Varanasi Leak : దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చాయి.. రాజమౌళి సినిమా అంటే లీకులు బెడద ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్న సరే.. ఈ మూవీ నుంచి బయటికి ఏదో ఒకటి వస్తూనే ఉంది.. తాజాగా వారణాసి నుంచి మరో లీక్ బయటకు వచ్చింది. అది చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమా పై కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ మూవీ నుంచి లీకైన విజువల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం..
రాజమౌళి సినిమాలకు డిమాండ్ ఏ రేంజులో ఉంటుందో చెప్పనక్కర్లేదు.. రాజమౌళి ఏ హీరోతో చేస్తున్న కూడా ఆ సినిమాకి క్రేజ్ మాత్రం అంతే రేంజ్ లో ఉంటుంది. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి మూవీ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. ఈ మూవీ నుంచి ఎటువంటి లీకులు లేకుండా జక్కన్న జాగ్రత్తలు తీసుకున్నారు. అయిన కూడా సినిమా గురించి ఏదొక లీక్ బయటకు వస్తుంది.. తాజాగా ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తూ రెడీ అవుతున్న ఈ మూవీ సెట్ నుంచి లీకైన ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్ గా మారింది.. ఆ ఫోటోలో వారణాసి గుడి ముందు డైనోసార్లు కనిపిస్తున్నాయి.. ఆ పిక్స్ ను చూసిన ఫ్యాన్స్ రాజమౌళి క్రియేటివిటీవై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో వెళ్లడం మాత్రమే కాదు ఆస్కార్లో కూడా సత్తాని చాటుతుంది అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.. మొత్తానికి లీకైన ఫోటో మాత్రం సోషల్ మీడియాని ఓ రేంజ్ లో ఊపేస్తుంది.
మహేష్ బాబుతో రాజమౌళి మూవీ అన్నప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. ఈ మూవీ నుంచి బయటికి వచ్చినా మహేష్ బాబు లుక్ తో పాటుగా పోస్టర్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది.. తెలుగుతోపాటుగా మిగిలిన ఇండస్ట్రీలలో కూడా ఈ సినిమా పై చర్చలు జరుగుతున్నాయి. హాలీవుడ్ నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో రూ.1000 కోట్లకు పైగా భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ ‘వారణాసి’ చిత్రం భారతీయ సినిమా స్కేల్‌ను మార్చేయనుంది.. గతంలో ఎన్నడు కనిపించిన విధంగా మహేష్ బాబు ఈ సినిమాలో కనిపించడంతో ఆయన అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఈగరుగా వెయిట్ చేస్తున్నారు.. ఇప్పటికే మహేష్ బాబు లుక్ బాగా వైరల్ అవుతుండడంతో సినిమాపై అంచనాలు కూడా రోజురోజుకీ పెరుగుతూనే వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.. ఇప్పటివరకు బయటకొచ్చిన అప్డేట్స్ అన్ని కూడా మంచి రెస్పాన్స్ ఎందుకు ఉన్నాయి ఇక టీజర్ ని చూస్తే ఏ రేంజ్ లో అంచనాలు పెరుగుతాయో అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే దాదాపు 85 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది..