Gold Price Today: అంతర్జాతీయ పరిణామాల ప్రభావం బులియన్ మార్కెట్‌పై పడింది. ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తాజాగా గడిచిన నాలుగు రోజులు తగ్గిన పసిడి ధరలు ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా బంగారం ధర ఎగిసిపడింది. ప్రస్తుతం మార్కెట్లో ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.
అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, క్రూడ్ ఆయిల్ ధరలు, ఫెడ్ వడ్డీ రేట్లు, పశ్చిమాసియాలో యుద్ధం పరిస్థితుల ప్రభావం బులియన్ మార్కెట్ పడింది. ఫలితంగా బంగారం ధరల్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. వారంలో ఒక రోజు బంగారం-వెండి ధరలు పెరిగితే మూడు లేదా నాలుగు రోజులు తగ్గుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటడం, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించక పోవచ్చన్న అంచనాలు బంగారంపై పడింది. శుక్రవారం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సు 76 డాలర్లకు పైగా పడిపోయి 4338 డాలర్ల వద్దకు దిగింది. స్పాట్ సిల్వర్ రేటు 6 శాతానికి పైగా పడి 63 డాలర్ల స్థాయికి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ల ధరలు దేశీయంగా మార్కెట్‌పై పడింది. శ్రావణమాసం ముగియనుండడంతో పెళ్లిళ్లు కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక పండగల సీజన్ మొదలుకావడంతో బంగారం షాపులు కొనుగోళ్లదారులతో కిటకిటలాడుతుంటాయి. భారీగా బంగారం-వెండి ధరలు తగ్గుతాయని భావించిన కొనుగోళ్లదారులకు షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 11న హైదరాబాద్, విజయవాడలో బంగారం, వెండి రేట్లు ఒక్కసారి పరిశీలిద్దాం. హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లో శుక్రవారం పసిడి ధరలు ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములు రేటు రూ.1200 మేరా పెరిగి రూ.1,55,510 వద్ద ట్రేడింగ్ అవుతోంది. 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ 10 గ్రాములు రూ.1100 పెరగడంతో రూ.1,42,550 వద్ద ఉంది. కిలో వెండి రేటు ధరలో ఎలాంటి మార్పులు లేవు. దీంతో ప్రస్తుతం రూ.2,55,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
ALSO READ: ఐఫోన్ 18 ప్రో తక్కువ ధరలో కావాలా? ఈ దేశాల్లో కొంటే ఇండియా కంటే చీప్
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో బంగారం-వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,670 వద్ద ఉంది. అదే 22 క్యారెట్ల ధర రూ.1,42,710 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్, కేరళంలో ఒకే మాదిరిగా ధరలు ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ.1,55,520 కాగా, 22 క్యారెట్ల ధరయితే రూ.1,42,560 వద్ద ఉంది. వెండి ధరలు ప్రస్తుతం కిలో రూ.2,55,000 ఉండగా, మిగతా నగరాల్లో అటు ఇటుగా కదులుతోంది. ఈ ధరలు కేవలం ఉదయం 6 గంటలకు మాత్రమే. 10 గంటల తర్వాత ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.