BigTV English
Advertisement

Gautam Gambhir: ఓరేయ్ గంభీరా…ఏంట్రా ఇది, గ‌ల్లీ పోర‌గాళ్ల ఆట కంటే దారుణం…?

Gautam Gambhir: ఓరేయ్ గంభీరా…ఏంట్రా ఇది, గ‌ల్లీ పోర‌గాళ్ల ఆట కంటే దారుణం…?

Gautam Gambhir:  టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India ) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టి20 సిరీస్ లో రెండో మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్లు చేతులెత్తేశారు. మరో 10 నుంచి 15 పరుగులు ఎక్కువ చేసి ఉంటే రెండో టి20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించేది. కానీ గౌతమ్ గంభీర్.. కారణంగానే టీమిండియా ఓడిపోయిందని విమర్శలు వస్తున్నాయి. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తాన్ని మార్చేసి, గౌతమ్ గంభీర్ ఇప్పుడు విలన్ గా మారారని ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Womens World Cup 2025: 1973 నుంచి వ‌ర‌ల్డ్ క‌ప్‌ టైటిల్ గెలిచిన జ‌ట్లు ఇవే..టీమిండియా ఒక్క‌టి కూడా లేదా ?

టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై సీరియస్

టీమిడియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టి20 మ్యాచ్ లో… భారత బ్యాటింగ్ ఆర్డర్ ను పూర్తిగా మార్చేశాడు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir ). టాస్ ఓడిపోయి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 125 ప‌రుగులే ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంతో ఎక్కువ పరుగులు చేయలేకపోయింది. ఫస్ట్ డౌన్ లో రావాల్సిన సూర్య కుమార్ యాదవ్ ను నాలుగో వికెట్ కు గౌతం గంభీర్‌ పంపించాడు. మొదటి టీ20 లో ఫస్ట్ డౌన్ లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. కానీ రెండో టి20 వచ్చేసరికి అతని స్థానమే మారిపోయింది. దీంతో ఒకే ఒక్క పరుగుకు ఔట్ అయ్యాడు సూర్య భాయ్‌. కెప్టెన్ అని చూడకుండా గంభీర్ ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. అటు ఫస్ట్ డౌన్ లో సంజూ శాంస‌న్‌ ను పంపిస్తే ఆ ప్రయత్నం విఫలమైంది. సంజూ ఓపెనర్ గా లేదా మిడిల్ ఆర్డర్ లో వస్తే బాగుంటుంది. అక్కడ కూడా గౌతమ్ గంభీర్ తప్పిదం చేశాడు.


హర్షిత్ రాణాతో ప్రయోగం

ఇటు టీమిండియా 5 వికెట్లు కోల్పోయిన దశలో శివం దూబేను రంగంలోకి దించాలి. కానీ అభిషేక్ శర్మ బాగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలర్ హర్షిత్ రాణాను బరిలోకి దించాడు గౌతమ్ గంభీర్. అతడు 30కి పైగా పరుగులు చేసినప్పటికీ, అభిషేక్ శర్మకు స్ట్రైక్ ఇవ్వలేదు. దీంతో టీమిండియా ఎక్కువ పరుగులు చేయలేకపోయింది. అభిషేక్ శర్మకు ఎక్కువ స్ట్రైక్ వస్తే, అతడు హిట్టింగ్ ఆడి ఎక్కువ పరుగులు సాధించేవాడు. అలా హర్షిత్ రాణా ప్రయోగం కూడా విఫలమైంది. దీంతో టీమిండియా అభిమానులు గౌతమ్ గంభీర్ పై సీరియస్ అవుతున్నారు. గల్లీలో క్రికెట్ లాగా టీం ఇండియా పరిస్థితి తయారయిందని ఫైర్ అవుతున్నారు. ఎవడు ఎప్పుడు వస్తాడో తెలియదు.. ఎవడు తుది జట్టులో ఉంటారో అంచన వేయలేం.. బౌలర్ ను ఆల్ రౌండర్ చేస్తానంటున్నాడు.. ఏంటో గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత టీమ్ ఇండియా చెత్త రికార్డులను మూట గ‌ట్టుకుంటోంద‌ని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Also Read: Gambhir: గంభీర్‌ ఓ చీడ పురుగు.. బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చ‌డంపై ట్రోలింగ్‌, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా దించుకో!

?igsh=enZpOHZqNjNwcDg3

Related News

Washington Sundar: ఒకేసారి ఇద్దరితో డేటింగ్ చేస్తున్న వాషింగ్టన్ సుందర్ ?

IPL 2026: RCBకి కోహ్లీ వెన్నుపోటు…కొంచెం కూడా మ‌న‌వ‌త్వం లేదా?

Womens World Cup 2025: టీమిండియాకు రూ.125 కోట్ల ఆఫ‌ర్‌..?ఐసీసీ కంటే 3 రేట్లు ఎక్కువే

Smriti mandhana: జమీమా సక్సెస్ చూసి కుళ్ళుకుంటున్న స్మృతి మందాన.. టీమిండియాలో అంతర్యుద్ధం ?

Australia: ఆ ఒక్క త‌ప్పిదం… ఆస్ట్రేలియాకు చుట్టుకున్న ద‌రిద్రం.. ఇక అనుభ‌వించాల్సిందే

Kasturi -Jemimah: జెమిమా రోడ్రిగ్స్ పై న‌టి కస్తూరి సీరియ‌స్‌.. నీకు మెడ మీద త‌ల‌కాయ ఉందా?

Team India: మోడీ సార్… గంభీర్, అగర్కార్ ను మీరైనా తీసేయండి.. టీమ్ ఇండియాను కాపాడండి!

Big Stories

×