BigTV English
Advertisement

Bigg Boss 9 Day 55: కెప్టెన్ దివ్యకి నాగార్జున కౌంటర్.. సంజన, భరణి, ఇమ్మూకి ఫుల్ క్లాస్, డిమోన్ ని వెళ్లిపోమ్మన్న హోస్ట్

Bigg Boss 9 Day 55: కెప్టెన్ దివ్యకి నాగార్జున కౌంటర్..  సంజన, భరణి, ఇమ్మూకి ఫుల్ క్లాస్, డిమోన్ ని వెళ్లిపోమ్మన్న హోస్ట్


Bigg Boss 9 Day 55 Episode Review: బిగ్ బాస్ మరో వీకెండ్ వచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఫుల్ ఫైర్ మోడ్ లో ఉన్నారు. హౌజ్ లో తప్పుచేసిన వారి ఒక్కొక్కరి తాట తీసేశారు. వీడియోలు ప్లే చేసి మరీ ఫుల్ క్లాస్ పీకాడు. అందులో భరణి, ఇమ్మాన్యుయేల్, డిమోన్ కి చుక్కలు చూపించాడు. వారికి వార్నింగ్, సూచనలు చేశాడు.. ఈ వీకెండ్ ఎపిసోడ్ ఎలా సాగిందో చూసేద్దాం.

దివ్య ఓవరాక్షన్.. నాగ్ కౌంటర్

భరణి రీఎంట్రీ ఇచ్చాక దివ్య ఓవరాక్షన్ మామూలుగా లేదు. నాన్న నాన్న అంటూ వదలకుండ భరణి చూట్టూనే తిరుగుతుంది. ఆయనను ఎవరూ ఏమన్నా అంటే అసలు ఊరుకోవడం లేదు. అవసరం లేకుండ మధ్యలో కలుగజేసుకుంది. ఇదే విషయమై నాగార్జున దివ్యకి పుల్ క్లాస్ ఇచ్చాడు. బిర్యానీ టాస్క్ లో మాధురి, భరణి మధ్య విభేదం వస్తే మధ్య దివ్య కలుగజేసుకుని వివరణ ఇస్తుంది. దీంతో అసలు గొడవేంటి నీకు తెలుసా? క్లారిటీ లేనప్పుడు నువ్వేందుకు మధ్యలో దూరవంటూ మొట్టికాయ వేశాడు. ఇంకోసారి క్లారిటీ లేకుండ మధ్య వెళ్లకని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.


ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో భరణి సెఫ్ గేమ్ అడటంపై కూడా హోస్ట్ నాగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికే సేఫ్ గేమ్ ఆడి బయటకు వెళ్లావు.. ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడితే మళ్లీ నిన్ను ఇంట్లోకి తీసుకువచ్చిన ఆడియన్స్ రిగ్రెట్ అవుతారని అన్నాడు. తాను సేఫ్ గేమ్ ఆడలేదని, దివ్యకి సపోర్టు చేస్తానని తనూజకి చెప్పానంటూ సమాధానం ఇస్తాడు. టాస్క్ మొదలవ్వడానికి ఎంతో టైం, సాంగ్ ప్లే అవుతున్నంత సేపు కూడా ఎటు వెళ్లకుండ మధ్యలో ఉన్నావ్ ఇది సేఫ్ గేమా కాదా ప్రశ్నించాడు.

కళ్యాణ్ రీవేంట్ గేమ్

అలాగే మిగతా హౌజ్ మేట్స్, ఆడియన్స్ కూడా భరణి సేఫ్ గేమ్ ఆడారంటూ నాగార్జునకే ఓటేశారుడిమోన్ కి క్లాస్ పీకిన గ్యాప్ లో కాస్తా బ్రేక్ ఇచ్చాడు నాగ్. ఈ గ్యాప్ లో భరణి దివ్యపై అరిచాడు. నా కోసం నేను డిఫెండ్ చేసుకుంటుంటే నువ్వేందుకు మధ్యలో మాట్లాడవని అంటే కెప్టెన్ గొడవ అవుతుంటే స్టాండ్ తీసుకున్నానని, నా మీద అరవకండి నాకు బాధేస్తుందంటూ దివ్య ఏడుపు మొహం పెట్టింది. సుమన్ ని సమర్థమైన కెప్టెన్ అని పొగుడుతూనే సంజనకి గట్టి చురక అట్టించాడు.

