సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పేరుతో కర్నూలులో జరిగిన మోదీ సభ అనంతరం అందరి దృష్టీ లోకేష్ పైనే ఉంది. సభా వేదికపై లోకేష్ ని దగ్గరకు పిలిపించుకుని మరీ జీఎస్టీ సవరణలపై ప్రచురించిన పుస్తకాన్ని ఆయనకు అందిస్తూ ఫొటో దిగారు మోదీ. ఈ సన్నివేశం టీడీపీ నేతలకు సంతోషాన్నిచ్చింది. అదే సమయంలో వైరి వర్గం కూడా ఈ వీడియోని వైరల్ చేసింది. పవన్ కంటే లోకేష్ కే ప్రధాని మోదీ ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారని వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రత్యర్థులు పుల్లలు పెట్టడానికే అలా అన్నారని టీడీపీ నేతలు అనుకున్నా.. స్టేజ్ పై మోదీ హావభావాలు, లోకేష్ కి ఆయన ఇచ్చిన ప్రయారిటీ మాత్రం ఆసక్తికరంగానే ఉంది.
రావయ్యా లోకేష్..
సభా వేదికపై సీఎం చంద్రబాబు ఉన్నారు, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు. వారిద్దర్నీ చెరోవైపు నిలబెట్టుకుని మోదీ ఫొటోలు దిగి ఉండాల్సింది. కానీ ప్రత్యేకంగా లోకేష్ ని పిలిపించుకున్నారంటే కారణం వేరే ఉండి ఉంటుంది. చంద్రబాబు తర్వాత లోకేష్ ని భావి నాయకుడిగా మోదీ గుర్తించారా అనేది ఇక్కడ ఆసక్తికర అంశం. కర్నూలు విమానాశ్రయంలో కూడా లోకేష్ తో సరదా సంభాషణలు కొనసాగించారు మోదీ. అంతే కాదు, ఢిల్లీకి వెళ్లాక కూడా లోకేష్ ని మరచిపోలేకపోయారు. ప్రత్యేకంగా లోకేష్ పేరు ప్రస్తావిస్తూ సభను సక్సెస్ చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ వేశారు.
Compliments to the Andhra Pradesh Government, especially Minister Nara Lokesh Garu, for the successful ‘Super GST, Super Savings’ campaign across the state. Through innovative competitions, they were able to deepen understanding of GST among the youth.@naralokesh pic.twitter.com/MSgLeObM4F
— Narendra Modi (@narendramodi) October 16, 2025
లోకేష్ సత్తా..
సీఎం చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తూనే లోకేష్ పాలనలో తనదైన ముద్రవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు పొత్తు ధర్మం ప్రకారం డిప్యూటీ సీఎంకు కూడా ఆయన ప్రయారిటీ ఇస్తున్నారు. అదే సమయంలో తన సత్తా ఏంటో జాతీయ స్థాయిలో తెలిసొచ్చేలా చేస్తున్నారు. వైజాగ్ కి గూగుల్ ఏఐ డేటా సెంటర్ తీసుకు రావడంలో లోకేష్ కృషి చాలా ఉందని అంటున్నారు, ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని గుర్తించారు కాబట్టే లోకేష్ ని ప్రశంసించారని తెలుస్తోంది. ఏపీలో ఇటీవల చేపట్టిన యోగాంధ్ర లాంటి కార్యక్రమాలు గిన్నిస్ బుక్ లోకి ఎక్కేందుకు లోకేష్ చూపించిన చొరవ కూడా కేంద్ర నాయకుల దృష్టిలో పడింది. అందుకే ఆయన లోకేష్ ని అనునయించారు, అభినందించారు.
Also Read: YCP కడుపు మంట పెరిగి పోతుందా?
పుత్రోత్సాహం..
తన ముందే మోదీ, లోకేష్ ని పొగుడుతుంటే, దగ్గరతు తీస్తుంటే సీఎం చంద్రాబు కూడా ఎంతో మురిసిపోయారు. ఇక లోకేష్ కూడా చంద్రబాబు కొడుకు అనే ఇమేజ్ ని పక్కనపెట్టి, యువ నేత లోకేష్ అనే విధంగా ఢిల్లీ స్థాయిలో తన పరపతి పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఢిల్లీ పర్యటనల్లో యువ ఎంపీలతో కలసి కేంద్ర మంత్రుల్ని కలుస్తూ ఏపీ అభివృద్ధిపై ఓ స్పష్టమైన విజన్ తో ఆయన ఉన్నారనే సంకేతాలు పంపిస్తున్నారు. అటు ప్రత్యర్థుల్ని చిత్తు చేసేలా మాటల తూటాలు పేలుస్తున్న లోకేష్, ఇటు అభివృద్ధిలో కూడా అదే తరహా చొరవ చూపిస్తున్నారని అంటున్నారు. 2024 ఎన్నికల సమయంలో కూటమి కుదరడంలో పవన్ కల్యాణ్ పాత్ర ఎంత ఉందో, కూటమి గెలిచిన తర్వాత ఆ గెలుపుని తలకెక్కించుకోకుండా కూటమి ప్రయాణం సజావుగా జరగడంలో లోకేష్ పాత్ర కూడా అంతే ఉందని అంటున్నారు. ఒకప్పుడు లోకేష్ ని విమర్శించిన వారే, ఇప్పుడు ఆయన్ను పొగుడుతున్నారంటే దానికి ఆయన చేసిన కృషి చాలా ఉందని అంటున్నారు. మోదీ గతంలో లోకేష్ విషయంలో పెద్ద సానుకూలతతో లేకున్నా 2024 విజయం, తదనంతర పరిణామాలతో లోకేష్ కి ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా కూటమిలో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
Also Read:సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు వైరల్