EPAPER

Bigg Boss 8 Telugu : ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Bigg Boss 8 Telugu : ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Bigg Boss 8 Telugu : తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. ప్రస్తుతం 8 వ సీజన్ జరుపుకుంటుంది.. నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో వారంకు నామినేషన్స్ హౌస్ లో కొనసాగుతున్నాయి.. ఈ వారం ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలని హౌస్ మెట్స్ చురుగ్గా ఉంటున్నారు.. బిగ్ బాస్ ఇచ్చినా టాస్క్ లను అందరు యాక్టివ్ గా చేస్తున్నారు. అయితే హౌస్ లో ఇప్పటికే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్‌ అయిన కంటెస్టెంట్‌ను గురువారం ప్రకటిస్తారు. అయితే, ఐదోవారం మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు సంబంధించిన షూటింగ్ మాత్రం బుధవారం రోజే జరుగుతుంది. ఇక ప్రతివారం చేసే ఎలిమినేషన్ ప్రక్రియ ఆదివారం ఉంటుందని తెలిసిందే. కానీ, ఈవారం మాత్రం ఆదివారం కంటే ఒకరోజు ముందుగా శనివారం ఎవిక్షన్ అయిన కంటెస్టెంట్‌ను నాగార్జున చెప్పనున్నారు.. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వారం ఓ లేడి ఇంటి నుంచి బయటకు వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


నిన్నటి ఎపిసోడ్ లో మణికంఠను జైల్లో వేసి లాక్ వెయ్యాలని బిగ్ బాస్ చెబుతాడు. మణికంఠ అక్కడే ఉండాలని కూడా స్పష్టం చేశాడు. జైల్లో ఉన్న సమయంలో మణికంఠకు సీత ఆహారం అందిస్తుంది. ఇదిలా ఉంటే మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది మణికంఠ అని ప్రేక్షకులు డిసైడ్ అయిపోతున్నారు.. ఈ వీక్ నామినేషన్స్ నుంచి ప్రేరణ , యష్మీ ఎస్కేప్ అయ్యారు. సోనియా ఎలిమినేట్ అయ్యాక ప్రశాంతంగా ఉందంటూ విష్ణుప్రియ-ప్రేరణ ముచ్చట్లు పెట్టుకున్నారు. సోనియా వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉందని హౌస్ మెట్స్ మధ్య చర్చలు జరగడం నిన్నటి ఎపిసోడ్ లో చూడొచ్చు.. అంతేకాదు పృథ్వీ దగ్గరికి వెళ్లాలన్నా కూడా సోనియా వల్ల వెళ్లలేకపోయానని ఇప్పుడు హ్యాపీగా లవ్ ట్రాక్ నడిపించవచ్చని కూడా ఇన్ డైరెక్ట్ గా విష్ణు ప్రియా మాట్లాడింది..

ఇక నిఖిల్ ను కూడా విష్ణు ప్రియా వదల్లేదు. నిఖిల్ హౌస్ లో దద్దోజనం పప్పు , ఆడంగి వెధవ ఇలా దారుణంగా తిట్టి షాక్ ఇచ్చింది. ఇక నామినేషన్స్ లో విష్ణుప్రియ అన్ని తప్పులను ఒప్పుకుని ఈ వీక్ వెళ్లిపోవటానికి నేను సిద్ధం అని చెప్పకనే చెప్పింది. కంటెస్టెంట్స్‌ విష్ణుప్రియని భరించలేకపోతున్నారు. ఈమెకు నోటి దూల వల్ల అందరిని తిడుతుంది. ఏమనుకుంటారు అని మాత్రం ఆమెకు లేదని జనాలు కూడా ఓటింగ్ ద్వారా తెలిపారు. మర్యాద లేకుండా మాట్లాడేస్తుందని కూడా విమర్శిస్తున్నారు. ఈ కారణంతోనే ఆమెను ఈవారం నామినేట్ చేశారు కూడా. కానీ తనకు నోటి దూల ఎక్కువ కాదు అని విష్ణుప్రియ వాదిస్తోంది.. నామినేషన్స్ లో ఈ విషయం పై విష్ణు ప్రియాకు నిఖిల్ కు పెద్ద వార్ జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఈ వారం హౌస్ నుంచి విష్ణు ప్రియా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. మరి చివరికి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..


Related News

Bigg Boss 8 Day 33 Promo 3: హగ్ అండ్ పంచ్.. కొత్త ఛాలెంజ్ తో గేమ్ షురూ..!

Bigg Boss 8 Telugu : అరె ఏంట్రా ఇది.. రియాలిటీ షోనా లేక లవర్స్ అడ్డానా.. మరో లవ్ స్టోరీ రీవిల్..

Bigg Boss 8 Telugu : జ్యోతిషుడుగా మారిన మణికంఠ.. హద్దులు దాటేస్తున్న లవ్ ట్రాక్..

Bigg Boss 8 Sonia : హౌస్ లో సీక్రెట్ ఎఫైర్స్ పై సోనియా బాంబ్.. ఇంత పచ్చిగా చెప్పేసిందేంటి? 

Bigg Boss 8 telugu : హమ్మయ్య.. మణికంఠ కోరికను తీర్చేసిన బిగ్ బాస్..

Bigg Boss 8 Day 33 Promo 2: కన్ఫెషన్ రూమ్.. ట్విస్ట్ తో చెమటలు పట్టించిన యష్మీ..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో 8 వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలు.. మళ్లీ వీళ్లేనా?

×