E-Paper
Advertisement

బోరిస్ జాన్సన్ ప్రయాణిస్తున్న రైలుపై రష్యా డ్రోన్ దాడి.. త్రుటిలో తప్పిన ప్రాణపాయం!

బోరిస్ జాన్సన్ ప్రయాణిస్తున్న రైలుపై రష్యా డ్రోన్ దాడి.. త్రుటిలో తప్పిన ప్రాణపాయం!
Advertisement

Boris Johnson: యహోడిన్-డోరోహస్క్ ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దు వద్ద రష్యా జరిపిన డ్రోన్ దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, జర్మన్ ఛాన్సలర్ సలహాదారు గుంటర్ సాటర్, స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్ట్‌తో పాటు పలువురు యూరోపియన్ భద్రతా నిపుణులు ప్రయాణిస్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరగడం కలకలం రేపింది. ప్రమాద సమయంలో రైలు సరిహద్దు క్రాసింగ్ వద్ద ఉండటంతో, రక్షణ సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను త్రుటిలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో దౌత్య ప్రముఖులు ప్రయాణిస్తున్న ఈ రైలును వెంటనే సరిహద్దులోని యహోడిన్ క్రాసింగ్ వద్ద నిలిపివేశారు.

దాడి కారణంగా క్రాసింగ్ సమీపంలో నిలిపి ఉంచిన పలు సరుకు రవాణా ట్రక్కులకు మంటలు అంటుకున్నాయి. ఆ రాపిడి పెరగడంతో పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్‌ భారీగా దెబ్బతిని పేలుడు సంభవించింది. ఈ భయానక ఘటనతో సరిహద్దులో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే, అగ్నిమాపక సిబ్బంది, సరిహద్దు రక్షణ దళాలు వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. జాన్సన్ సహా యూరోపియన్ నాయకుల బృందం ఈ దాడి నుంచి ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రష్యా ఉక్రెయిన్ మౌలిక వసతులపై జరుపుతున్న దాడులకు ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది.

Advertisement

Also Read: పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

Tags

Related News

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్‌కు అమెరికా బిగ్ షాక్? రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లపై 100% టారిఫ్!

9/11 దాడులకు 25 ఏళ్లు.. బిన్ లాడెన్ కొడుకు రీ ఎంట్రీ.. అల్ ఖైదా కొత్త వీడియో కలకలం!

బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు తీవ్ర భావోద్వేగం.. దేవుడి పాదాలు తాకి కన్నీటి పర్యంతం!

పుతిన్ ‘అంతర్గత’ భద్రత.. ఆయన టిష్యూల నుండి టవల్స్ వరకు, మలం కూడా మళ్లీ రష్యాకే

Big Stories

Advertisement
×