E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి రచ్చ చేసిన బాలు.. మీనా సీరియస్.. బాలుకు దిమ్మతిరిగే షాక్..

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి రచ్చ చేసిన బాలు.. మీనా సీరియస్.. బాలుకు దిమ్మతిరిగే షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode September 15th: బాలు నా కష్టమని నాకు కాకుండా చేశారు.. నేను తాగలేదని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా నన్ను అవమానించారు అని తెగ బాధ పడిపోతూ ఉంటాడు. అయితే బాలు ఊదమనే ఎంత అడుగుతున్నా సరే నేను అసలు ఊదును అని అంటాడు. అయితే నేను కేసు రాస్తాను అని అరుణ్ బాలుతో గొడవ పడతాడు.. ఆ తర్వాత బాలు వేరే కానిస్టేబుల్ వచ్చి ఒక్కసారి ఊదుమని అడుగుతాడు రిక్వెస్ట్ చేసి అడిగారు కాబట్టి నేను ఊదుతాను అని అంటాడు.. తాగలేదని చూపిస్తుంది సార్ అని అనగానే బాలు నేను తాగకపోయినా నన్ను అవమానించాలని కస్టమర్లను వెళ్ళగొట్టారు.. నాకు నష్టం జరిగిన చేశారు ఆ డబ్బులు మీరే ఇస్తారని గొడవకు దిగుతాడు. కానీ బాలు మాత్రం ఎలాగైనా ఒకసారి తాగి అరుణ్ కి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు.

బాలు దెబ్బ అదుర్స్..

అరుణ్ నన్ను అవమనించాడు అని బార్ కెళ్ళి మందు తాగుతాడు.. రాజేష్ అక్కడికి వచ్చి నువ్వు మందు మానేసావ్ కదరా మల్లి ఇదేంటి కొత్తగా అని అడుగుతాడు.. అరుణ్ కి ఎలాగైనా సరే దిమ్మ తిరిగిపోయిన షాక్ ఇవ్వాలి అని బాలు అనుకుంటాడు.. ఇక అరుణ్ ఎక్కడుంటే అక్కడికి పోనివ్వరా అని  రాజేష్ అంటాడు. ఇక బాలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. మొత్తానికి బాలుని రాజేష్ అరున్ దగ్గరకు తీసుకొని వెళ్తాడు. అక్కడ అతని చూసి కూడా పెట్టుకోవడానికి వచ్చావా అని అంటాడు. అరుణ్ దగ్గరికి వెళ్ళిన బాలు మళ్లీ గొడవ పెట్టుకుంటాడు. అక్కడ జరిగిందంతా రాజేష్ ఏదో ఒకటి చేసి విని తీసుకెళ్లాలని ఎంతగా ప్రయత్నించిన సరే బాలు మాత్రం అరుణ్ తో గొడవ పడుతూనే ఉంటాడు. అది చూసిన అరుణ్ కోపంగా ఉంటాడు. అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎంతగా చెబుతున్నా సరే అస్సలు వినకుండా బాలు రెచ్చిపోతాడు. ఇక రాజేష్ అరుణ్ వార్నింగ్ ఇవ్వడంతో బాలు ఎక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు.

మీనా మాటతో దిమ్మతిరిగే షాక్..

Advertisement

రాత్రి లేట్ అయినా సరే ఇంకా బాలు రాలేదని మీనా వెయిట్ చేస్తూ ఉంటుంది.. ఇంత టైం అయినా ఈయన ఎక్కడికి వెళ్లారు ఏమైనా ట్రిప్పులు పడ్డాయా అని మేన ఆలోచిస్తూ పువ్వులు కడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం ఇంకా రాలేదా అమ్మా అని అడుగుతాడు. ఆ మాట వినగానే మీనా లేదు మావయ్య ఇంకా రాలేదు అని చెప్తుంది.. అప్పుడే బాలు తాగేసి సడన్గా ఇంటికి రావడంతో మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్విలా తాగేసి వస్తావని అస్సలు ఊహించలేదు.. ఎందుకు తాగారు ఎవరికోసం తాగారు అంటూ మీనా క్లాస్ మీద క్లాస్ పీకుతుంది.. బాలు నిజం చెప్పిన కూడా మీనా మాత్రం అస్సలు వినదు.. కానీ బాలు మాత్రం ఎంత చెప్తున్నా సరే మీనా మాత్రం అసలు వినకపోవడంతో సీరియస్ అవుతాడు..

బాలుకు మీనా క్లాస్..

