Ramya Moksha : బిగ్ బాస్ 9 కొంతమంది సెలబ్రిటీలతో పాటు కొంతమంది కామనర్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఒక ఆరుగురిని ఎలిమినేట్ చేసిన తరువాత ఫైర్ స్ట్రోమ్ అంటూ మరో ఆరుగురిని హౌస్ లోకి పంపించారు. వీళ్ళలో దువ్వాడ మాధురి మరియు రమ్య మోక్ష ఉన్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ రావడం వలన మంచి గుర్తింపు సాధించుకున్నారు. ఆ తర్వాత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేవలం రెండు వారాల్లోనే రమ్య బయటకు వచ్చేసింది. రమ్య బయటకు వచ్చేయడానికి ఆడియన్స్ ఓటింగ్ మాత్రమే కారణం అని అందరూ అనుకున్నారు. తనకు ఎవరూ ఓట్స్ వేయలేదు అని ఊహించారు. బయటికి వచ్చిన తర్వాత రమ్య చేసిన వీడియో చూస్తుంటే అందరికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతివారం నామినేషన్స్ జరుగుతాయి అన్న సంగతి తెలిసిందే. ఒకసారి నామినేషన్ లో భాగంగా తనుజా ను నామినేట్ చేస్తూ. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు. నీ ఒరిజినల్ రంగు అసలు బయటపడలేదు. నువ్వు ఒక జలస్ క్వీన్ వి అంటూ తన గురించి పచ్చి నిజాలు అన్నీ కూడా ఒక్కసారిగా బయట పెట్టేసింది.
తనుజ గురించి చాలా వాస్తవాలు బయటపెట్టినప్పుడు సోషల్ మీడియాలో పాజిటివ్ గా కూడా రమ్యకు కామెంట్స్ వచ్చాయి. ఉన్నది ఉన్నట్లు రమ్య మాట్లాడుతుంది అని అందరూ పోస్టులు కూడా పెట్టారు.
తాజాగా రమ్య రిలీజ్ చేసిన వీడియోలో తనుజ ఒక గొడవను 24 గంటలు సాగదీస్తుంది. ఎందుకంటే అరగంటసేపు మాట్లాడితే కేవలం ఫుటేజ్ రాదు కాబట్టి 24 గంటలు మాట్లాడితే ఎక్కువ ఫుటేజ్ వస్తుంది అనే ఉద్దేశంతోనే ఆమె ఆ పనులు చేస్తుంది.
నేను ఇప్పటికీ కూడా అదే మాట మీద ఉంటున్నాను ఆవిడ బాగా నటిస్తుంది. తన ఒరిజినాలిటీ ఇంకా బయటికి తీయడం లేదు. కేవలం ఆమె గురించి వాస్తవాలు చెప్పాను కాబట్టి నన్ను బయటకు తీసుకొచ్చేశారు. ఆడియన్స్ ఓటింగ్ వలన నేను బయటకు వచ్చేసాను అని అందరూ అనుకున్నారు.
కానీ నేను ఆడియన్స్ ఓటింగ్ స్ ప్రకారం చూస్తే థర్డ్ గాని ఫోర్త్ ప్లేస్ లో గాని ఉంటున్నాను. నేను ఆవిడకి ఎదురు తిరిగాను కాబట్టి ఇంకా ఉంటే ఆవిడకి నెగిటివ్ గా మాట్లాడుతాను కాబట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి నన్ను బయటకు పంపించేశారు అంటూ రమ్యమోక్ష తెలిపింది.
Also Read: Sandeep Reddy Vanga: ఒక్కో డైరెక్టర్ దగ్గర రెండు టీమ్స్, ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది