Astrology 2 october 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి విజయావకాశం ఉంది? వంటి వివరాలపై జ్యోతిష్యులు ఎలాంటి విషయాలు చెప్పారో తెలుసుకుందాం.
మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో పెద్దల సహకారం ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
వృషభం:
వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం పూర్తయ్యేసరికి శ్రమిస్తారు. అన్ని రంగాల వారికి లాభాలు వరిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటాయి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.
మిథునం:
మిథున రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల్లో చేపట్టిన పనుల్లో తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. శారీరక శ్రమ, ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. శివస్తోత్రం పఠిస్తే మంచిది.
కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరుగులేని విజయాలు పొందుతారు. ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో హోదా పెరుగుతుంది. దైవారాధన మానవద్దు.
సింహం:
సింహ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారం అవసరం. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. విష్ణు సందర్శనం శుభప్రదం.
కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. కీలక పనుల్లో శ్రమ పెరుగుతుంది. లక్ష్మీకటాక్ష సిద్ధి ఉంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. విహార యాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు ప్రయాణాలు కలిసివస్తాయి. శ్రీకనకదుర్గా దేవి ఆరాధన శుభకరం.
Also Read: నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సుల కోసం ఏ రంగు దుస్తులు ధరించాలొ తెలుసా ?
తుల:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అన్ని రంగాల వారికి ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.
వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఊహించని లాభాలు వరిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢంగా ఉంటుంది. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఇష్ట దేవతారాధన శుభకరం.
ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి సంపద వృద్ధి చెందుతుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. దుర్గాస్తుతి పారాయణ మేలు చేస్తుంది.
మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు ఉంటాయి. రచయితలకు, కవులకు శుభసమయం. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. గోసేవ చేయాలి.
కుంభం:
కుంభ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. అన్ని రంగాల వారికి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో అనవసరంగా వాదనలు పెట్టుకోవద్దు. అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దుర్గాస్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.
మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు.శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయం బాగానే ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడం మంచిది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టదేవతను ఆరాధిస్తే మంచిది.