పవన్ చెప్తాడు.

కానీ, దీనికి భరణి ఖండించాడు. తనకు పవర్ అవసరం లేదు అంటాడు. చివరి ఆడియన్స్ డిమోన్ పాయింట్స్ కే ఓటేశారు. దీంతో మాధురి, నిఖిల్ కి తప్పా మిగత వారి పవర్ అలాగే ఉంది. అలాగే.. పవన్ తో రీతూకి, రీతూతో పవన్ కి ఉన్న రిలేషన్ ఏంటని నాగ్ అడిగారు. దీనికి రీతూ పవన్ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే.. ఈ విషయంలో నేను వందశాతం క్లారిటీ ఉన్న అంటుంది. ఇక పవన్ కూడా రీతూతో ఏ జోన్ లో ఉన్నావని అడగ్గా.. ఫ్రెండ్ అంటాడు. కానీ, చూసేవాళ్లకు అలా లేదంటూ రమ్య, పవన్ మాట్లాడుకున్న వీడియో చూపిస్తారు. ఫైనల్ గా అసలు నువ్వు ఏ జోన్ ఉన్నావంటే ఫ్రెండ్ జోన్ లోనే ఉన్న అంటాడు. కానీ, పవన్ అబద్ధం చెబుతున్నాడని ఆడియన్స్ కూడా వందశాతం పోల్ ఇచ్చారు. తనూజని కన్ ఫెషన్ రూంకి పిలిచి మాధురి, తనూజలు బ్యాక్ బిచ్చింగ్ చేసిన వీడియో చూపించాడు. కళ్యాణ్ చేతున్నా, పిసుకుతున్న తనూజ ఏం అనడం లేదు. కళ్యాణ్ పులిహోర పలకడం.. అమ్మాయిలను కెలుకుతూ, గోకుతూ ఏంటీ ఇది.

Also Read: Ramya Moksha: ప్లేట్ మార్చిన పక్కిల్స్ పాప.. డిమోన్ ని తమ్ముడు అనేసిందేంటి? షాకైన నాగార్జున

తనూజకు షాక్

పవన్ చేయేస్తున్న తనూజ.. వద్దని చెప్పడం లేదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు.. తనూజ గురించి దారుణంగా మాట్లాడారు. కానీ, తనూజ దీన్ని ఖండించింది. అతడు నాకంటే చిన్నవాడు. కానీ, కళ్యాణ్ ఓపినియన్ ని బట్టి వాళ్లు మా మధ్య కంఫర్ట్ జోన్ ఇవ్వడం లేదు. కానీ, కళ్యాణ్ విషయం తను చాలా క్లారిటీ గా ఉన్నానని మాధురికి చెప్పానని చెప్పింది. దీంతో రమ్య, మాధురి మరో దగ్గర మాట్లాడుకున్న వీడియో చూపించి.. మాధురి బండారం బయటపెట్టాడు. తనూజతో మంచిగా ఉంటూనే.. ఆమె వెనుక తన క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తుందని చెప్పి తనూజ కళ్లు తెరిపించాడు నాగార్జున. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ ని ఆటపట్టించాడు. గోల్ట్ స్టార్, క్రౌన్ వచ్చిందని కళ్లు నెత్తికెక్కాయా.. నువ్వు ఏం అడిగితే అది బిగ్ బాస్ చేస్తున్నాడని పోగరు పెరిగిందంటూ టెన్షన్ పెట్టాడు. ఆ తర్వాత హౌజ్ లో ఇమ్మూ చేస్తున్న కామెడీతో నవ్వించడంతో పాటు చిన్న రూల్స్ కూడా బ్రేక్ చేస్తున్నావు అంటూ ఇమ్మాన్యుయేల్ టెన్షన్ పెడుతూనే పోగిడాడు. హౌజ్ లో కామెడీ చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న ఇమ్మూ కి పోట్ట పగిలేలా పార్టీ ఉంటుందని, బిగ్ బాస్ తనకి ఫుడ్ పంపిస్తున్నాడని చెప్పి మ్యాటర్ ని కూల్ చేశాడు.

Related News

Emmanuel : గోల్డెన్ స్టార్ రాగానే పోగరు పెరిగిందా.. నీకు పగిలిపోద్ది.. ఇమ్మూకి నాగ్ వార్నింగ్

Ritu Chaudhary : ప్లేట్ మార్చేసిన రీతు, కేవలం గేమ్ కోసమే. ఫీలింగ్స్ లేవా?

Ramya Moksha : కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడా.. ఆడియన్స్ కూడా అదే తేల్చేశారుగా

Bigg Boss Bharani: నాన్న ఎలిమినేట్ అయిపోతాడని ఊహించే, తనూజ అమ్మను వెతుక్కుందా?

Bigg Boss 9 Promo : కూర పంచాయతీలో ఊహించిన ట్విస్ట్.. మాధురి – దివ్య మధ్యలో నాగ్ లాజిక్

Bigg Boss 9 Elimination : ఇది రణరంగమే, భరణి ఎలిమినేట్? అంతా ఇమ్మానియేల్ చేతుల్లోనే

Bigg boss 9 Promo: ఇమ్మూకి పగిలిపోద్ది.. నాగ్ సీరియస్, నువ్వు రాణివి కావంటూ రమ్యకు క్లాస్.. ఏం ఫీలుంది మామ!

Big Stories

×