Karthika Deepam 2 serial today Episode: ఆఫీసులో మాలిని డ్రామా మొత్తం అర్థం చేసుకున్న శివనారాయణ బాధపడుతుంటాడు. నమ్మని వాళ్లే కాదు నమ్మిన వాళ్లు.. చుట్టాలు, స్నేహితులు సొంతవాళ్లు, పరాయివాళ్లు అంటూ తేడా లేకుండా అందరూ మోసం చేశారు అంటూ శివనారాయణ ఎమోషనల్ అవతూ కూలబడిపోతాడు. ఇప్పుడు నన్ను నమ్ముకున్న ఉద్యోగులు పరిస్తితి ఏంటి అంటూ ఏడుస్తుంటాడు.
అప్పుడే ఉద్యోగులు వచ్చి శివనారాయణనే తిడతారు. మమ్మల్ని ఇంత మోసం చేస్తారా..? మీరు ఆ దక్షిణమూర్తి వియ్యంకులు అని చెప్పకుండా మీ షేర్లు అన్ని వాళ్లకు ఇచ్చేసి మా ముఖాన రెండు నెలల జీతం పడేసి వెళ్లిపోతారా..? అంటూ నిలదీస్తారు. ఉద్యోగులు ఆవేశంతో శివనారాయణ కాలర్ పట్టుకుంటారు. అంతా గమనిస్తున్న మాలిని ఇంకా అయిపోలేదు బాబాయ్ మీకు ఇంటి దగ్గర ఇంకో యాక్షన్ సీన్ రెడీగా ఉంది వెళ్లండి వెళ్లి అది కూడా చూసేయండి.. ఇన్ని రోజులుగా సైలెంట్ గ ఉన్నది మిమ్మల్ని ఎలా దెబ్బకొట్టాలో ఆలోచించాను.. మిమ్మల్ని రోడ్డు మీదకు లాగడానికి స్కెచ్ వేశాను. అది ఇప్పుడు వర్కవుట్ అవుతుంది అంటూ చెప్పి వెళ్లిపోతుంది.
హాస్పిటల్‌లో దీప దగ్గర ఉన్న జ్యోత్స్న కోపంగా సూరజ్‌ను తిడుతుంది. కార్తీక్ కు ఫోన్ చేయడానికి ధైర్యం చాలడం లేదా..? అంటూ ప్రశ్నిస్తుంది. అందుకు సూరజ్ కార్తీక్ గారికి ఇన్ఫర్మేషన్ చేరిపోయింది. అందుకు నేనే ఫోన్ చేయాలని రూల్ ఏం లేదు కదా అంటాడు. ప్రతీ దానికి ఇదే ఫార్ములా వాడుతావా.. నా విషయంలో కూడా అదే చేశావ్ కదా అంటూ తిడుతుంటే.. నేను వచ్చిందే పగ తీర్చుకోవడానికి అంతే కానీ ఎదురుగా ఎవరున్నారు అన్న విషయం నాకు అనవసరం అంటూ చెప్తుంటే.. అంతలా పగ తీర్చుకున్న నువ్వు బావ, దీపలను ఎందుకు ఇరికించావు. అందరి ముందు వాళ్లకు థాంక్స్ చెప్పి దోషులుగా నిలబెట్టిన నువ్వే ఇప్పుడు దీపకు సాయం చేయడం ఏంటో..? అని అడిగితే.. దీప ఎప్పటికీ నా వదినే అంటూ సూరజ్ వెళ్లిపోతాడు.
ఇంటికి వెళ్లిన శివనారాయణకు బ్యాంక్ అధికారులు షాక్ ఇస్తారు. మాలిని తీసుకున్న 20 కోట్ల అప్పుకు మీరు ష్యూరిటీగా ఉన్నారు. ఇప్పుడు ఆవిడ అప్పు కట్టడం లేదు.. అందుకే మీ దగ్గరకు వచ్చాం మీ దగ్గర కూడా ఈ ఇల్లు తప్పితే ఏం లేదంట కదా..? అంతా వాళ్లే లాగేసుకున్నారట కదా..? అందుకే ఆ 20 కోట్లు మీరే కట్టాలి అని అడుగుతారు. మీరు ఆ 20 కోట్లు కట్టకపోతే మీ ఇల్లు స్వాధీనం చేసుకుంటామని చెప్తారు. ఆ మాటలకు శివనారాయణ, దశరథ షాక్ అవుతారు. మాలిని చేసిన మోసం గుర్తు చేసుకుని శివనారాయణ బాధపడుతుంటాడు. ఇంట్లో అందరిని బయటకు వెళ్లిపోదాం పదండి అంటూ తీసుకుని వెళ్తుంటే.. బ్యాంకు అధికారులు ఆపేసి 20 కోట్లకు ఈ ఇల్లు సరిపోదని మీ ఒంటిపై ఉన్న బంగారం ఇవ్వండని అడుగుతారు. అందరూ కట్టుబట్టలు తప్పా అంతా అధికారులకు ఇచ్చేస్తారు. అప్పటికీ కూడా ఇంకా ఇరవై కోట్లు కాలేదని అధికారులు చెబితే.. శివనారాయణ మనల్ని వాళ్లు నిండా ముంచేశారు ఇక పదండి అంటూ బయటకు వెళ్తాడు.
హాస్పిటల్‌కు వెళ్లిన కార్తీక్ అక్కడ జ్యోత్స్నను చూసి షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావని అడుగుతాడు. దీపను హాస్పిటల్ కు తీసుకొచ్చిందే తానేనని దీప పరిస్థితి సీరియస్ గా ఉందని కడుపులో బేబీ బతికే చాన్స్ లేదని దీప కూడా బతుకుతుందో లేదోనని డాక్టర్లు చెప్తున్నారు అంటూ జ్యోత్స్న చెప్పగానే.. కార్తీక్ కూలబడిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.