E-Paper
Advertisement

Rupee Crashes: ఇరాన్ వార్ ఎఫెక్ట్.. కనిష్టానికి రూపాయి, ఈ ఏడాదిలో అత్యధిక పతనం

Rupee Crashes: ఇరాన్ వార్ ఎఫెక్ట్.. కనిష్టానికి రూపాయి, ఈ ఏడాదిలో అత్యధిక పతనం
Advertisement

Rupee Crashes: ఇరాన్-అమెరికా యుద్ధం ప్రభావం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. దీనికితోడు భగ్గుమంటున్న చమురు ధరలు ఓ వైపు.. మరోవైపు రూపాయి పతనానికి ఫెడ్ నిర్ణయాలు తోడు అయ్యాయి. ఫలితంగా గురువారం దేశీయ మార్కెట్లో డాలర్ తో పోల్చితే రూపాయి కనిష్టానికి చేరుకుంది.

ఇరాన్ వార్ ఎఫెక్ట్.. కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ

Advertisement

గురువారం బాంబే స్టాక్ మార్కెట్ మొదలు కాగానే భారీగా పతనమైంది. అమెరికా-ఇరాన్ ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చితే రూ.95 మార్కును దాటి కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్‌తో రూపాయి పోలిస్తే రూ.95.01 వద్ద ప్రారంభమైంది.

ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి రూ.95.20 వద్దకు చేరుకుంది. మునుపటి ముగింపుతో పోలిస్తే 32 పైసల భారీ పతనాన్ని నమోదు చేసింది. వాషింగ్టన్-టెహ్రాన్‌ల మధ్య దౌత్యపరమైన చర్చల కారణంగా పెట్టుబడిదారులు డాలర్ వైపు మొగ్గుచూపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూపాయి విలువ సుమారు 5.8 శాతం మేర క్షీణించింది.

Advertisement

ఈ ఏడాదిలో అత్యధికంగా రూపాయి పతనం

దీనికితోడు ఇరాన్‌కు చెందిన చమురు ట్యాంకర్లను అమెరికా స్వాధీనం చేసుకోవడం బలమైన కారణమైంది. నౌకా దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేయడంతో చమురు సరఫరాపై ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఫలితంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల సమీపంలో ట్రేడింగ్ జరుగుతోంది.

ఇదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. భవిష్యత్తులో కఠినంగా వ్యవహరిస్తామనే సంకేతాలు ఇవ్వడంతో డాలర్‌ను బలపరిచింది. ఫలితంగా రూపాయితోపాటు వివిదే దేశాల కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది.

ALSO READ: పీఎఫ్‌ ఖాతాదారులకు మరొక తీపి కబురు.. ఇకపై అండగా ‘ఈ-ప్రాప్తి’, ఆ చింత అవసరం లేదు

ఆరు కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే యూఎస్ డాలర్ ఇండెక్స్ చివరిగా 0.01% పెరిగి 98.96 వద్ద ట్రేడవుతోంది. ఆఫ్‌షోర్ నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ మార్కెట్ల‌పై ఆంక్షలు విధించి మార్చి 30 తర్వాత రూపాయి 95 మార్కును దాటడం కూడా ఇదే మొదటిసారి. రూపాయి విలువ తీవ్ర పతనం నుండి తమను తాము కాపాడుకోవడానికి దిగుమతిదారులు హెడ్జింగ్ చేసుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నమాట.

Related News

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి

Big Stories

Advertisement
×