Big tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమం ఒకటి. తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ విష్ణు ప్రియ (Vishnu Priya)పాల్గొని సందడి చేశారు. ఇక విష్ణుప్రియ యాంకర్ గా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే ప్రవేట్ ఆల్బమ్స్ చేస్తూ కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్నారు. పోవే పోరా అనే కార్యక్రమం ద్వారా యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇలా పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన విష్ణు ప్రియ ఇటీవల కాలంలో యాంకరింగ్ కు పూర్తిగా దూరంగా ఉన్నారు.
ఇలా యాంకరింగ్ కి దూరంగా ఉండటానికి గల కారణాలను కూడా తెలిపారు. పోవే పోరా కార్యక్రమంలో భాగంగా సుధీర్(Sudheer) తనకు యాంకర్ గా ఉన్నాడు కాబట్టి సరిపోయింది ఒంటరిగా అంటే తాను యాంకరింగ్ చేయలేనని, మనకు స్పష్టమైన మాట తీరు రాదు అంటూ తన బలహీనతల గురించి తెలిపారు. అయితే సుడిగాలి సుదీర్ తో పనిచేయడం గురించి వర్ష ప్రశ్నించడంతో విష్ణు ప్రియ ఆసక్తికరమైన సమాధానాలను తెలియజేశారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే సుధీర్ లేకపోతే కెరియర్ పరంగా నేను ఈ స్థాయిలో ఉండే దాన్ని కాదేమో అంటూ విష్ణు ప్రియ వెల్లడించారు.
సుధీర్ చాలా మంచి వ్యక్తి అని కెరియర్ పరంగా అంచలంచలు ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నారని, సుధీర్ తన ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడుతున్నారు అంటూ సుధీర్ గురించి ఎంతో గొప్పగా తెలియజేశారు ఇప్పుడు సుదీర్ తో యాంకరింగ్ చేసే అవకాశం వస్తే చేస్తారా అంటూ ప్రశ్న వేయడంతో తప్పకుండా చేస్తాను అంటూ సమాధానం చెప్పడమే కాకుండా సుధీర్ ముసలోడు అయ్యాడు నాలాంటి యంగ్ యాంకర్ తో చేయగలడా అంటూ సరదాగా మాట్లాడారు. అయితే సుధీర్ తనని పోవే పోరా షో సమయంలో ఎంతో ఎంకరేజ్ చేశారని, ఒక తండ్రి కూతురిని ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తూ తనని జాగ్రత్తగా చూసుకుంటారో సుధీర్ కూడా నన్ను అదే విధంగా చూసుకున్నారని తెలిపారు. ఇలా సుధీర్ మంచితనం చూసి ఈమె ఒకానొక సమయంలో తను నాకు ఒక ఫాదర్ లాంటివారని కూడా తెలిపారు.
ప్రస్తుతం ఒంటరిగా యాంకరింగ్ చేయడం అంటే నాకు కష్టంగా ఉంది కనుక ఇప్పుడు సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ మరో దారులను వెతుక్కున్నానని తెలిపారు. ఇప్పటివరకు నాకు కెరియర్ పరంగా ఎలాంటి ఢోకా లేదని ప్రస్తుతం రెండు సినిమా పనులలో బిజీగా ఉన్నానని విష్ణు ప్రియ తెలిపారు. ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ కూడా అభిమానులను సందడి చేస్తున్నారు. ఇక విష్ణుప్రియ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకొని బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
Also Read: Biker Movie: F1 సినిమాను మించి బైకర్ ఉండబోతుందా.. అంత కాన్ఫిడెన్స్ ఏంటి భయ్యా?