E-Paper
Advertisement

Tanveer Ahmed : త‌న్వీర్ అహ్మ‌ద్ కు బిగ్ షాక్‌..వీసా రిజెక్ట్ చేసిన మోడీ స‌ర్కార్

Tanveer Ahmed : త‌న్వీర్ అహ్మ‌ద్ కు బిగ్ షాక్‌..వీసా రిజెక్ట్ చేసిన మోడీ స‌ర్కార్
Advertisement

Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 20026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పై విషం కక్కుతున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. ఇందులో తన్వీర్ అహ్మద్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ టోర్నమెంట్ లో ఫిక్సింగ్ జరుగుతోందని పదే పదే ఆరోపణలు చేస్తున్నాడు. అయితే అలాంటి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ త‌న్వీర్‌ అహ్మద్ కు ( Tanveer Ahmed) మోడీ ప్రభుత్వం ( Modi Govt) ఊహించని షాక్ ఇచ్చింది. ఇండియాలో ( India) పర్యటించేందుకు వీసా అప్లై చేసుకుంటే, రిజెక్ట్ చేసిందట‌ మోడీ సర్కార్. ఈ విషయాన్ని స్వయంగా త‌న్వీర్‌ అహ్మద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శ‌త‌కం చేస్తే, బాబర్ మాత్రం సెంచ‌రీ చేస్తాడు

త‌న్వీర్‌ అహ్మద్ వీసా రిజెక్ట్ చేసిన మోడీ ప్రభుత్వం

Advertisement

ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఏ మాత్రం బాగాలేవన్న సంగతి తెలిసిందే. పచ్చి గడ్డి వేస్తే భ‌గ్గుమనే పరిస్థితిలు ఉన్నాయి. పహాల్గమ్ సంఘటన తర్వాత పాకిస్తాన్ వాళ్లకు ఇండియాలో ఎంట్రీ లేకుండా చేస్తుంది సర్కార్. బోర్డర్ లో అలాగే వీసా విషయంలో చాలా కఠినంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోంది. అయితే ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మాజీ బౌలర్ త‌న్వీర్‌ అహ్మద్ కు ఊహించని షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. ఇండియాలో పర్యటించేందుకు తాజాగా త‌న్వీర్‌ అహ్మద్ వీసా కోసం అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం మొత్తం 50 వేల రూపాయలు ఖర్చు పెట్టాడట.

అయితే 50,000 ఖర్చు అయిన కూడా వీసా రిజెక్ట్ చేసినట్లు ఇండియన్ ఎంబసీ వెల్లడించినట్లు స్పష్టం చేశాడు త‌న్వీర్‌ అహ్మద్. అసలు ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయం చెప్పకుండానే తనకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు త‌న్వీర్‌ అహ్మద్. తాను మూడు నెలలుగా సంపాదించిన డబ్బులు అన్ని ఈ వీసా కోసం పెడితే గంగపాలు చేశారని మోడీ సర్కార్ పై మండిపడ్డారు. ఇండియాకు వెళ్దాం అనుకున్నా తన కల‌ నెరవేరకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో త‌న్వీర్‌ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం వేపుతున్నాయి.

ప‌హ‌ల్గ‌మ్ సంఘ‌ట‌న‌పై షాహిద్ అఫ్రిది కామెంట్స్‌

Advertisement

పహల్గామ్ సంఘటనపై ఇటీవల పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ సంఘటనలో 26 మందిని చంపుతున్న కూడా ఇండియన్ ఆర్మీ ఎక్కడ ఉందని నిలదీశారు. ఆ ప్రాంతంలో ఎనిమిది లక్షల మంది ఇండియన్ ఆర్మీ ఉన్నప్పటికీ… ఘటన పూర్తయ్యే వరకు అక్కడికి చేరుకోలేదని ఆగ్రహించారు. మోడీ సర్కార్ కు అనుకూలంగా ఆ ఘటనను మార్చుకునేందుకు ఈ కుట్రలు చేశారని ఫైర్ అయ్యారు.

Also Read: Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన‌ రవి బిష్ణోయ్..ఇక జ‌న్మ‌లో ఓవ‌రాక్ష‌న్ చేయ‌డు Digvesh Vs Bishnoi

 

https://www.facebook.com/photo/?fbid=986533964287346&set=a.808612632079481

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×