Podarillu Today Episode September 15th : తాయారు చాలా ఆవేశంగా వెళ్ళిపోతున్నాడని చూసిన గాయత్రీ ఎక్కడకమ్మ అంత ఆవేశంగా వెళ్తున్నావు అని అడుగుతుంది.. ఇక తాయారు జరిగిన విషయం అంత గాయత్రితో చెప్పడంతో నారాయణ మామే ఏదో చేశాడు అందుకే ఇలా నువ్వు వెళ్తున్నావు అదేం జరుగుండదమ్మా నువ్వు గమ్మునుండు అని ఆపేస్తుంది అందరూ కూడా గాయత్రి మీద చాలా కోపంగా ఉంటారు.ఎందుకు మా అమ్మని రెచ్చగొట్టి ఇప్పుడు గొడవకి పంపించారు ఎలా జరిగితే ఈ పెళ్లి ఆగిపోతుంది తెలుసా నీకు గాయత్రి అంటుంది. పెళ్లి ఆగిపోవాలని ఇదంతా చేసాము. దీని గురించి నువ్వేమీ బాధపడవద్దు అని గాయత్రి తో మహాలక్ష్మి అనగానే తను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక కేశవ కన్న ఇద్దరు కూడా పంతులుతో ఈ విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటారు. అంతేకాదు పంతులతో మాట్లాడి సెట్ చేసుకుంటారు..
కేశవ కన్నా ఇద్దరు కూడా ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి అని ప్లాన్ చేస్తారు. అయితే ఏం నారాయణ ప్లాన్ కూడా ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ బయటికి వెళ్తారు. రూపాయి తక్కువ అయినా పెళ్లిని చెయ్యను అని అన్నా పంతులను విన్న వాళ్ళిద్దరు కూడా పంతులతో మాట్లాడితే సెట్ చేసుకోవాలని అనుకుంటారు. ఎలాగైనా సరే ఈయన అనే లైన్ లో పెట్టుకొని మనం ఖచ్చితంగా ఈ పెళ్లిని క్యాన్సల్ చేయించాలి అని అనుకుంటారు. కానీ మొదట పంతులు చెడగొట్టడానికి నాకు చాలా డబ్బులు కావాలని కమిట్ అవ్వగానే ఇద్దరు కూడా సరే అండి మీకోసం మేము ఎంతైనా ఇస్తాము అని అంటారు. అయితే పంతులు ముందుగా సరే అని అంటాడు కాకపోతే ఆ తర్వాత అతను చేస్తారా లేదా అన్న అనుమానంతో ఉంటారు. అతనికి ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందని అందరూ అనుకుంటారు.
నారాయణ ఇంక ఏం చేసినా లాభం లేదు పంతులు తో సెట్ చేసాము అయినా కూడా అది వర్క్ అవుట్ అవుతుందని చెప్పలేము అని అందరూ బాధపడిపోతూ ఉంటారు.. అయితే నారాయణ వీళ్ళందరూ కాదు నేను తాగినట్టు నటించి ఈ పెళ్లిని క్యాన్సిల్ చెయ్యాలి అని అనుకుంటారు.. ఇక నారాయణ నటించిన కాదు నిజం చేస్తే బాగుంటుంది కదా.. కాస్త మందు తాగి జయంతి వాళ్ళ తమ్ముడితో ఆడుకోవాలని అనుకుంటాడు.. అయితే ఇక అతను వీళ్ళకి ఎలాగైనా సరే మర్యాదలు చేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. మొత్తానికి నారాయణ ప్లాను సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఆ జయంతి తమ్ముడు మాత్రం తెలివిగా నారాయణను బుట్టలు వేసుకుంటాడు.. దాంతో ఈ ప్లాను దారుణంగా ఫెయిల్ అయితుంది అని నారాయణ అనుకుంటాడు.. ఈ ప్లాను అట్టర్ ఫ్లాప్ అయింది ఇక వేరేది ఏమైనా ఉందేమో చూడాలి అని ఆలోచిస్తూ ఉంటారు..
ఇక ఈ పెళ్లి సంబంధం ఎట్టి చూసినా క్యాన్సిల్ అయ్యేలాగా లేదు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.. అయితే ఎంగేజ్మెంట్ జరుగుతున్న సమయంలో పంతులు అందరిని పిలిచి జాతకాలు చూడాలి అని అనుకుంటారు. ఇక అందరూ అక్కడ సమావేశం అవగానే పంతులుగారు ఆ జాతకాలని చూసి మరోసారి మీ ఎంగేజ్మెంట్ కి ముహూర్తం పెడతాను అని అంటారు.. ఎలాగైనా సరే ఈ పెళ్లికి జాతకాలు కలవు అని పంతులు చెప్తారని అందరు అనుకుంటారు. కానీ పంతులు మాత్రం వీళ్ళందరికీ షాక్ ఇస్తూ జాతకాలు దివ్యంగా ఉన్నాయి ఈ పెళ్లి నిరంతంగా చేసుకోవచ్చు అని అంటాడు. ఆ మాట వినగానే కన్నా,కేశవ ఇద్దరు కూడా చాలా కోపంగా ఉంటారు. మొత్తానికి పంతులు ప్లాన్ చెడగొట్టేలా చేయడంతో కన్నా కేశవ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. నువ్వు ఇలా చేస్తావని మేము అస్సలు ఊహించలేదు ఎందుకు ఇలా చేశావు అని అంటే ఇది నా వృత్తి దానికి నేను ద్రోహం చేయలేను అని చెప్పగానే వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు..
ఇక మాధవ్ అందరినీ పిలిచి ఎందుకు మీరు నా పెళ్లి సంబంధం చెడగొట్టడానికి ప్లాన్ వేస్తున్నారు నాకు తెలియదని మీరు అనుకుంటున్నారా? ఎందుకు ఇలా చేస్తున్నారు అని అందరిపై సీరియస్గా అరుస్తాడు.. ఎందుకు నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మీరందరూ చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అసలు మీ అందరికీ ఏమైంది అని మాధవ్ సీరియస్గా అడుగుతారు. అయితే నా పెళ్లి చెడగొట్టడానికి అందని రెచ్చగొట్టింది మాత్రం చక్రి కదా అని అంటారు. నా పెళ్లి నా ఇష్టం నా ఇష్టప్రకారమే నేను చేసుకుంటాను మీరు ఎవరు ఇందులో జోక్యం చేసుకోవద్దు. ఈ పెళ్లి కనుక ఆగిపోయింది అంటే దానికి కారణం మీరే జీవితంలో మిమ్మల్ని క్షమించను అని మాధవ్ అందరికీ వార్నింగ్ ఇస్తాడు. కానీ అందరూ మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…