బాలు ట్రాఫిక్ కానిస్టేబుల్ వల్ల తాగాను ఎంత చెప్తున్నా సరే.. అసలు వినకుండా మీనా మాత్రం నేను తాగుబోతు దగ్గర అసలు డబ్బులు తీసుకొని అని అంటుంది.. తాగుబోతుల దగ్గర తీసుకోకపోవడానికి నేనేమి రోజు తాగలేదు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ వల్ల నాకు గొడవ అయింది వాడి వల్ల నేను తాగాను. నేను తాగాక పోయిన తాగాను అని నన్ను ఇబ్బంది పెట్టాడు అందుకే తాగేసి వాడికి వార్నింగ్ ఇవ్వాలని తాగాను అని బాలు అంటాడు. పోయి పోయి పోలీసులతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు వాడు ఏదో ఒక డ్యూటీ వాడు చేసుకుంటున్నాడు కదా మళ్ళీ మీరెందుకు ఇలా చేస్తున్నారు అని మీన ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం అస్సలు వినడు.. కట్టుకున్న భర్తని కాకుండా వాడెవడో నువ్వు పోగొడుతున్నావేంటి అని బాలు సీరియస్ అవుతాడు. పోలీసులంటే అంత తక్కువ కాదు రాత్రి పగలు అని తేడా లేకుండా మన ప్రాణాలను కాపాడేందుకు వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ల దగ్గర ఇలా చేయడం మంచిది కాదు అని మీనా చెప్తే బాలు ఆ ముందరే వాడిని పొగుడుతావా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

సుమతికి సాయం చేసిన అరుణ్..

Advertisement

సుమతి అరుణ్ణి అర్జెంటుగా హాస్పిటల్ కి రమ్మని ఫోన్ చేసి పిలుస్తుంది. ఏంటి అంత అర్జెంటుగా రమ్మని పిలిచావు ఏమైంది మనం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం కదా ఏ విషయమైనా నాతో చెప్పాలి అని అరుణ్ అడుగుతాడు.. మా అక్కకి వచ్చిన ఆర్డరు ఇది అయితే పోటీకి డిపాజిట్ ముందే కట్టాలట.. కానీ తన దగ్గర డబ్బులు లేవు అని ఎంత చెప్తున్నా సరే సుమతికి నేను డబ్బులు ఇస్తాను అని అరుణ్ అంటాడు. అయితే సుమతి మా అక్క అలా తీసుకోదు.. అని చెప్తే ఎవరికో వడ్డీ ఇవ్వడం బదులు నాకు మీరు ఇవ్వచ్చు కదా అని అరుణ్ వెంటనే సుమతికి డబ్బులు తెచ్చి ఇస్తాడు. బావ లాగే అరుణ్ కూడా చాలా మంచి మనసున్న వ్యక్తి. నేను పెళ్లి చేసుకుంటే జీవితాంతం చాలా సంతోషంగా ఉంటాను అని సుమతి చాలా సంతోషంగా ఉంటుంది..

మీనా దెబ్బకు బాలు సీరియస్..

మీనా ఉదయం లేవగానే బాలుకి కాఫీ తెచ్చేస్తుంది కానీ బాలు మాత్రం నాకేం వద్దు అని అంటాడు. ఇద్దరు సరదాగా గొడవ పడుతున్న సమయంలోనే రవి శృతి కిందకి వస్తారు ఏమైంది.. ఎందుకు మీరిద్దరు గొడవ పడుతున్నారు అని అడుగుతారు అయితే బాలు తాగి వచ్చిన విషయం రవి శృతి లకు మీనా చెప్తుంది.. మందు మానేసావ్ కదా అన్నయ్య మళ్లీ నువ్వు ఎందుకు తాగాలని అనుకుంటున్నావు అని అడుగుతాడు రవి.. ట్రాఫిక్ కానిస్టేబుల్ వల్లే నేను తాగాను రా వేరే ఉద్దేశంతో కాదు అని బాలు ఎంత చెప్తున్నా సరే రవి మాత్రం అసలు వినకుండామీనకన్నా ఎక్కువగానే క్లాసు పీకుతాడు. ఇక మొత్తానికి మీనా బాలు ఇద్దరు గొడవ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. వీళ్లిద్దరు గొడవ పడుతున్న సమయంలో మీనా కి సుమతి ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు హాస్పిటల్కి రా అక్క అని అంటుంది. అనేసి అడుగుతుంది.. తన ఫ్రెండ్ డబ్బులు ఇచ్చాడు అని చెప్పగానే మీనా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు ప్లాన్..? నారాయణ పెర్ఫార్మన్స్ అదుర్స్.. మాధవ్ నిజం తెలుస్తుందా..?

Related News

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Podarillu Today Episode : పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు ప్లాన్..? నారాయణ పెర్ఫార్మన్స్ అదుర్స్.. మాధవ్ నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టించే సీన్.. అయ్యో పాపం పార్వతి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

Big Stories

Advertisement
×