ఆ తర్వాత కళ్యాణ్ రేషన్ మెనేజర్ తనూజ ప్రవర్తించిన దానిపై ఆరా తీశాడు. ఇంట్లో ఏ కూర వండాలి, ఏం చేయాలనేది రేషన్ మేనేజర్ బాధ్యత హౌజ్ మేట్ కి ఆ హక్కు లేదు. కావాలని తనూజపై రివేంజ్ ప్లాన్ చేశాడు. బయట నుంచి ఫ్రెండ్స్ వచ్చారు కదా వారి నుంచి రివ్యూ తీసుకుని తన గేమ్ తీరు మార్చుకుని ఆట ఆడుతున్నాడంటూ కళ్యాణ్ కి శ్రీజ తనూజపై ఎక్కించాడని వీడియో చూపించకుండానే పరోక్షంగా బయటపెట్టాడు నాగార్జున

సుమన్ ని నువ్వే గిల్లావ్.. సంజనతో

నామినేషన్స్ తీసుకోలేక లోపలికి వెళ్లి సుమన్ గిల్లావంటూ క్లాస్ పీకాడు. అంతేకాదు ఫుడ్ దగ్గర అలిగి వెళ్లడం కరెక్ట్ కాదని సూచించాడు. చెప్పకుండ కర్రీ వేసుకోవడమే కాకుండ అడిగినందుకు అలా వెళ్లడం పెద్ద తప్పని సంజనకు వారించాడు నాగార్జున. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ తనూజని నామినేట్ చేసి పాయింట్ పై ఆరా తీశాడు. నామినేష్ పాయింట్ చాలా వీక్ ఉందని, అర్థం లేకుండ తనూజని నామినేషన్ చేవావని వీడియో ప్లే చేసి మరి ఇమ్మాన్యుయేల్ తప్పిదాన్ని బయటపెట్టాడు. బొమ్మల టాస్క్ లో తనకి సపోర్టు చేసిన తనూజ.. చివరకు రాముని పర్మినెంట్ హౌజ్ మేట్ చేస్తూ సపోర్టు చేశావని, దానికి నా మైండ్ బ్లాంక్ అయ్యిందన్నాడు. అయితే అక్కడ తనని అడిగే ఈ నిర్ణయం తీసుకున్నానని లేదని అన్నాడు ఇమ్మాన్యుయేల్.

డిమోన్ వెళ్లిపోమ్మన్న హోస్ట్

కానీ, వీడియో తనూజ ఇమ్మూని నిర్ణయం తీసుకుంటున్నా అన్నట్టు సైగా చేస్తే.. చెప్పేసేయ్ అంటూ చేయితో సైగ చేశాడు. అక్కడ తనూజ నిర్ణయాన్ని ఒకే అన్నట్టుగానే ఉంది. కానీ, నామినేషన్ లో తాను అనలేదంటూ తనూజని వీక్ పాయింట్ నామినేట్ చేశావని స్పష్టం చేశాడు నాగార్జున. ఈ వీడియో మిగతా హౌజ్ మేట్స్ కి కూడా ఇమ్మూ నామినేషన్ తప్పని తేలిపోయింది. నెక్ట్స్ డిమోన్ వంతు వచ్చింది. రీతూతో గొడవ విషయంలో డిమోన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. రీతూతో వాదనలో తను వెళ్లిపోతుంటే.. ఆగు అంటూ లాగి పడిశాడు. అలా ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు చేశాడు. ఈ వీడియో ప్లే చేసి ఇదే మీ ఇంట్లో వాళ్లు చేస్తే బెల్ట్ తో కొడతారా? లేదా? అని హౌజ్ మేట్స్, ఆడియన్స్ అభిప్రాయం తీసుకున్నాడు. డిమోన్ చాలా మంచి ప్లేయర్ కానీ, ఈ ఒక్క విషయం దగ్గర ఫుల్ నెగిటివ్ అయ్యాడని ఆడియన్స్ అంటారు. అది చేయి చేసుకున్నట్టుగా బయటకు వెళ్లింది.. అది తప్పు అంటూ అంత డిమోన్ తీరు తప్పని చెప్పారు. 

Also Read: Bigg Boss Telugu 9 Day 54: భరణిని టార్గెట్ చేసిన మాధురి.. శ్రీజ అవుట్.. భయంతో సంజన..

