E-Paper
Advertisement

Silver: బంగారం మాదిరిగా.. ఇకపై వెండిపై కూడా, రేపో మాపో ప్రకటన

Silver: బంగారం మాదిరిగా.. ఇకపై వెండిపై కూడా, రేపో మాపో ప్రకటన
Advertisement

Silver: మార్కెట్లో వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.  ప్రస్తుతం వెండి కిలో దాదాపు రూ. 2.50 లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అటువైపు ఫోకస్ చేసింది. వెండి ఆభరణాల్లో స్వచ్ఛతపై కొనుగోలుదార్లకు భరోసా కల్పించేందుకు హాల్‌ మార్కింగ్‌ తప్పనిసరి చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి రేపో మాపో ప్రకటన రావచ్చు.

వెండిపై కూడా హాల్‌ మార్కింగ్‌ తప్పనిసరి?

Advertisement

సిల్వర్.. మూడేళ్ల కిందట కిలో 65 వేలు ఉండేది. ప్రస్తుతం అది దాదాపు రెండున్నర లక్షల పైమాటే. చాలావరకు వినియోగదారులు బంగారం వైపు వెళ్లకుండా సిల్వర్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సిల్వర్ వినియోగం క్రమంగా పెరగడం మొదలైంది. దీనికితోడు పరిశ్రమలు విస్తారంగా సిల్వర్‌ని ఉపయోగస్తున్నారు.

మార్కెట్‌కు తగిన విధంగా సిల్వర్ ఉత్పత్తిగా కాకపోవడంతో వాటి ధర అమాంతంగా పెరగడం మొదలైంది. పరిస్థితి గమనించి కేంద్రం, వెండి ఆభరణాల స్వచ్ఛతపై హాల్‌ మార్కింగ్‌ తప్పనిసరి చేయాలని భావిస్తోంది. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌-బీఐఎస్ 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా  డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌ గార్గ్‌ కొన్ని విషయాలు బయటపెట్టారు.

Advertisement

నకిలీ వస్తువులను అరికట్టేందుకు ఈ ప్లాన్

వస్తువుల్లో వెండి శాతాన్ని ధ్రువీకరించడానికి హాల్‌మార్క్‌ పద్దతి ప్రవేశపెడతామని సూచన ప్రాయంగా చెప్పుకొచ్చారు. అయితే స్వచ్ఛత నిర్థారణ కోసం హాల్‌మార్కింగ్‌ కేంద్రాలు ఏర్పాటు అయ్యాక అమలు చేస్తామని వెల్లడించారు. అభివృద్ధి చెందిన-చెందుతున్న దేశాల మధ్య నాణ్యత అనేది అత్యంత కీలకమైనది ఆయన వర్ణించారు.

హాల్‌ మార్కింగ్‌ అంటే ఏమిటి? బంగారం, వెండి విలువైన వాటి స్వచ్ఛతను ధ్రువీకరణను హాల్‌మార్కింగ్‌గా పిలుస్తారు. బీఐఎస్‌ లోగో, ఆభరణాల విక్రయదారుల గుర్తు, ప్రతీ సిల్వర్ వస్తువుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. బీఐఎస్‌ గుర్తింపు పొందిన కేంద్రాల్లో మాత్రమే వాటిని ముద్రిస్తారు.

సింపుల్ గా చెప్పాలంటే క్వాలిటీ తక్కువగా ఉన్నవాటిని అరికట్టేందుకు ఈ ప్రక్రియ సహాయపడుతుందని చెప్పవచ్చు. గతేడాది సెప్టెంబరు ఒకటి నుంచి వెండి ఆభరణాలకు హెచ్‌యూఐడీ ఆధారిత వ్యవస్థ కింద హాల్‌మార్కింగ్‌ చేసేందుకు అనుమ తించారు. హాల్‌మార్కింగ్‌ పొందిన వెండి ఆభరణాల ద్వారా తక్కువ క్వాలిటీ కలిగిన వాటిని దూరం పెట్టొచ్చు.

ALSO READ: గోల్డ్ కొనుగోలు బెటరా? సిల్వర్ లేదంటే కాపర్ మంచిందా?

హాల్‌మార్కింగ్‌ తప్పనిసరైతే వెండిని సులభంగా గుర్తించవచ్చు. ప్రపంచంలో వెండిని ఎక్కువ ప్రాసెసింగ్‌ చేస్తున్న దేశంలో చైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ప్రతీ ఏటా 5.6 బిలియన్‌ డాలర్ల అంటే దాదాపు రూ.50,400 కోట్ల విలువైన వెండి ఖనిజాన్ని దిగుమతి చేసుకుంటోంది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా వెండి దిగుమతులు సుమారు రూ.56,700 కోట్లు. చైనా వెండి ముడిపదార్థాన్ని శుద్ది చేసి ఎగుమతి చేస్తోంది. వాటినే ఇప్పుడు మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. 2024లో భారత్ సుమారు రూ.57,600 కోట్ల విలువ చేసే శుద్ధి చేసిన వెండిని దిగుమతి చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ప్రపంచంలో శుద్ధి చేసిన వెండిని అత్యధికంగా దిగుమతి చేసుకున్న దేశాల్లో భారత్ తొలి ప్లేస్. అంతర్జాతీయ మార్కెట్‌లో జనవరి 7న ఔన్సుకు వెండి ధర 80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×