E-Paper
Advertisement

January 2026 Financial Changes: పాన్-ఆధార్ లింక్ నుంచి క్రెడిట్ స్కోర్ వరకు.. జనవరి 1 నుంచి వచ్చే మార్పులివే

January 2026 Financial Changes: పాన్-ఆధార్ లింక్ నుంచి క్రెడిట్ స్కోర్ వరకు.. జనవరి 1 నుంచి వచ్చే మార్పులివే
Advertisement

January 2026 Financial Changes: జనవరి 1, 2026 ప్రారంభం నుంచి కొత్త ఆర్థిక సంస్కరణలు స్టార్ట్ కానున్నాయి. వేతన జీవుల నుంచి రైతులు, ఉద్యోగులు, సాధారణ ప్రజానీకంపై వీటి ప్రభావం ఉంటుంది. కొత్త ఏడాదిలో.. బ్యాంకింగ్ నిబంధనలు, ఇంధన ధరలు, వివిధ ప్రభుత్వ పథకాల్లో మార్పులు రానున్నాయి.

పాన్-ఆధార్ లింక్

డిసెంబర్ 31,2025లోపు పాన్, ఆధార్‌ను లింక్ చేసుకోకపోతే బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. పాన్ కార్డు బ్లాక్‌లను నివారించడానికి ఆధార్ కార్డుతో లింక్ తప్పనిసరి. ట్యాక్స్ ఫైలింగ్, వాపస్ పొందడం, బ్యాంకింగ్ సేవలను యాక్సెస్ చేయడానికి పాన్ కార్డు కీలకం. పాన్ కార్డు సేవలు యథావిధిగా కొనసాగేందుకు వీలైనంత త్వరగా ఆధార్ కార్డుతో లింక్ చేయించుకోవాలి. ప్రస్తుతం రూ.1000 చలాన్ చెల్లించి లింక్ చేసుకోవచ్చు. జనవరి 1 నుంచి ఈ ఫైన్ భారీగా పెరిగి అవకాశం ఉంది.

8వ వేతన సంఘం అమలు

Advertisement

డిసెంబర్ 31, 2025తో 7వ వేతన సంఘం పదవీకాలం ముగుస్తుంది. జనవరి 1, 2026 నుంచి 8వ వేతన సంఘం ప్రారంభం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు.. వారి జీతాలు, పెన్షన్లలో మార్పులను చూస్తారు. అయితే వాస్తవంగా పెంపు అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది.

క్రెడిట్ స్కోర్ అప్‌డేట్‌లు

ప్రస్తుతం 15 రోజులకొకసారి క్రెడిట్ బ్యూరోలు కస్టమర్ డేటాను రిఫ్రెష్ చేస్తారు. ఇప్పుడు ప్రతి వారం క్రెడిట్ స్కోర్ అప్డేట్ చేయాలి. లోన్ చెల్లింపులు లేదా డిఫాల్ట్‌లు.. మీ క్రెడిట్ స్కోర్‌పై చాలా వేగంగా ప్రభావం చూపుతాయి. లోన్లపై నేరుగా ఎఫెక్ట్ చూపుతాయి.

ఎల్పీజీ, ఇంధన ధరలు

Advertisement

గృహ, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు జనవరి 1న సవరించనున్నారు. దీంతో హోం బడ్జెట్లు, విమాన ఛార్జీలపై ఎఫెక్ట్ పడనుంది.

పీఎం-కిసాన్ కార్డులు

పీఎం కిసాన్ పథకంలో రైతులకు కొత్త ఐడీలను ప్రవేశపెట్టనుంది. జనవరి 1, 2026 నుండి కొత్త దరఖాస్తుదారులకు ఇది తప్పనిసరి. ఈ డిజిటల్ ఐడీ ద్వారా రైతుల భూమి రికార్డులు, పంట సమాచారం, ఆధార్, బ్యాంక్ వివరాలు ఉంటాయి. పీఎం కిసాన్ ను పారదర్శకంగా అమలు చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేవాళ్లు ఈ ఐడీ పొందాల్సి ఉంటుంది.

కొత్త ఐటీఆర్ ఫారమ్‌లు

జనవరి 2026 నుండి మరో నూతన ఐటీఆర్ ఫారమ్‌ను అమల్లోకి రానుంది. ఇందులో బ్యాంకింగ్, ఖర్చు వివరాలతో ముందే నమోదు చేసుకోవచ్చు. దీంతో ఐటీఆర్ ఫైలింగ్ లోపాలను తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

డిజిటల్ చెల్లింపులు

UPI లావాదేవీల్లో మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు తనిఖీలు, వాట్సప్, టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లకు సిమ్ ధృవీకరణ నిబంధనలను అమలు చేయనున్నాయి.

కొత్త రుణాల నిబంధనలు

జనవరి 1, 2026 నుండి ఆర్బీఐ కో-లెండింగ్ ఫ్రేమ్‌వర్క్ అమల్లోకి రానుంది. దీంతో ప్రతి రుణదాత రిస్క్-షేరింగ్‌ను నిర్ధారించడానికి కనీసం 10% రుణాన్ని నిలుపుకోవాలి.

Related News

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

ఏఐ సునామీ.. ఐబీఎంకు ఊహించని షాక్! గంటల్లోనే రూ. 6.7 లక్షల కోట్లు మాయం!

నెలకు రూ.15,000 జీతం వచ్చే వారు కూడా లక్షాధికారి ఎలా అవ్వచ్చు? 50-30-20 రూల్ అంటే ఏంటి?

Big Stories

Advertisement
×