Newyork Airport: అమెరికా న్యూయార్క్ లోని ఓ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయంలో రెండు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాలు ఢీకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.
లాగార్డియా ఎయిర్ పోర్టులో ఆగిఉన్న విమానాన్ని మరో విమానం ఢీకొంది. శుక్రవారం రాత్రి ఫ్లోరిడా నుంచి తిరిగి వస్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయంలో దిగుతుండగా.. టాక్సీవేలో ఆగిఉన్న మరో ఎయిర్‌లైన్స్ విమానం వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో రెండు విమానాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని నిర్ధారించారు. విమానం ఢీకొన్న వెంటనే అందులోని ప్రయాణికులను దింపేసి, రెండింటిని పూర్తిగా తనిఖీ చేశారు. ప్రమాదం సమయంలో రెండు విమానాల్లో 328 మంది ప్రయాణికులతో సహా 15 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. టాక్సీ రన్‌వేకి వెళ్తున్నప్పుడు విమానం ఢీకొట్టినట్లు అనిపించిందని ప్రయాణికులు తెలిపారు. కానీ కెప్టెన్ చెప్పే వరకు అది మరొక విమానం తెలియదు” అని ఓ ప్రయాణికుడు తెలిపారు.
యూఎస్ ప్రభుత్వ షట్‌డౌన్ తర్వాత చాలా మంది ఎఫ్ఏఏ, టీఎస్ఏ ఉద్యోగులకు జీతం చెల్లించలేదు. దీంతో సిబ్బంది కొరత కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారం 570 కంటే ఎక్కువ లాగార్డియా విమానాలు ఆలస్యం నడుస్తున్నాయి. 130కి పైగా విమానాలు రద్దు చేశారు. లాగార్డియా, జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలోసిబ్బంది కొరత వేధిస్తుందని యూఎస్ తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సిబ్బంది కొరత కారణంగా న్యూయార్క్ విమానాశ్రయాలు ప్రభావితమయ్యాయని ఎఫ్ఏఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లైట్‌అవేర్ సమాచారం ప్రకారం, శుక్రవారం దేశవ్యాప్తంగా 5,700 కంటే ఎక్కువ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 500 విమానాలు రద్దు అయ్యాయి.
Also Read: Helicopter Crash: ఘోర ప్రమాదం.. కుప్ప కూలిన హెలికాఫ్టర్.. సోషల్ మీడియాల్ వీడియోలు వైరల్