Jio vs Airtel: దేశంలో కోట్లాది మంది వినియోగదారుల రోజువారీ జీవితంలో రెండు ప్రధాన టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్ భాగమయ్యాయి. ఈరెండు కంపెనీలు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త కొత్త ప్లాన్‌లను తరచుగా విడుదల చేస్తుంటాయి. ఇప్పుడు 84 రోజుల వాలిడిటీతో పాటు రోజుకు 2 జీబీ డేటా ఇచ్చే ప్లాన్‌లకు డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది.
ఇక ఇప్పుడు ఈ ప్లాన్‌లలో నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రీమియం ఓటీటీ సర్వీస్ కూడా ఉచితంగా అందిస్తే మరీ బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు తాజాగా జియో, ఎయిర్‌టెల్ రెండూ 84 రోజుల ప్లాన్‌లలో నెట్‌ఫ్లిక్స్ సదుపాయాన్ని కలిపి ప్రకటించి వినియోగ దారులను ఆకట్టుకునేందుకు ప్లాన్ వేస్తున్నాయి. మరి ఇప్పుడు వినియోగదారుల దృష్టిలో ఏ ప్లాన్ ఉత్తమం అనేది ఇప్పుడు చూద్దామా.
జియో ఆఫర్
మొదటగా జియో గురించి మాట్లాడుకుంటే, ఈ కంపెనీ ఎప్పుడూ ఆకర్షణీయమైన రీచార్జ్ ఆఫర్లు ఇస్తూ టెలికాం మార్కెట్‌లో ముందంజలో ఉంటుంది. అంతేకాదు, జియో తాజాగా విడుదల చేసిన రూ. 1299 రూపాయల ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు అందిస్తారు. దీంతోపాటు, ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్‌క్రిప్షన్ ఉచితంగా ఇస్తున్నారు.
మీ ఫోన్‌లో నెట్‌ఫ్లిక్స్ యాప్ ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసుకోవచ్చు. అంతటితో ఆగలేదు, జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ వంటి సర్వీసులకు కూడా యాక్సెస్ ఇస్తారు. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ వర్షన్ కాబట్టి ఇది ఫోన్ వరకు మాత్రమే పరిమితం అవుతుంది, కానీ ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఓటీటీ కంటెంట్ చూడటం ఒక పెద్ద సౌకర్యమే అవుతుంది.
ఎయిర్‌టెల్ ఆఫర్
రెండోది ఎయిర్‌టెల్ ఆఫర్ వైపు చూస్తే, ఈ కంపెనీ కూడా వినియోగదారుల అనుగుణంగా, తన ప్లాన్‌లను విస్తరిస్తూ వస్తోంది. ఎయిర్‌టెల్ యొక్క రూ.1499 ప్లాన్ కూడా 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో కూడా రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉన్నాయి. ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్ క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ బేసిక్ అంటే మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ అన్ని పరికరాల్లో కూడా చూడగలిగే సదుపాయం ఉంటుంది. అదనంగా, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, వింక్ మ్యూజిక్, అపోలో 24/7, హలో ట్యూన్స్ వంటి సేవలు కూడా అందులో ఉన్నాయి. అంటే, జియోలో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ మాత్రమే అందిస్తే, ఎయిర్‌టెల్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ఇస్తుంది, ఇది మరింత విస్తృత ఉపయోగం కలిగినది.
Also Read: Amazon Diwali Offers: అమెజాన్ దీపావళి సేల్ మిస్ అవ్వొద్దు.. రూ.500లో బెస్ట్ ఇయర్‌బడ్ డీల్స్..
ఈ రెండింటిలో ఏది బెస్ట్ ప్లాన్?
జియో, ఎయిర్ టెల్, ఈ రెండు ప్లాన్‌లు డేటా పరంగా చూస్తే రెండింటిలోనూ సమానమే. రోజుకు 2 జీబీ, 84 రోజుల వాలిడిటీ. కాల్‌లు, ఎస్‌ఎంఎస్‌లు కూడా ఒకేలా ఉంటాయి. తేడా ప్రధానంగా నెట్‌ఫ్లిక్స్ సదుపాయంలో ఉంటుంది. జియోలో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ మాత్రమే, అంటే ఒకే ఫోన్‌లో మాత్రమే చూడగలిగే విధంగా ఉంటుంది. ఎయిర్‌టెల్‌లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ కాబట్టి ఫోన్ తో పాటు ల్యాప్‌టాప్, టీవీ వంటి పరికరాల్లో కూడా లాగిన్ కావచ్చు. కాబట్టి ఓటీటీ కంటెంట్‌ను పెద్ద స్క్రీన్‌లో ఆస్వాదించాలనుకునే వారికి ఎయిర్ టెల్ ప్లాన్ బెటర్ అనిపిస్తుంది.
అయితే జియో ప్లాన్‌లో జియో సినిమా, జియో టీవీ వంటి ప్రత్యేక యాప్‌లు ఉండటం వల్ల మరిన్ని సినిమాలు, సీరియల్స్ ఉచితంగా చూడగల సౌకర్యం లభిస్తుంది. అంటే నెట్‌ఫ్లిక్స్ కంటే బయట కూడా అదనపు కంటెంట్ కావాలంటే జియో బెటర్ ఆప్షన్ అవుతుంది. కానీ నెట్‌ఫ్లిక్స్‌ను ఉపయోగించాలనుకునే వారికి ఎయిర్ టెల్ ఉత్తమ ఎంపిక అవుతుంది.
టెలికాం కంపెనీలు ఇప్పుడు కేవలం కాల్, డేటా మాత్రమే కాదు, వినోదాన్ని కూడా అందించే దిశగా పోటీపడుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+హాట్‌స్టార్ వంటి ఓటీటీ సర్వీసులను ఉచితంగా ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే నెలల్లో ఈ పోటీ ఇంకా పెరగడం ఖాయం. కనుక మీరు రీచార్జ్ చేసేముందు తాజా ప్లాన్ వివరాలను కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా చెక్ చేయండి. ఎందుకంటే ఆఫర్లు తరచుగా మారుతుంటాయి.