Bigg Boss Bharani: బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పటి నుంచి పెద్దగా ఓపెన్ అవ్వని కంటెంట్ ఎవరైనా ఉన్నారంటే అది భరణి అని చెప్పాలి. అయితే భరణి చివరివరకు వచ్చి బిగ్ ఫైట్ చేసి నిలబడతాడు అని అందరూ అనుకున్నారు. కనీసం టైటిల్ కొట్టకపోయినా చివరి ఐదుగురిలో ఒకటిగా అయినా మిగులుతాడు అని అనుకున్నారు. కొన్ని సందర్భాల్లో మాట్లాడే విషయంలోనూ, కొన్ని టాస్కుల గురించి ఎఫెక్ట్స్ పెట్టే విషయంలోనూ కూడా భరణి కొంచెం ముందంజలోనే ఉన్నాడు. కానీ అనుకోని విధంగా భరణి ఎలిమినేట్ అయిపోయారు.
అయితే నామినేషన్ లో ఉన్న ప్రతిసారి భరణి ఏదోలా బయటపడుతూ వచ్చాడు. కానీ ఈసారి మాత్రం పెద్దగా తప్పించుకోలేకపోయాడు. ఆడియన్స్ ఓట్లు కూడా ఎక్కువగా రాలేదు. బంధాలు బాంధవ్యాల్లో చిక్కుకొని సొంత గేము విడిచి పెట్టేసాడు. మరోవైపు ఈ వారం పర్ఫామెన్స్ భరణిది చాలా పూర్ గా ఉంది. అలానే నన్ను టార్గెట్ చేసిన వాళ్ళందరూ బయటకు వెళ్లిపోయారు అని దివ్యతో ఒక సందర్భంలో అన్నారు కానీ ఈరోజు భరణి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో తనుజ పైన బయట విపరీతమైన కామెంట్స్ వినిపిస్తూ వచ్చాయి. తను రిస్క్ లో ఉన్న ప్రతిసారి భరణి ముందుకొచ్చి సేవ్ చేశాడు. అలానే చాలామంది కెప్టెన్లు అవ్వడానికి కూడా సహకరించాడు. అయితే భరణి ను తనుజ నాన్న నాన్న అంటూ వాడుకోవడం మొదలుపెట్టింది.
అయితే ఫైర్ స్ట్రోం వాళ్లు ఎప్పుడైతే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి మాధురి తో ఒక మాదిరిగా ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టింది. మొత్తానికి సోషల్ మీడియాలో తనుజకి మాధురి ను అమ్మను చేసేసారు. బహుశా భరణి ఎలిమినేషన్ అయిపోతాడేమనే ముందే గ్రహించి మాధురికి క్లోజ్ అయిందా అని కొంతమంది నెటిజెన్లు మాట్లాడుకుంటున్నారు.
స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను బయటకు పంపాలి అని ఫైర్ స్ట్రోమ్ వాళ్ళు వచ్చినప్పుడు నుంచి అనుకుంటున్నారు. అదే మాదిరిగా బాలు టాస్క్ లో కూడా భరణిని ఎలిమినేట్ చేయాలి అని మాధురి పదేపదే వైల్డ్ కార్డు ఎంట్రీ వాళ్ళతో చెబుతూ వచ్చింది. చెప్పిన మాదిరిగానే భరణి ఈరోజు ఎలిమినేషన్ అయిపోయారు.
ఇప్పుడు భరణి ఎలిమినేషన్ ఒకపక్క తనుజ కి మరోపక్క దివ్యకి చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరికీ భరణితో ఉన్న బాండింగ్ చాలా ప్రత్యేకమైనది. ఇక హౌస్ లో వాళ్ళ గేమ్ ఎలా ఆడతారో ముందు ముందు చూడాలి.
Also Read: Ustad Bhagat Singh : 12 సంవత్సరాల నుంచి ఉన్న కసి బయటపడుతుంది, నిర్మాత ఉస్తాద్ అప్డేట్స్