Bigg Boss 9 Promo : బిగ్ బాస్ సీజన్ 9 చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎపిసోడ్ రోజుకొక కొత్త మలుపు తీసుకుంటుంది. ఈ సీజన్ మొదలైనప్పుడు ఇది చదరంగం కాదు, రణరంగం అంటూ ప్రోమోలు విడుదల చేస్తూనే ఉన్నారు. అదే మాదిరిగా ప్రస్తుతం ఎపిసోడ్లు కూడా జరుగుతున్నాయి. అయితే చూసే ఆడియన్స్ కి కొన్ని విషయాలపైన కొంత అవగాహన వస్తుంది. ఈ విషయం పైన బిగ్ బాస్ వాళ్లకు క్లాస్ పీకుతారు అని ఆడియన్స్ అంతా ఫిక్స్ అయి ఉంటారు.
కానీ వీక్ ఎండ్ లో నాగార్జున వచ్చి అన్నిటిని తారుమారు చేస్తారు. ఈ వారం మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు ఫైర్ స్ట్రోమ్ లో భాగంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో దువ్వాడ మాధురి ప్రతి చిన్న విషయానికి కూడా గట్టిగట్టుగా అరుస్తూ సీన్ చేస్తుంది అని అందరికీ అర్థమైంది. కిచెన్ మానిటర్ గా దివ్య వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇప్పటికే చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి.
కిచెన్ మానిటర్ గా ఉన్న దివ్య కు చెప్పకుండా దువ్వాడ మాధురి కర్రీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కూర పంచాయితీ నాగార్జున వరకు చేరింది. వీరిద్దరూ ఈ విషయం మీద చాలా సేపు అరుచుకున్నారు. ఈ విషయంలో మాధురిది తప్పు అని చాలామంది వీక్షకులు కూడా అనుకున్నారు. కానీ నాగర్జున దివ్య ను లాజిక్స్ అడిగారు.
కొంచెం కూర వేసుకోవటం వలన నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని దివ్య అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే కిచెన్ మానిటర్గా నేను అందరికీ సర్ది పెట్టాను అని చెప్పింది దివ్య. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో వచ్చిన వాళ్లందర్నీ కూడా మీకు ఈ రూల్ ఉంది అని తెలుసా అని నాగార్జున అడిగారు. ఎవరు కూడా తెలియదు అన్నారు. దివ్య కి సమాధానం ఇస్తూ వాళ్ళెవరికి తెలియదు. ఆ రూల్ ఉందని తెలియదు కాబట్టి అది వాళ్ళ ప్రాబ్లం కాదు అని దివ్య కి వార్నింగ్ ఇచ్చారు.
Also Read: Bigg Boss 9 Elimination : ఇది రణరంగమే, భరణి ఎలిమినేట్? అంతా ఇమ్మానియేల్ చేతుల్లోనే
మరోవైపు మాధురి మాట్లాడుతూ కిచెన్ మానిటర్ గా ఆవిడ సరిగ్గా డ్యూటీ చేయడం లేదు. అందరికీ సమానంగా ఫుడ్ పెట్టడం లేదు. తనని చెప్పమనండి. అలానే భరణి గారికి ఎక్కువ ఫుడ్ పెడుతుంది నేను దానిని గమనించాను అంటూ దువ్వాడ మాధురి అంది.
భరణి గారికి పెట్టిన ఫుడ్డు నాకు వచ్చిన దాంట్లో నేను సపరేట్ చేసి ఇస్తున్నాను. అది నా ఇష్టం కదా అంటూ తిరిగి కౌంటర్ ఎటాక్ చేసింది మాధురి. మొత్తానికి వీరిద్దరికీ మధ్య ఐదు ప్రశ్నలను నాగార్జున అడిగి, వాటి ఆన్సర్స్ బట్టి కిచెన్ మానిటర్ను మారుస్తాము అని క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలైంది.