Bigg Boss Telugu 9 Elimination: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ ఆసక్తిగా మారింది. మాధురి, ఆయేషా, రమ్య మోక్షల డ్రామాతో హౌజ్ రణరంగంగా మారింది. ముఖ్యంగా దివ్వెల మాధురి ఆట ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిని కలిగించింది. టాస్క ల్లో గట్టి పోటు ఇస్తూ.. ఓ వైపు హౌజ్ పత్రి ఒక్కరితో తగ్గేదే లే అన్నట్టు వాదనలు దిగుతోంది. దీంతో హౌజంత కూడా మాధురి నోటికి దడుస్తోంది. ఎప్పుడో ఏదొక గొడవ పెట్టి ఆర్గ్యూ చేసే సంజన సైతం మాధురితో పెట్టుకోలేక దండం పెడుతోంది.
ఇంకా చెప్పాలంటే మాధురి నోటికి చిక్కితే సింహం బోనులో తలపెట్టినట్టే అన్నట్టుగా హౌజంత ఆమెకు దడుస్తోంది. మరోవైపు టాస్క్ లోనూ తనదే పై చేయి అనిపిస్తోంది. ఈ వారం జరిగిన టాస్కుల్లో, కెప్టెన్సీ పోరు మాధురి పెత్తనం కనిపించింది. ఈ క్రమంలో ఆమె ఫాలోయిగ్ తో పాటు నెగిటివిటీ కూడా పెరిగింది. చూస్తుండగానే వీకెండ్ వచ్చేసింది. అంటే ఈ వీక్ ఎవరోకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే. మరి ఈ వారం మొత్తం 8 మంది నామినేషన్ లో ఉన్నారు. వారిలో తనూజ, రీతూ, సంజన, మాధురి, డిమోన్, కళ్యాణ్, రాము, గౌరవ్ లు ఉన్నారు.
వీరిలో డెంజర్ జోన్ లో ఉంది మాధురి, గౌరవ్ లే. దీంతో అంత గౌరవ్ ఈ వారం ఎలిమినేట్ అవుతాడని అంతా అనుకున్నారు. అంతేకాదు నిన్నటి వరకు వచ్చిన ఓటింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. కానీ, తాజాగా ఈ వారం ఎలిమినేషన్ బిగ్ ట్విస్ట్ ఎదురైంది. ఎవరూ ఊహించని విధంగా దివ్వెల మాధురి ఎలిమినేట్ అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. కాగా నిన్నటి వరకు ఓటింగ్ ప్రకారం గౌరవ్ లీస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ, ఈ వారం అతడి ఆట చూసి ఆడియన్స్ తమ నిర్ణయం మార్చుకున్నారేమో.. శుక్రవారంతో అంత మారిపోయింది. మాధురి కంటె ఎక్కువ ఓట్స్ తెచ్చుకుని గౌరవ్ పైకి ఎగబాకాడు. దీంతో మాధురి లీస్ట్ కి వచ్చేసిందని అని ప్రచారం జరుగుతుంది.
దీంతో నామినేషన్ సేవ్ చివరికి గౌరవ్, మాధురిలకు పడగా.. గౌరవ్ సేవ్ అవ్వడంతో మాధురి ఎలిమినేట్ కానుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఇక్కడ మాధురి గోల్డెన్ పవర్ గెలుచుకున్న తనూజ నేరుగా ఎక్కువ బోర్డు రావడంతో మాధురికి పనీష్మెంట్ కింద మాధురిని ఈ వారం నేరుగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అలా తనూజ వల్ల నామినేషన్ లో వచ్చిన మాధురిని సేవ్ చేసే పవర్ కూడా తనూజ చేతిలోనే ఉంది. గోల్డెన్ పవర్ ఉపయోగించి మాధురిని సేవ్ చేయొచ్చు. మరి ఆ హక్కుని ఈ వారం ఉపయోగించే అవకాశం బిగ్ బాస్ తనూజకి ఇచ్చాడా? ఇస్తే ఖచ్చితంగా తనూజ మాధురి కోసమే పవరాస్త్రాని ఉపయోగిస్తుంది. మరి ఈ వారం మాధురి ఎలిమినేట్ అవుతుందా? లేదా అనేది రేపటి (ఆదివారం) ఎపిసోడ్ తో క్లారిటీ రానుంది.