Bigg Boss Telugu 9 New Captain: భరణి పర్మినెంట్ హౌజ్ మేట్ అయ్యారు. ఈవారమంత భరణి, శ్రీజల కోసం హౌజ్ లో టాస్క్ లో జరగాయి. దీంతో కెప్టెన్సీ కంటెండర్లను నిర్ణయించే బాధ్యత బిగ్ బాస్ భరణి చేతిలో పెట్టాడు. దీంతో భరణి కెప్టెన్సీ కంటెండర్లుగా తనకు సపోర్టు ఇచ్చిన వారిని ఎంచుకున్నాడు. తన టీంలో ఉన్న తనూజ, దివ్య, నిఖిల్ తో పాటు తనకు కూడా కంటెండర్ గా ఉన్నాడు. అవతల టీం నుంచి సాయిని కంటెండర్ గా ఫైనల్ చేసి బిగ్ బాస్ కి ప్రకటించాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. కంటెండర్స్ ఒకటి, సపోర్టు చేసే వారికి మరో సైట్ ప్లాట్ ఫాం అమర్చారు. కెప్టెన్సీ కంటెండర్ ఒకసైడ్, వారికి సపోర్టు చేసేవారు మరో ప్లాట్ ఫాంపై ఉండాలి. మ్యూజిక్ ప్లే అవుతున్నంత సేపు వారు డ్యాన్స్ చేస్తుండాలి.
అలా మ్యూజిక్ ఆగిపోయేసరికి ఎంతమంది ప్లాట్ ఫాంపై ఉంటే వారంత కంటెండర్ కి సపోర్టు చేసినట్టు. ఎవరికైతే సపోర్టు ఇవ్వద్దు అనుకునే వారు డ్యాన్స్ చేస్తున్న వారిని ప్లాట్ ఫాం నుంచి కిందకు లాగొచ్చు. ఈ టాస్క్ కి రాము రాథోడ్ సంచాలక్. అలా మొదట సాయి వచ్చాడు. అతడికి సపోర్టుగా డ్యాన్స్ చేస్తుండగా.. సంజన, రీతూ, సుమన్, కళ్యాణ్ లు అందరు డ్యాన్స్ చేస్తుండగా.. చివరి మ్యూజిక్ ఆగిపోయే సరికి సంజన మాత్రం ప్లాట్ ఫాంపై ఉంది. ఆ తర్వాత దివ్య వచ్చింది.ఆమెకు సపోర్టుగా ఐదుగురు నిలిచారు. ఆ తర్వాత నిఖిల్ వంతు రాగా పాట అయిపోయేసరికి ప్లాట్ ఫాం మీద ముగ్గురే ఉన్నారు. ఆ తర్వాత భరణి వచ్చారు. మ్యూజిక్ అయిపోయేసరి ప్లాట్ ఫాంపై నలుగురు ఉన్నారు. దీనికంటే ముందు భరణి మాధురి సపోర్టు అడిగాడు. అందరు కాదు నాకు మీరు కూడా ప్లాట్ ఫాం ఎక్కి డ్యాన్స్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాడు. మాధురి సరే అని మాట ఇస్తుంది.
కానీ, మ్యూజిక్ ఆగిపోయేవరకు ప్లాట్ ఫాం పై ఉండకుండ మధ్యలోనే దిగిపోతుంది. చివరిగ తనూజ వచ్చింది. పాట ముగిసే సరికి తనూజకు ఎనిమిది మంది ఉన్నారు. ఫైనల్ పోరులో దివ్య వర్సెస్ తనూజ పడింది. అయితే మాధురి, రీతూ, పవన్ అంత గట్టిగా తనూజ గెలవాలని చూశారు. దివ్య నిఖిల్, సాయి, ఇమ్మాన్యుయేల్, రాములను సపోర్టు చేయమని అడగడంతో వారుతో దివ్యకే సపోర్టు ఇస్తామన్నారు. కెప్టెన్సీ కోసం జరిగిన ఈ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, గౌరవ్, సంజన, సాయిలు దివ్య సైడ్ ఉన్నారు. తనూజ సైడ్ మాత్రం మాధురి, రీతూ, డిమోన్, కళ్యాణ్ మాత్రమే తనూజ సైడ్ ఉన్నారు. నిఖిల్ అప్పటి వరకు తనూజకి సపోర్టు చేసి చివరికి ప్లాట్ దిగాడు. దివ్య సైడ్ ఎక్కువ మంది ఉండటంతో దివ్య గెలిచి ఎనిమిదో వారం కెప్టెన్ అయ్యింది. టాస్క్ జరుగుతున్నంత సేపు భరణి మధ్యలోనే నిలిచారు.
Also Read: Bigg Boss Telugu 9 Day 54: భరణిని టార్గెట్ చేసిన మాధురి.. శ్రీజ అవుట్.. భయంతో సంజన..
ఎవరికి సపోర్టు ఇవ్వకుండ న్యూట్రల్ గా ఉండిపోయారు. పరోక్షంగా భరణి దివ్యకే సపోర్టు చేశారని తేలిపోయింది. టాస్క్ ఓడటంతో తనూజ ఎమోషనల్ అయ్యింది. నా వల్ల అవ్వట్లేదు. అడుగు దూరంలో కెప్టెన్సీ పోతుందంటూ తనూజ కన్నీరు పెట్టుకుంటే రీతూ వచ్చి ఆమెను ఓదార్చింది. ఇక భరణి సపోర్టర్స్ అయినందుకు సుమన్, ఇమ్మాన్యుయేల్ లు దివ్యకు సపోర్టు ఇచ్చారు. భరణి నిర్ణయంలో ఫెయిర్ ఉన్న తనూజతో మాత్రం దూరం పెరిగినట్టే కనిపిస్తోంది. అంత అయిపోయాక.. రూంలో రీతూ, మాధురి, తనూజలు మాట్లాడుకుంటుండగా.. ఇక ఎవరిని మన మన అనుకోవద్దని అర్థమైందిరా, మనవాళ్లు ఎవరు లేరు అని వాపోయింది. భరణి సపోర్టు ఇవ్వకపోవడంతో మాధురి తనూజకి ఎక్కిస్తూ ఉంది. వెళ్లు నాన్న నాన్న అని పట్టుకోపో.. ఇప్పటికైనా ఎవరూ ఏంటనేది తెలుసుకో అంటూ తనూజకి ఎక్కిచింది. చివరిగా హౌజ్లో కొత్త ప్లేస్ యాక్సెస్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌజ్ డెన్ పేరుతో లగ్జరీ ప్లేస్ తెరిచి హౌజ్ కి మరింత కళ తెచ్చాడు. ఇది చూసి హౌజ్ మెట్స్ ఫుల్ ఖుష్ అయ్యారు.