Big tv Kissik Talks: విష్ణు ప్రియ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన ఈమె అనంతరం సినిమాలలోను వెబ్ సిరీస్లలోనూ అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ విష్ణు ప్రియ (Vishnu Priya)ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉండటమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకొని భారీగా సంపాదిస్తున్నారని కూడా చెప్పాలి. ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big Tv Kissik Talks) కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విష్ణు ప్రియ తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే కెరియర్ పరంగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే విష్ణు ప్రియ పెళ్లి గురించి ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. విష్ణు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నావు అంటూ వర్ష అడగడంతో సంవత్సర క్రితం నాలోని ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనిపించింది అంటూ పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మన జీవితంలో ఏం జరగాలని కోరుకుంటామో అది జరగదు అందుకే నాకు పెళ్లి వద్దు. అలాగే లవ్ మ్యారేజ్ వద్దు అంటూ ఈమె పరోక్షంగా లవ్ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పకనే చెప్పేశారు.
ఇక లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం నేనున్న ఈ పరిస్థితులలో నాకు అరేంజ్ మ్యారేజ్ అసలు సెట్ అవ్వదని కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని తెలిపారు.అరేంజ్ మ్యారేజ్ చేసుకునే టైప్ మనం కాదంటూ ఈ సందర్భంగా విష్ణు ప్రియ తెలిపారు. ఇక లవ్ మ్యారేజ్ అని చెప్పడంతో పృద్వి (Pruthvi)తో రిలేషన్ గురించి వర్ష ప్రశ్నించారు. బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలో కొనసాగే సమయంలో విష్ణు ప్రియ సీరియల్ నటుడు పృథ్వితో లవ్ ట్రాక్ నడిపిన సంగతి తెలిసిందే.
ఇలా వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడంతో నిజంగానే ప్రేమలో ఉన్నారని అందరూ భావించారు. ఇక బయటకు వచ్చిన తర్వాత కూడా వీరు అదే రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారని అందరు భావించారు కానీ తాజాగా పృద్వితో తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు. పృథ్వి తనకు కేవలం మంచి ఫ్రెండ్ మాత్రమేనని ఫ్రెండుని ఫ్రెండ్ లాగానే ఉండనివ్వాలి అంటూ విష్ణు ప్రియ తెలియజేశారు. ఇక పృథ్వితో ప్రేమలో ఉంది అంటూ వస్తున్న వార్తలను ఇలా ఖండించారనే చెప్పాలి .మరి విష్ణు ప్రేమ వివాహం చేసుకుంటానని తెలిపారు. మరి పెళ్లికి సంబంధించిన ఆ శుభవార్తను ఎప్పుడూ చెబుతాలో వేచి చూడాలి.
Also Read: Big tv Kissik Talks: సుధీర్ లేకపోతే జీవితమే లేదు… విష్ణు ప్రియ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!