Bigg Boss Telugu 9 Day 54 Episode Review: బిగ్ బాస్ 54వ రోజుకి చేరుకుంది. రీఎంట్రీ ఇచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ భరణి, శ్రీజలో ఎవరూ పర్మినెంట్ హౌజ్ మేట్ అవుతారనేది ఈ రోజు తెలిపోతుంది. అలాగే కెప్టెన్సీ కోసం జరిగిన కంటెండర్ టాస్క్ లో ఎవరు గెలిచి కొత్త కెప్టెన్ అయ్యారో ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం.
హౌజ్ లో రోజురోజుకి టాస్కుల కంటే గొడవలు ఎక్కువైపోతుంది. బిగ్ బాస్ కూడా టాస్క్ కంటే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, వివాదలపై ఎక్కువ ఫోకస్ పెట్టాడేమో అనిపిస్తుంది. ఈ రోజు తనూజ, మాధురి, దివ్యలు బెడ్ రూంలో శ్రీజ గురించి గుసగుసలాడారు. తను ఒక్క ప్లాన్ తో హౌజ్ లోకి వచ్చిందని, కావాలనే నామినేషన్ కత్తి నాకు ఇచ్చిందని మాధురి అంటుంది. నా వాయిస్, ఎవరిని చేస్తానో ఊహించే ఇచ్చింది. నా వాయిస్ రైజ్ చేస్తే బ్యాడ్ చేయాలని చూసింది అని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత హౌజ్ లో పర్మినెంట్ హౌజ్ మేట్స్ ఎవరనే వెల్లడించారు. శ్రీజ కంటే ఎక్కువ ఓట్టు గెలిచి భరణి పర్మినెంట్ హజ్ మేట్ గా అయ్యాడు.
శ్రీజ హౌజ్ ని వీడింది. ఇక హౌజ్ లో మాధురి పొద్దెక్కిన కూడా నిద్రమత్తులోనే ఉంది. ఎక్కడ ఉంటే అక్కడే ఒరిగి నిద్రపోతూ కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ కి చుక్కలు చూపించింది. దీంతో మాధురితో 20 గుంజీలు తీయించి బయపడుతూనే మాధురికి పనిష్‌మెంట్ ఇచ్చాడు ఇమ్మూ. ఇక శ్రీజ బయటకు వెళ్లడంతో సంజనలో భయం పట్టుకుంది. హౌజ్ లో ఎలా ఉంటే కనిపిస్తామని ఇమ్మాన్యుయేల్ తో మాట్లాడుతుంది. ఎంటర్టైన్ చేస్తూ కనిపించడంలో ఉన్నంత ఉత్తమం మరోకటి లేదంటా ఇమ్మాన్యుయేల్ అంటాడు. కానీ, ఏదోక విషయంలో వాయిస్ రేజ్ చేస్తేనే స్ట్రాంగ్ కంటెండర్ అవుతామని నా ఉద్దేశం అందుకే ఏదోక దానిపై ఆర్గ్యూ చేస్తూ ఉంటా అంటూ సంజన వివరణ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్ ని సెలక్ట్ చేసే బాధ్యత బిగ్ బాస్ భరణి చేతిలో పెట్టాడు.
దీంతో భరణిలో టాస్క్ ల్లో సపోర్టు చేసిన వారికి ఫస్ట్ ఛాయిస్ ఇచ్చాడు. మాధురి మాత్రం బిగ్ బాస్ డిసిజన్ పై నిరాశ చూపింది. ఫస్ట్ ఈయనకు ఇవ్వడంలోనే అన్ ఫెయిర్ అంటుంది. బిగ్ బాస్ ఆయనకు సపోర్టు ఇచ్చిన వాళ్లకే ఇవ్వాలని చెప్పాడా? ఆడవాళ్లలో ఇంతవరకు ఎవరు కెప్టెన్ అవ్వలేదు, మనకు ఇవ్వోచ్చు కదా అని తన అభిప్రాయం అంటుంది. మరోపక్క సుమన్, ఇమ్మాన్యుయేల్ అందరితో చర్చించి కెప్టెన్సీ కంటెండర్లను నిర్ణయించాడు. బిగ్ బాస్ ఆదేశం మేరకు కెప్టెన్ కంటెండర్లుగా తను (భరణి), తనూజ, దివ్య, నిఖిల్, సాయిల పేర్లు చెప్పాడు. టాస్క్ ల్లో మొదటి నుంచి భరణి సపోర్టు చేశాను, శ్రీజకు సపోర్టు చేసిన సాయి ఎక్కువ అయ్యాడా అంటూ మాధురి డిసప్పాయింట్ అయ్యింది.
ఎలిమినేట్ అవ్వకుండ ఉండి హౌజ్ లో ఉంటే నామినేషన్ చూసుకుంటా అని భరణిని టార్గెట్ చేసింది. ఆ తర్వాత కిచెన్ కాఫీ షేరింగ్ పై పెద్ద రచ్చ జరిగింది. సుమన్ శెట్టి కాఫీ కళ్యాణ కి ఇస్తున్నాడు, కళ్యాణ్ తో తాను షేర్ చేసుకుంటున్న అంటుంది రీతూ. ఈ విషయం తనూజ, డిమోన్ తో చెబుతుంది. కుకింగ్ హెడ్ దివ్య కాఫీ తీసుకుంటున్న సుమన్ ని ఆగండి ఎవరికి ఇది అని ఆరా తీస్తుంది. అప్పుడు రీతూ చెబుతుంది. అల్రెడీ తాగవ్ కదా మళ్లీ ఏంటీ అడిగితే.. ఆయనతో షేర్ చేసుకుంటే ఇప్పుడేమైందంటూ అంటూ రీతూ చిరాగ్గా వెళ్లిపోతుంది. అక్కడ కాఫీ వల్ల చిన్నపాటి వార్ జరిగింది.