Bigg Boss 9: బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ల గురించి ఒక్కసారిగా అవగాహన రాదు. రోజులు గడుస్తున్న కొద్ది ఎవరు ఒరిజినాలిటీ ఏంటో తెలుస్తూ ఉంటుంది. అయితే రీతు చౌదరి గురించి బయట మొదట్లో విపరీతమైన కామెంట్స్ వినిపించాయి. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె మీద కూడా మెల్లమెల్లగా పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది.
రీతు చౌదరి గురించి బయట గౌతమి చౌదరి చాలా కామెంట్స్ చేశారు. ధర్మ మహేష్ తో గౌతమి చౌదరి విడిపోవడానికి ఒక కారణం కూడా రీతూ చౌదరి అంటూ అప్పట్లో విపరీతమైన టీవీ డిబేట్స్ కూడా జరిగాయి. అయితే హౌస్ లో ఉన్న రీతూ కి ఇవన్నీ తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఏమి స్పందించలేదు హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన గొడవలు కూడా జరిగే అవకాశం ఉంది.
అయితే మొదట్లో షో చూస్తున్నప్పుడు తనని సపోర్ట్ చేయమని చాలామందిని అడుగుతూ ఉండేది రీతు చౌదరి. అయితే హౌస్ లో రోజులు గడుస్తున్న కొద్దీ హౌస్ మేట్స్ అందరితో కూడా మంచిగా కలిసిపోయే ప్రయత్నం చేస్తుంది.
అందరితో బాగా మాట్లాడటం మొదలు పెడుతుంది. ఎవరైనా డల్ గా కూర్చుంటే వెళ్లి మాట్లాడుతుంది. నిన్న కెప్టెన్సీ టాస్క్ లో కూడా బానే డాన్స్ చేసింది. పవన్ తో కలిసి ఉన్నా కూడా తన గేమ్ ఎక్కడ స్పాయిల్ చేసుకోకుండా చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది.
మొదట్లో ఈమె మీద నెగిటివ్ కామెంట్స్ ఉన్నా కూడా రోజులు గడుస్తున్న కొద్ది ఈమె చాలా మంది వీక్షకులకు రోజురోజుకు నచ్చుతుందని చెప్పాలి.
మరోవైపు విన్నర్ మెటీరియల్ అని చెప్పలేము గాని టాప్ ఫైవ్ లో ఉండే అవకాశం ఉంది అనేది చాలామందికి ఉన్న అభిప్రాయం. అయితే ఇంకా రీతు చౌదరి తన గేమ్ ను డెవలప్ చేసుకుని ఎలా ఆడుతుందో ముందు ముందు తెలుస్తుంది.
అయితే కొన్ని విషయాల్లో ఇప్పటికీ కూడా అనవసరంగా అరుస్తూ ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పర్ఫెక్ట్ గా మాట్లాడుతూ టాస్కులు ఆడుతూ ఉంటే తనకి మంచి సపోర్ట్ తో పాటు ఓట్లు కూడా లభిస్తాయి.
Also Read : Ramya Moksha : వైరల్ అవుతున్న పచ్చళ్ల పాప వీడియో, బిగ్బాస్ గుట్టు రట్టు