Bigg Boss 9 Elimination : బిగ్బాస్ సీజన్ 9 చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఎవరు ఊహించని విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు బిగ్ బాస్ ఇస్తున్నారు. ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయర్ అని చాలామంది ఫీల్ అవుతున్నారు. వాళ్లు ఎలిమినేట్ అయిపోతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. బిగ్ బాస్ 9 లో పవర్ స్ట్రోమ్ లో భాగంగా హౌస్ లోకి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. నా ఆరుగురిలో దువ్వాడ మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష వీరిద్దరూ కామనర్స్, సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ రావడం వలన వీళ్లను హౌస్ లోకి ఎంటర్ చేశారు.
కామనర్ శ్రీజ బిగ్ బాస్ హౌస్ లో చాలా బాగా గేమ్ ఆడిన విషయం తెలిసిందే. కొన్ని టాస్కుల్లో కూడా విపరీతంగా కష్టపడింది. కానీ పవర్ స్ట్రోమ్ వలన ఎవరు ఊహించిన విధంగా శ్రీజ ఎలిమినేట్ బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. శ్రీజ మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలి అని సోషల్ మీడియా వేదికగా చాలామంది పోస్టులు కూడా పెట్టారు. బిగ్ బాస్ బజ్ కూడా శ్రీజ తో పూర్తయిన తర్వాత శ్రీజ మళ్ళీ ఎంట్రీ ఇవ్వదు అనే క్లారిటీ అందరికీ వచ్చేసింది.
ప్రతివారం హౌస్ లో నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వారం భరణి బయటికి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. మరోవైపు ఇమ్మానియేల్ దగ్గర ఉన్న పవర్ అస్త్ర ను ఉపయోగిస్తే భరణి హౌస్ లో ఉండే అవకాశం ఉంది. లేకుంటే 99 శాతం ఖచ్చితంగా భరణి బయటికి వెళ్లిపోవడం తప్పదు.
భరణి విషయానికొస్తే అందరితో మంచిగా మాట్లాడుతారు. కానీ ఎక్కువగా హౌస్ లో హ్యుమానిటీ చూపించి బంధాలు ఏర్పరచుకోవడం వలన సొంత గేములు పక్కన పెట్టేశారు. సరిగ్గా గేమ్స్ ఆడకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అనేదానికి ఈ ఎలిమినేషన్ ఒక ఉదాహరణ అయ్యే అవకాశం ఉంది.
భరణి వచ్చినప్పటి నుంచి ఎక్కడ కూడా తన ఎమోషన్ను బయట పెట్టకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వచ్చారు. బిగ్బాస్ టైటిల్ విషయం పక్కనపెడితే ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలుస్తారు అని అందరికీ ఒక రకమైన నమ్మకం ఉండేది.
బహుశా అందుకే బయట నుంచి వచ్చిన దివ్య కూడా భరణితో ఫ్రెండ్షిప్ చేసి టాస్కుల్లో గెలిచి మంచి పొజిషన్ లో ఉంది. రెండు రోజుల క్రితం వీళ్లిద్దరి మధ్య కూడా విపరీతమైన ఆర్గ్యుమెంట్ జరిగింది. తనుజ నాన్న నాన్న అంటూ భరణిను పిలుస్తూ ఉండేది. తనుజ వలన కూడా కొంత గేమ్ భరణి ది పోయిందని చెప్పాలి. అయితే భరణి ఎలిమినేషన్ గురించి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భరణి అవుట్ అనే మాట గట్టిగా వినిపిస్తుంది.
Also Read: Ritu Chaudhary: సంజనను మించిన దొంగ రీతూ.. రమ్యను కెలికేసిందిగా.. ఇక రచ్చ రచ్చే