మోకాళ్లపై వేడుకున్న పవన్

దీంతో నాగార్జున పవన్ నీ లగేజ్ పట్టుకుని బయటకు వచ్చేయంటూ ఫుల్ పైర్ అయ్యాడు. దీంతో రీతూ పవన్ కి స్టాండ్ తీసుకుంది. అక్కడ ఇద్దరి తప్పు ఉందని, ఈసారికి క్షమించమని హోస్ట్ ని వేడుకుంది. అది నీకు తప్పు కాకపోయినా.. బయటకు మాత్రం ఇలాంటివి అసలు ఊరుకునేది లేదు. బిగ్ బాస్ అంటే మీరు మాత్రమే కాదు.. నెక్ట్స్ ఎన్నో సీజన్స్ జరగాలి.. ఇలాంటివి బయటకు ఎల వెళతాయన్నాడు. అది మ్యాన్ హ్యండ్లింగ్ కాదు.. నేను వెళ్లిపోతుంటే ఆ హీట్ మూమెంట్ నన్ను గట్టిగా తోశాడంతే అంటూ పవన్ కి ఫుల్ సపోర్టు ఇచ్చింది. చివరి నాగార్జున హౌజ్ల పవన్ బయటకు వెళ్లాలి అనుకునేవారు చేతులెత్తండి అడిగితే.. ఎవరూ చేతులెత్తలేదు. హౌజ్ లోనే ఉంచి పన్మిషెంట్ ఇవ్వండి… కానీ, బయటకు పంపించే అంత పెద్ద తప్పు కాదని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ అతడికే సపోర్టు ఇచ్చారు.

రాము రాథోడ్ పై స్పెషల్ ఫోకస్

చివరకు ఇకపై ఇలాంటి తప్పు జరగదంటూ డిమోన్ మోకాళ్లపై పడి వేడుకోవడంతో నాగ్ క్షమించాడు. అతడికి ఎలాంటి శిక్ష వేయమని కెప్టెన్ దివ్యకు అప్పగించాడు. ఆ తర్వాత హౌజ్ లో తన గోల తనదే అన్నట్టుగా ఉంటున్న రాము రాథోడ్ వీడియో ఒకటి ప్లే చేశాడు నాగార్జున. ఎవరూ గొట్టుకున్న, అరిచిన, బాధపడుతుంటే రాము మాత్రం తన పనిలో తాను ఉంటూ హౌజ్ లో అందరిని ఒక వస్తువుల్లా ట్రీట్ చేస్తూ కనిపించాడు. తనూజ చెప్పినట్టే తన గోల తనదే కానీ, ఎదుటి వారి ఫిలింగ్స్ తనకు అవసరం లేద అంటుంది. అచ్చం అలాగే చేశాడు. సో ఇకపై హౌజ్ లో రాము ఎలా ఉంటున్నాడో కాస్తా కన్నేయమని కెప్టెన్ దివ్య నొక్కి మరి చెప్పాడు.

Related News

Bigg Boss 9 Elimination: ఎలిమినేషన్ లో ట్విస్ట్.. మాధురి అవుట్.. తనూజ పవరాస్త్రా సంగతేంటి?

Bigg Boss 9 : డిమోన్ పై నాగ్ ఫుల్ ఫైర్.. బయటకు వెళ్లిపోమ్మని తలుపులు తెరిచిన బిగ్ బాస్

Bigg Boss 9: బయట ఫుల్ నెగిటివ్.. కానీ, రోజు రోజుకి నచ్చేస్తోన్న క్యూట్ పాప

Ramya Moksha : వైరల్ అవుతున్న పచ్చళ్ల పాప వీడియో, బిగ్బాస్ గుట్టు రట్టు

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 8వ వారం ఎలిమినేట్ అతనే..? ఓటింగ్ రివర్స్.. విన్నర్ ఎవరంటే..?

Bigg Boss 9 New Captain: సర్ప్రైజ్.. హౌజ్ లో కొత్త డెన్.. భరణికి బిగ్ బాస్ స్పెషల్ పవర్.. కొత్త కెప్టెన్ ఆమెనే

Bigg Boss Telugu 9 Day 54: భరణిని టార్గెట్ చేసిన మాధురి.. శ్రీజ అవుట్.. భయంతో సంజన..

Big Stories

×