E-Paper
Advertisement

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

పల్నాడులో విషాదం..  బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!
Advertisement

Palnadu Accident: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం పరిధిలోని నరసరావుపేట చెక్‌పోస్టు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ట్రావెల్ బస్సు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

స్థానికుల వివరాల ప్రకారం.. నరసరావుపేట నుంచి రొంపిచర్ల వైపు ఇద్దరు వ్యక్తులు తమ బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో చెక్‌పోస్టు సమీపంలోకి రాగానే, రహదారిని దాటేందుకు యత్నించారు. అదే సమయంలో ఎదురుగా వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

Advertisement

బస్సు ఢీకొన్న తీవ్రతకు బైక్‌పై ఉన్న ఇద్దరు తీవ్ర గాయాలపాలై తీవ్ర రక్తస్రావంతో ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, వారి గుర్తింపు వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Also Read: శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు!

Tags

Related News

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

Big Stories

Advertisement
×