Colombo Rains: వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఐసీసీకి తలనొప్పులు తీసుకువస్తోంది. కొలంబోలో వరుసగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో మ్యాచ్ లకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఆడిన 4 వరల్డ్ కప్ మ్యాచ్ లు కూడా వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దీంతో గెలవాల్సిన జట్లు ఒక్క పాయింట్ తో సరిపెట్టుకోవడం జరిగింది. ఈ ఎఫెక్ట్ సెమీ ఫైనల్ కు వెళ్లే జట్లపైన కూడా పడుతోంది. పాయింట్ల పట్టిక కూడా తలకిందులు అవుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్ లు కూడా రద్దయ్యాయి. ఇండియాలో పాకిస్తాన్ పర్యటించే అవకాశం లేనందున, ప్రతి మ్యాచ్ కొలంబో వేదికగా పాకిస్తాన్ ఆడుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్ లు కూడా వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో రెండు పాయింట్లు పాకిస్తాన్ దక్కించుకొని సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కొలంబో వేదికగా జరిగిన నాలుగు వరల్డ్ కప్ మ్యాచ్లు ఇప్పటివరకు రద్దయ్యాయి. మొదట శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రేమదాస స్టేడియం వేదికగానే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగితే ఆ మ్యాచ్ కూడా రద్దయింది. ఇక పాకిస్తాన్ జట్టుతో ఇంగ్లాండ్ అటు న్యూజిలాండ్ రెండు జట్లు తలపడితే ఆ రెండు మ్యాచ్ లు కూడా రద్దయ్యాయి.
కేవలం ప్రేమ దాస స్టేడియం వేదికగానే మ్యాచ్ లు నిర్వహించడం, అక్కడే భారీ వర్షాలు కురవడం ఐసీసీకి తలనొప్పులు తీసుకువస్తుంది. వేదికలు ఎక్కువగా పెట్టుకుంటే బాగుండు కదా అని ఇప్పుడు క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇలా ఐసీసీ టోర్నమెంట్లలో నాలుగు మ్యాచ్ లు రద్దు కావడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కొలంబో వేదికను మార్చాలని కోరుతున్నారు. సరిగ్గా వర్షాకాలంలో ఇలాంటి ఈవెంట్లను నిర్వహించకూడదని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి గబ్బు లేపుతున్న కొలంబో వేదిక.. ఐసీసీకి తలనొప్పులు తీసుకువస్తోంది.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ఇప్పటి వరకు రెండు జట్లు సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లాయి. 9 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా అలాగే 8 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండు కూడా సెమీ ఫైనల్ కు వెళ్లాయి. మరో రెండు జట్లు సెమీ ఫైనల్ కు వెళ్లాల్సి ఉంది. ఇంగ్లాండ్, టీమిండియా అలాగే న్యూజిలాండ్ జట్లకు సెమీ ఫైనల్ వెళ్లే అవకాశం ఉంది. కానీ దాదాపుగా ఇంగ్లాండ్ తో పాటు టీమిండియా ఫైనల్ కు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
Christchurch ❌
Colombo ❌
Indore ❌Three venues, three washouts today. pic.twitter.com/HJliNuegEh
— Wisden (@WisdenCricket) October 18, 2025
Colombo witnesses another washout as rain continues to play spoilsport in the WWC 2025. pic.twitter.com/dghylmNKC7
— CricTracker (@Cricketracker) October 18, 2025