E-Paper
Advertisement

మూత్రంలో రక్తం రావడంతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. గుండెలో సూది చూసి షాకైన డాక్టర్లు..

మూత్రంలో రక్తం రావడంతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. గుండెలో సూది చూసి షాకైన డాక్టర్లు..
Advertisement

Needle found in heart| మూత్రంలో రక్తం కనిపించడంతో ఓ 35 ఏళ్ల వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు. అతడికి గుండె సంబంధిత సమస్య ఉందని ఎలాంటి అనుమానం లేదు.
కానీ వైద్యులు చేసిన స్కానింగ్‌లో ఊహించని ప్రమాదకర విషయం బయటపడింది. అతడి గుండెలో ఏకంగా 36 మిల్లీమీటర్ల కుట్టు సూది ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, అతడి శరీరంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా సూదులు, లోహపు వస్తువులు కనిపించాయి.

మూత్ర సమస్యతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి

చైనాకు చెందిన ఈ వ్యక్తి మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. అతడిని హునాన్ ప్రావిన్షియల్ పీపుల్స్ హాస్పిటల్‌లో వైద్యులు పరీక్షించారు. మొదట వైద్యులు అతడి మూత్ర సంబంధిత సమస్యపై దృష్టి పెట్టారు. అయితే వైద్య పరీక్షల్లో గుండె సమీపంలో వారికి అనుమానాస్పదంగా ఒక వస్తువు నీడ కనిపించింది. దీంతో వైద్యులు ఛాతీ, పొత్తికడుపు, బ్లాడర్ ప్రాంతాలకు CT స్కాన్ చేశారు.

శరీరంలో పలుచోట్ల లోహపు వస్తువులు

Advertisement

CT స్కాన్‌లో అతడి శరీరంలోని పలు ప్రాంతాల్లో లోహపు వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో కొన్ని పొత్తికడుపు గోడ, బ్లాడర్ ప్రాంతం, మూత్రాశయం వద్ద కనిపించాయి. మరికొన్ని వస్తువులు తుంటి ఎముక, కండరాలు, పురుషాంగం ప్రాంతాల్లో కూడా కనిపించాయి. అయితే వైద్యులను ఎక్కువగా ఆందోళనకు గురిచేసింది అతడి గుండెలో కనిపించిన సూది.

గుండెలోకి 36 మిల్లీమీటర్ల సూది ఎలా వెళ్లింది?

36 మిల్లీమీటర్ల పొడవైన కుట్టు సూది గుండె చుట్టూ ఉండే పెరికార్డియంను దాటి వెళ్లింది. సూది చివరి భాగం గుండెలోని ఎడమ వెంట్రికల్ వరకు వెళ్లినట్లు స్కాన్‌లో కనిపించింది. గుండె కొట్టుకునే సమయంలో సూది కూడా దానికి అనుగుణంగా కదులుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అయినప్పటికీ ఆ వ్యక్తి గుండె సాధారణంగానే పనిచేస్తోంది. అతడికి ఎలాంటి స్పష్టమైన గుండె సంబంధిత సమస్యలు లక్షణాలు కనిపించలేదు. అయితే సూది మరింత లోపలికి కదిలితే గుండెకు తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది. గుండె గోడ చిట్లడం, తీవ్రమైన రక్తస్రావం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడ్డారు. అందుకే వైద్యులు ముందుగా గుండెలోని సూదిని తొలగించాలని నిర్ణయించారు.

మూత్రాశయంలో కూడా సూదులు

Advertisement

సర్జరీ సమయంలో వైద్యులు మూత్రాశయంలో మరికొన్ని సూదులను గుర్తించారు. వాటిలో కొన్ని సూదుల చుట్టూ గట్టి రాళ్లలాంటి పదార్థం ఏర్పడింది. అవి శరీరంలో చాలా కాలంగా ఉండడం వల్లే వాటి చుట్టూ రాళ్ల లాంటి పదార్థం ఏర్పడిందని డాక్టర్లు తెలిపారు. తదుపరి సమస్యలు రాకుండా వైద్యులు వాటిని కూడా తొలగించారు. దీంతో రక్తస్రావం, మూత్రం లీక్ అవడం వంటి సమస్యల ప్రమాదం తగ్గింది.

సూదులు శరీరంలోకి ఎలా వెళ్లాయి?

ఈ సూదులు అతడి శరీరంలోకి ఎలా వెళ్లాయో వైద్యులు కచ్చితంగా గుర్తించలేకపోయారు. ఆ వ్యక్తి లేదా అతడి కుటుంబ సభ్యులు కూడా స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోయారు. అయితే రెండేళ్ల క్రితం అతడి పొత్తికడుపు నుంచి ఇలాంటి రెండు వస్తువులను తొలగించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ పాత చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుత వైద్యులకు అందుబాటులో లేవు. అందువల్ల సూదులు ప్రమాదవశాత్తు వెళ్లాయా, ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఇదంతా చేశారా? అనేది స్పష్టంగా తెలియలేదు.

Also Read: ఉదయం లేచినప్పటి నుంచి సిగరెట్ తాగే వ్యసనం.. ఈ చిట్కాతో కొన్ని నిమిషాల్లోనే మానేశాడు

గుండెలో సూది ఉండటం చాలా అరుదు

వైద్యులు ఈ ఘటనలో సెల్ఫ్ ఎంబెడింగ్ ప్రవర్తనను కూడా ఒక అవకాశంగా పరిగణించారు. అయితే ఈ కేసు నివేదిక దీన్ని కచ్చితంగా నిర్ధారించలేదు. గుండెలో సూదులు కనిపించే ఘటనలు చాలా అరుదుగా నమోదవుతాయి. 2024లో ప్రచురితమైన సమీక్షలో 1967 నుంచి ఇలాంటి 34 కేసులు మాత్రమే నమోదైనట్లు తెలిపింది.
చికిత్స అనంతరం ఆ వ్యక్తి కోలుకున్నాడు. ఈ అరుదైన కేసు ఇటీవలే బిఎంసి కార్డియో వ్యాస్కులర్ డిజార్డ్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.

Also Read: కడుపు నిండా తిన్నా శరీరంలో శక్తి లేదా? మీరు చేసే తప్పులివే

Tags

Related News

చలికాలంలో దాహం తక్కువగా ఉంటుంది.. శరీరంలో నీరు తగ్గితే వచ్చే సమస్యలివే

క్యాప్సికమ్‌లో మటన్ ఖీమా స్టఫింగ్.. ఈ వెరైటీ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా?

ఈవెనింగ్ స్నాక్ కోసం ఈ చికెన్ పెరి పెరి పాపర్స్ ట్రై చేయండి.. ఇంటిల్లిపాదీ శభాష్ అంటారు!

స్వీట్ షాప్ టేస్ట్ గ్యారెంటీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోదగ్గ నెల్లూరు మలైకాజా రెసిపీ!

మీ పర్సు రంగు ఇదేనా? వాస్తు ప్రకారం డబ్బు నిలవాలంటే ఈ రంగులే బెస్ట్!

డేటింగ్ యాప్స్‌లో చాట్‌ఫిషింగ్ కలకలం.. రొమాంటిక్ మెసేజ్‌లతో మాయాజాలం

పాలు,పంచదార ఉంటే చాలు..ఇంట్లోనే దూది లాంటి రసగుల్లా రెడీ!

ఎప్పుడూ చేసుకునే దొండకాయ ఫ్రై బోర్ కొట్టిందా?ఈసారి ఇలా ట్రై చేయండి

Big Stories

Advertisement
×