Bandla Ganesh: నటుడుగా కెరీర్ మొదలు పెట్టిన బండ్ల గణేష్ అదృష్టవశాత్తు నిర్మాతగా మారారు. అయితే నిర్మాతగా చేసిన ఆంజనేయులు, తీన్మార్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయాయి. అదే తరుణంలో పవన్ కళ్యాణ్ నువ్వు ఇంకొక సినిమా చేసుకో అని గబ్బర్ సింగ్ సినిమా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యొక్క ఆకలిని తీర్చింది. అంతేకాకుండా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిపోయింది.
ఒక అభిమాని పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలి అనుకుంటాడో అచ్చం అలానే చూపించి మంచి అందుకున్నాడు హరీష్ శంకర్. ఇప్పటికీ హరీష్ శంకర్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తావనలోకి వచ్చే సినిమా గబ్బర్ సింగ్. ఆ సినిమాలోని డైలాగ్స్, హీరో క్యారెక్టర్ అన్ని చాలా కొత్తగా డిజైన్ చేశాడు. పేరుకు రీమేక్ సినిమా అయినా కూడా హరీష్ మార్క్ మాత్రం సినిమాలో విపరీతంగా కనిపిస్తుంది.
బండ్ల గణేష్ కొన్నిసార్లు మాట్లాడే మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతుంటాయి. ఇంకొన్ని సందర్భాల్లో చాలా పద్ధతిగా మాట్లాడుతాడు. హరీష్ శంకర్ మరియు బండ్ల గణేష్ మధ్య చాలా సార్లు చిన్న చిన్న వివాదాలు జరిగాయి. ట్విట్టర్ వేదికగా వీళ్ళిద్దరూ తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఒకరి పైన ఒకరు ప్రశంసలు జల్లుకున్నారు. ఇక ప్రస్తుతం బండ్ల గణేష్ ఇంట్లో దివాలి పార్టీ జరుగుతున్న సందర్భంగా హరీష్ శంకర్ కూడా హాజరయ్యారు. హరీష్ శంకర్ తో బండ్ల గణేష్ ఫోటో దిగుతూ నా జీవితాన్ని మార్చిన డైరెక్టర్ అని చెప్పాడు.
దీనికి హరీష్ రియాక్ట్ అవుతూ మన చేతుల్లో ఏమీ లేదు అంతా పైవాడి దయ అన్నట్లు పైకి చేయి చూపించాడు. హరీష్ ఇంకేమీ మాట్లాడలేదు. ఏదేమైనా గబ్బర్ సింగ్ సినిమా తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్నాడు హరీష్. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా 2026లో విడుదల కానుంది. గబ్బర్ సింగ్ సినిమా నుంచి ఈ సినిమా హిట్ అవుతుంది అని అందరికీ ఒక రేంజ్ అంచనాలు ఉన్నాయి.
Also Read: Spirit : ప్రభాస్ స్పెషల్ వీడియో రెడీ చేసిన సందీప్ రెడ్డి వంగ, మరో యానిమల్?